-పోలీసు శాఖలో సమస్యలపై ప్రశ్నించిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీస్ నుంచి తొలగించడం అన్యాయం
– ట్విట్టర్ లో టీడీపీ అధినేత చంద్రబాబు
సమస్యలను పరిష్కరించలేని దద్దమ్మ ప్రభుత్వం… సమస్యలపై నిలదీసిన వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం దారుణం. అనంతపురంలో “సేవ్ ఏపీ పోలీస్” అంటూ అమరవీరుల స్మారక స్థూపం దగ్గర నిరసనకు దిగిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ను సర్వీసు నుంచి తొలగించడానికి అక్రమ కేసులు మోపుతారా?
ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ చేసిన తప్పేంటి? పోలీసు శాఖలో ఉండే సమస్యలను పరిష్కరించమని జగన్ రెడ్డి దృష్టికి తేవాలనుకోవడం తప్పా? జగన్ రెడ్డి మాట మీద ఒక పోలీసు పైనే అక్రమకేసులు పెట్టారంటే, వైసీపీ నేతల మాటలు విని సామాన్యులను ఎంత వేధిస్తున్నారో అర్థం అవుతోంది.
ప్రకాష్ పై ప్రభుత్వం వ్యవహరిస్తోన్న తీరును ఖండిస్తున్నాను. ప్రకాష్ పై పెట్టిన అక్రమ కేసులను ఉపసంహరించుకోవాలి. అతనిని వెంటనే సర్వీసులోకి తీసుకోవాలి. అంతవరకు ప్రకాష్ కు అండగా ఉంటుంది తెలుగుదేశం.