మారేడుపల్లి రెవిన్యూ మండలం పరిధిలో అడ్డగుట్ట డివిజన్ పరిధిలో ఉప సభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ గురువారం విస్తృతంగా పర్యటించారు. అడ్డగుట్ట A,B,C. సెక్షన్స్ వెంకట్ నగర్,శాస్త్రినగర్, తదితర ప్రాంతాల్లో లబ్ధిదారుల ఇళ్ళ వద్దకే చేరుకొని కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్, cmrf చెక్కులను పద్మారావు
గౌడ్ అందించారు. కార్పొరేటర్ లింగాని ప్రసన్న శ్రీనివాస్, తెరాస యువ నేతలు తీగుల్ల కిషోర్ కుమార్, రామేశ్వర్, తహసిల్దార్ సునీల్ కుమార్ తో పాటు వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కాగా తన పర్యటనలో భాగంగా వివిధ స్థానిక సమస్యల పై కుడా తీగుల్ల పద్మారావు గౌడ్ వెన్వెంటనే స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 80 చెక్కులను 75 లక్షల రూపాయలు ఈ సందర్భంగా లబ్దిదారులకు అందించారు.
సికింద్రాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో గౌరవ ఉపసభాపతి తీగుల్ల పద్మారావు గౌడ్ చొరవతో అందించిన చెక్కులు :
కళ్యాణ లక్ష్మి, షాది ముబరాక్ — 2650– Rs. 23.50 కోట్లు
CMRF నిధులు (తెలంగాణా రాష్ట్రంలోనే ప్రధమం) 3900 — Rs. 34.50 కోట్లు
పెన్షన్లు (2019 మార్చి 31 నాటికి)
(మొత్తం 15,444) ప్రతినెలా Rs.3.36 కోట్లు.. Rs. 40.30 కోట్లు