దళిత మహిళా క్రికెటర్ ఇళ్లును కూల్చివేసిన అధికారులకు సిగ్గు ఉందా?

– బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ

దళిత మహిళా క్రికెటర్ ఇళ్లును కూల్చివేసి వారికి గూడు లేకుండా చేసిన తెరాస పార్టీ నాయకులు, ప్రభుత్వ అధికారులకు ఏమాత్రం సిగ్గు ఉందా అని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు , తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ మహిళా విభాగం ఛైర్ పర్సన్ డీకే అరుణ ప్రశ్నించారు. శనివారం ఈ విషయం పై పత్రిక ప్రకటన విడుదలచేశారు.

ఇటీవల సికింద్రాబాద్ తుకారాం గేట్ వద్ద నివసిస్తున్న యువ మహిళా క్రికెటర్ భోగి శ్రావణి తల్లి చనిపోవడంతో , తండ్రి మల్లేష్ తో కలిసి నివసిస్తుంది. అయితే తెరాస నాయకుల ప్రలోభాలకు తలొగ్గి, శ్రావణి ఇల్లు శిథిలావస్థకు చేరిందని బూచి చూపుతూ గ్రేటర్ అధికారులు, శ్రావణి ఇంట్లో సామగ్రిని బయటపడేయడమే కాకుండా , జీఎచ్ఎంసీ అధికారులు ఇంటిని కూల్చి వేయడం పై డీకే అరుణ మండిపడ్డారు.

ఓ వైపు దళిత బందు అని గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి ఆయన కోటరీ , దళిత యువ క్రీడాకారిణికి గూడు లేకుండా చేసిన దౌర్భాగ్యులు తెరాస నాయకులనీ డీకే అరుణ ద్వజమెత్తారు. ఈ నెల 15 వ తేదీన పుదుచ్చేరి లో జరిగే టీ 20 లీగ్ మ్యాచ్ కు శ్రావణి వెళ్లాల్సి ఉండగా, గ్రేటర్ అధికారుల అత్యుత్సాహంతో యువ క్రీడాకారిణి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని డీకే అరుణ ఆవేదన వ్యక్తం చేసారు. కూల్చివేసిన చోటే ప్రభుత్వం శ్రావణి కు ఇల్లు నిర్మాణం చేయాలని, అదే విధంగా క్రీడల్లో కూడా ఆమె మరింత మెరుగ్గా రాణించేందుకు ప్రభుత్వం సహాయం చేయాలని డీకే అరుణ డిమాండ్ చేశారు.

Leave a Reply