Suryaa.co.in

Andhra Pradesh

శ్రీకాంత్ రెడ్డి వ్యాఖ్యలతో వివేకానందరెడ్డి ఆత్మఘోషిస్తోంది

– వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక ఉన్నది రక్తసంబందీకులేనని తేలినా సిగ్గులేకుండా అబద్దాలా?
– వివేకా హత్యపై తప్పుడు ప్రచారం చేసిందెవరు వైసీపీ , బులుగు మీడియా కాదా?
-టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పంచుమర్తి అనురాధ 
వివేకానందరెడ్డి రక్తపు మడుగుల వెనుక ఉన్నది రక్తసంబందీకులేనని నిర్ధారణ అయిన తర్వాత కూడా వైసీపీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ‎అబద్దాలు చెప్పటం సిగ్గుచేటు. ఆయన చెబుతున్న అబద్దాలు విని వివేకా ఆత్మఘోషిస్తుంది. వివేకా హత్యపై తప్పుడు ప్రకటనలు చేసిన విజయసాయిరెడ్డి, సహా వైసీపీ నేతలు ఇప్పటికే చిక్కుల్లో పడ్డారు. వాళ్లను చూసైనా శ్రీకాంత్ రెడ్డి నిజాలు మాట్లాడాలి. వివేకా హత్య కేసులో ఎల్లో మీడియా అబద్దపు ప్రచారం చేస్తోదని ‎మాట్లాడటానికి సిగ్గనిపించటం లేదా? అసత్య ప్రచారం చేసిందెవరు? మీ బులుగు మీడియా, వైసీపీ నేతలు కాదా? వివేకా హత్యలో అసలు వాస్తవాలు బయటపడ్డాక కూడా వైసీపీ నేతలు అబద్దాలు చెప్పటం చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారు. అధికారం, అవినీతి డబ్బుల కోసం వైయస్ కుటుంబం ఎంతకైనా దిగజారుతుందని వివేకా హత్యతో మరోసారి రాష్ట్ర ప్రజలకు తెలిసింది. అన్నీ తెలిసి కూడా వివేకా హత్యను రాజకీయంగా వాడుకుని లబ్దిపొందిన వ్యక్తి జగన్ రెడ్డి కాదా? ఇంటి మనుషులే వివేకాను హత్య చేస్తే శ్రీకాంత్ రెడ్డి ఇంకా నీ బుర్రకధలు ఎవరికి చెబుతావు? మీ అబద్దాలు, దొంగ నాటకాలన్నీ ప్రజలు తెలుసు. గడికోట శ్రీకాంత్ రెడ్డి వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన మీడియాపైన, టీడీపీపైన ఎదురుదాడి చేస్తూ నేరస్థులకు వత్తాసు పలుకుతున్నాడు.
ఈ ప్రశ్నలకు శ్రీకాంత్ రెడ్డి సూటిగా సమాధానం చెప్పగలరా?
1. ఏది తప్పుడు మీడియా? వివేకానందరెడ్డి గుండెపోటుతో చనిపోయాడని ప్రసారం చేసిన సాక్షి వార్త నీలి మీడియా కాదా? నీలి మీడియాతో నిత్యం బద్దాల కాలుష్యం వెదజల్లుతూ నిజాలు చెప్పే మీడియాపై నోరు పారేసుకోవడం సిగ్గనిపించడంలేదా?
2. వివేకానందరెడ్డిని ఎమ్మెల్సీగా ఓడించింది వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబ పెద్దలని వివేకానందరెడ్డి గారే చెప్పింది నిజం కాదా? అవినాష్ రెడ్డిని నిలదీసింది వాస్తవం కాదా? ఈ నిజాన్ని కప్పిపుచ్చడానికి టీడీపీపై నిందలు వేయడం దుర్మార్గం కాదా?
3. కడప పార్లమెంట్ సీటు అవినాష్ రెడ్డికి కాకుండా తనకు గాని లేదా షర్మిలకు గాని ఇవ్వాలని వివేకానందరెడ్డి పట్టుబట్టింది నిజం కాదా? అడ్డు తొలగించుకోవడానికే సుపారి ఇచ్చి హత్య చేయించింది ఎవరో కడప జిల్లాలో తెలియంది ఎవరికి?
4. జగన్ రెడ్డి తొలుత సీబీఐ విచారణకు హైకోర్టులో కేసు వేసి.. తరువాత ఎందుకు ఉపసంహరించుకున్నారో? అసలు దోషుల్ని కాపాడాలనే ఉద్దేశం లేకపోతే సునీతమ్మకు ఎందుకు అండగా నిలవలేదు? సునీతమ్మ సీబీఐ విచారణకు కోర్టుకు ఎందుకు వెళ్లాల్సివచ్చింది? తనకు రక్షణ కావాలని ప్రాధేయపడాల్సిన స్థితి ఎందుకొచ్చింది?
5. హత్య ఆనవాళ్లు తుడిచేసినవారిపై ఏం చర్యలు తీసుకున్నారు?
6. పోస్టుమార్టం లేకుండానే దహనసంస్కారాలకు ఫ్రీజర్ తెప్పించింది నిజం కాదా?
7. గుండెపోటుతో చనిపోయారని విజయసాయిరెడ్డి మాట్లాడితే సాక్షి ఎందుకు ప్రసారం చేసింది?
8. నారాసుర రక్త చరిత్ర అని సాక్షిలో తాటికాయంత అక్షరాలతో రాయడం కుట్ర కాదా?
9. చంద్రబాబు హత్య చేయించారని జగన్ రెడ్డి చేసిన ప్రకటన దొంగే దొంగ దొంగ అని అరవడం కాదా?

LEAVE A RESPONSE