Suryaa.co.in

Political News

వినాయకుడి పండుగకు డిజె పెట్టకూడదు కానీ.. రికార్డింగ్ డాన్సులు వేసుకోవచ్చట!

– వడ్డించే వారు మన వారు అయితే చాలు

సామాన్యంగా హుజూర్ నగర్ నియోజక వర్గంలో వివాహ శుభ కార్యాలకు ఎటువంటి ఘర్షణలు జరగకుండా సాంప్రదాయ బద్దంగా డి.జే నిర్వహించుకుంటం. పోలీసు అనుమతి కావాలని, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటూ ఉంటాం..అతి క్రమిస్తే చర్యలు తీసుకోoడి అని చెప్పిన సంబంధిత అధికారులు అనుమతిని ఇవ్వరు.

మొన్న జనవరి లో హుజూర్ నగర్ లో జరిగిన రామ స్వామి గట్టు వద్ద జాతరలో… చరిత్రలో ఎప్పుడు లేని విధంగా అక్కడ ఉన్న ప్రాచీన సంప్రదాయాలకు విరుద్ధంగా, అధికార పార్టీ కి చెందిన కొందరు నాయకులు, అక్కడ లైటింగ్ ప్రభ ఏర్పాటు చేసి ఆంధ్ర కు చెందిన మహిళల తో , రికార్డు డాన్సులు వేయించి సాంప్రదాయ పద్దతి లో జరిగే స్వామి వారి కళ్యాణం భ్రష్టు పట్టించారు. అక్కడ భక్తి కాకుండా రక్తి కల్పించేలా రికార్డింగ్ డాన్సులు ఏర్పాటు చేసి, భక్తుల మనో భావాల కు భంగం కలగ చేశారు.. ఈ విషయంపై హుజూర్ నగర్ ప్రజలు, కార్యక్రమం ఏర్పాటు చేసిన వారికి లోలోన శాపనార్థాలు పెట్టారు.

ఇది ఒక భాగం అయితే … జాతర ల పేరిట అధికారం అడ్డం పెట్టుకొని హుజూర్ నగర్ నియోజక వర్గం లో, అయిన దానికి కానీ దానికి ఏదో ఒక కార్యక్రమం గ్రామాల్లో పెట్టి, విస్తృతంగా రికార్డింగ్ డాన్సులు వేయించారు…అప్పుడు నో రూల్స్…నో కేసులు…

నేడు హుజూర్ నగర్ లో తెలంగాణలో జరిగే అతి రెండవ పెద్ద పండుగ ముత్యాలమ్మ పండుగ. ఈ పండుగకు హుజూర్ నగర్ కు చెందిన వారు ఎక్కడ ఉన్న, ఈ పండుగకు వచ్చి అమ్మవారిని దర్శించుకొని తమ మొక్కులు తీర్చుకుంటారు. కొందరయితే ఎడ్ల బండి లేదా ట్రాక్టర్ల పై వారి శక్తి సామర్ధ్యాలు బట్టి , ఘనంగా ఆ ప్రభ బండ్లకు లైటింగ్ ఏర్పాటు చేసి వారి బంధుగణంతో.. సంతోషం తో డి.జే ఏర్పాటు చేసుకొని చిందులు వేసుకుంటూ, అమ్మ వారిని దర్శించుకొని మొక్కలు తీర్చుకొని అనందంగా పండుగ జరుపుకుంటారు. కానీ హుజూర్ నగర్ లో డి.జే పెట్టే వారి పై కేసులు పెడతామని, ముందే పోలీసులు హెచ్చరించారు…ఇది ముమ్మాటికీ స్థానిక ఎమ్మెల్యే కుట్ర అని పట్టణం లో గుస గుస మన్నారు స్థానికులు.

ఇప్పుడు వినాయకుడు…హిందువుల ప్రథమ పూజితం గణేశుడు…ఇది గల్లీ గల్లీ.. వాడ వాడల్లో దేశ వ్యాప్తంగా చిన్నారుల నుండి పెద్దల వరకు జరిపే నవరాత్రి ఉత్సవo వినాయక చవితి.. ఈ పండుగ జరపాలన్న డి జే పెట్టుకుంటేనే ఓ ఊపు వస్తోంది..(గమనిక ఇక్కడ అశ్లీల పాటలకు స్థానం లేదు)అయినప్పటికీ సంబంధిత అధికారులు వీటిని నిషేధించారు. నిబంధనలు అతిక్రమిస్తే కేసులు పెడతామని, ఆ ఉత్సవ నిర్వహణ కమిటీ నిర్వాహకులను సమావేశం పెట్టి హెచ్చరించారు…హిందువుల పండుగ అంటే, ఎందుకు ఈ వివక్షత చూపుతున్నట్లు?

అధికార పార్టీ నాయకులు ఎటువంటి అనుమతులు తీసుకోకుండా, ఆంధ్రా అమ్మాయి ల తో తెల్లవార్లూ డాన్సులు వేయించినప్పుడు, సంబంధిత అధికారులకు ఈ నిబంధనలు ఎందుకు గుర్తుకు రాలేదు?
అధికార పార్టీకి చట్టం చుట్టం అయిందా?
ఎప్పుడు వారే అధికారం లో ఉండరు కదా?
మరి ఇప్పుడు ఎందుకు ఈ వివక్ష?
ఆలోచించుకోండి అధికారుల్లారా? ప్రభుత్వాలు..ప్రజా ప్రతినిధులు ఎప్పుడు అధికారంలో ఉండరు..గుర్తుంచుకోండి…ఏదో ఒక రోజు ప్రభుత్వం..ప్రజా ప్రతినిధులు మారక తప్పదు..మీరు స్థాన చలనం కాక తప్పదు..అప్పుడు మీరు చేసిన లోపాలు వెతక తప్పదు. మీ పై భారం పడక తప్పదు.. అందుకే మీరు నీతి నిజాయితీ తో ఎక్కడ పని చేసిన చేయండి…కాక పోతే మహా అంటే transfer తప్ప, ఏ ప్రభుత్వం అధికారం లో ఉన్న మీరు నీతి నిజాయితీ తో పని చేసి, మీ కుటుంబాన్ని కాపాడుకోండి..మీ ఉద్యోగ ధర్మాన్ని పాటించండి. నిజం నిప్పులాంటిది. ఏలే వారికే ఎరుక…..

– సైదులు

LEAVE A RESPONSE