నిజాయితీకి, త్యాగానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ

– నటుడిగా, రాజకీయనేతగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర
-హరికృష్ణ వర్ధంతి సందర్భంగా టీడీపీ జాతీయ కార్యాలయంలో నివాళి అర్పించిన టీడీపీ నేతలు

నిజాయితీకి, త్యాగానికి ప్రతిరూపం నందమూరి హరికృష్ణ అని, నటుడిగా, రాజకీయ నాయకునిగా తెలుగు ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశారని టీడీపీ నేతలు కొనియాడారు. హరికృష్ణ వర్దంతి సంధర్బంగా టీడీపీ నేతలు మంగళగిరిలోని టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. ఈ సంధర్బంగా టీడీపీ నేతలు మాట్లాడుతూ…

హరికృష్ణ నటుడిగా తెలుగు చిత్ర పరిశ్రమపై, నాయకునిగా రాష్ట్ర రాజకీయాలపై చెరగని ముద్ర వేశారు. నటుడిగా పలు సందేశాత్మక చిత్రాల్లో నటించిన హరికృష్ణ అన్న ఎన్టీఆర్ స్పూర్తితో ప్రజా సేవ చేసేందుకు రాజకీయ అరంగేట్రం చేశారు. పార్టీ స్దాపించిన రోజుల్లో హరికృష్ణ చైతన్య రధ సారధిగా అన్న ఎన్టీఆర్ కిIMG-20220829-WA0021 సేవలందిస్తూ ఎన్టీఆర్ తో పాటు రాష్ట్రమంతా పర్యటించారు. హరికృష్ణ రాష్ట్ర మంత్రిగా, శాసనసభ్యుడిగా, రాజ్యసభ సభ్యుడిగా ప్రజలకు, తెలుగుదేశం పార్టీకి విశేష సేవలందించారు. హరికృష్ణ ఏ పదవి చేపట్టినా ఆ పదవికి వన్నె తెచ్చారు. రాష్ట్ర విభజన నిర్ణయానికి నిరసనగా హరికృష్ణ తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. రాష్ట్రం కోసం తన పదవిని తృణప్రాయంగా త్యాగం చేసిన వ్యక్తి హరికృష్ణ అని టీడీపీ నేతలు కొనియాడారు.

ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమమహేశ్వరరావు, మాజీ డిప్యూటీ స్పీకర్ బోరగడ్డ వేదవ్యాస్, టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి గురజాల మాల్యాద్రి, టీడీపీ నాయకులు కొటారు దొరబాబు, కొత్తా నాగేంద్రకుమార్, బొద్దులూరి వెంకటేశ్వరరావు, భీమినేని వందనాదేవి, హషన్ భాషా, టీడీఎల్పీ సురేష్, ఓటర్ రామకృష్ణ, ఎస్పీ సాహెబ్, రైతు సాంబిరెడ్డి, పర్చూరి కృష్ణా, టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిల్లి మాణిక్య రావు, రాష్ట్ర మీడియా కోర్డినేటర్ దారపనేని నరేంద్రబాబు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply