Suryaa.co.in

Andhra Pradesh

అధైర్యపడకండి అండగా ఉంటా…

టీడీపీ నేతలకు చంద్రబాబు పరామర్శ
మున్సిపల్ ఎన్నికల్లో పోలీసుల చేతిలో వేధింపులకు గురైన కుప్పం పట్టణ టీడీపీ ‎అధ్యక్ష్యులు రాజశేఖర్ ను, నెల్లూరులో వైసీపీ నేతల వేధింపులతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీడీపీ నేత కప్పిర శ్రీనివాసులు సతీమణి రేవతిని టీడీపీ జాతీయ అధ్యక్ష్యులు నారా చంద్రబాబు నాయుడు ఫోన్ లో పరామర్శించారు. పోలీసులు, వైసీపీ నేతల వేధింపులకు భయపడొద్దని నాతో పాటు 70 లక్షలమంది టీడీపీ కుటుంబసభ్యులు మీకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు. తప్పు చేసినవారే భయపడాలి తప్ప తప్పుల్ని ప్రశ్నించినవారు కాదన్నారు.

LEAVE A RESPONSE