– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ
కల్వకుంట్ల కుటుంబం ప్రజలను రెచ్చగొట్టి పబ్భం గడువుకుంట్టున్నారని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ ఆరోపించారు. గురువారం సాయంత్రం పత్రిక ప్రకటన విడుదల చేసిన డీకే అరుణ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఆంధ్ర, తెలంగాణ పేరు చెప్పుకొని అమాయక యువత చావులకు కారకుడై, ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుని అమరుల కుటుంబాలను గాలికి వదిలి పెట్టిన దుర్మార్గులని డీకే అరుణ ద్వజమెత్తారు. ఇప్పుడు మళ్లీ ఉత్తర భారత దేశం, దక్షిణ భారత దేశం అంటూ కొత్త రాగం ఎత్తుకొని మరోసారి ప్రజలను పక్క దారి పట్టిస్తున్నారని బీజేపీ నాయకురాలు మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్రం కోసం కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తే, అవి కల్వకుంట్ల కుటుంబానికి కనిపిస్తలేవు, వినిపిస్తలేవా అని డీకే అరుణ ప్రశ్నించారు. ఈ విషయం పై బీజేపీ చర్చకు సిద్ధమని చెప్తే ఒక్క తెరాస నాయకుడు ముందుకు వచ్చే ధైర్యం లేక తోక ముడ్చుకున్నారని, తండ్రి కొడుకులకు ఓటమి భయం చుట్టుకుందని, ఎదో విధంగా దాని మరో సారి అధికారం దక్కించుకునేందుకు రోజుకో కొత్త వేషం వేస్తున్నారని ఆమె విమర్శించారు. మళ్లీ మోడీ అధికారంలోకి వస్తే, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం కలిపెస్తారని అనడం సిగ్గు మాలిన చర్య అని, అసలు బీజేపీ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇవ్వకపోతే , కాంగ్రెస్ బిల్లు పెట్ట గలుగుతుండేనో లేదో తెలుసుకుంటే మంచిదని డీకే అరుణ అన్నారు.