Suryaa.co.in

Food & Health

బ్రెయిన్ స్టోక్ ఎందుకొస్తుందో తెలుసా?

“బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. ఒక వైపు కాళ్ళూ చేతులు పడిపోయాయి. ఎన్ని మందులు వాడినా తిరిగిరాలేదు. వాటికి శక్తి రాలేదు”. అని అంటుంటారు. కొంతమంది పక్షవాతం వచ్చాక పూర్తిగా బెడ్ కే పరిమితమౌతుంటారు. ఒక్కోసారి పక్షవాతం వచ్చి హాస్పిటల్ లో కోమాలోకి వెళుతుంటారు.

ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసా?. పక్షవాతం లక్షణాలు కనబడగానే వెంటనే ఆసుపత్రికి వెళ్ళకపోవడం వలన. వెంటనే అంటే ఎంత త్వరగా?. గంటలోపల. ఏంటా లక్షణాలు?. ఒకవైపు మూతి వంకరగా పోవడం, మాటలు ముద్దగా రావడం, గర్తులేనట్టు పిచ్చిపిచ్చిగా మాట్లాడటం, శరీరం ఒకవైపంతా చచ్చుబడిపోవడం లేదా ఒకవైపంతా తిమ్మిర్లొచ్చినట్టుఅనిపించడం. ఇంట్లో ఎవరికి ఈ లక్షణాలు కనబడ్డా వెంటనే అలర్ట్ కావాలి. 108 కి ఫోన్ క్షణాల్లో కొట్టాలి. న్యూరాలజిస్ట్ ఉండే ఆసుపత్రికి ఎంత త్వరగా వెళితే అంత మంచిది. గంట లోపలే వెళ్ళగలిగితే…its awesome.

ఎందుకంత త్వరగా వెళ్ళాలి?. మొదట ముక్కులో నిమ్మకాయ రసం పిండుకుని చూస్తాం. ఎల్లిపాయ కరకరా నమిలితిని చూస్తాం అనుకునేవారు చదవనవసరం లేదు. కానీ బ్రెయిన్ స్ఠ్రోక్ వచ్చి రక్తనాళాలుbrain మూసుకుపోయి బ్రెయిన్ కణజాలానికి రక్త సరఫరా ఆగిపోయాక, బ్రెయిన్ కణజాలం మనతో మొరపెట్టుకుంటుంది. మీకు మూడు గంటలు సమయమిస్తున్నా. ఈ లోపల నన్ను కాపాడుకోండి అని. కాపాడుకోగలిగామంటే మనం జీవితాంతం బెడ్ రిడెన్ గా పడి ఉండనవసరం లేదు. సింపుల్. అందుకే అది మూడు గంటలు సమయం ఇచ్చింది కాబట్టి మనం గంటలోపల హాస్పిటల్ లో ఉండగలగాలి. ఎందుకంటే హాస్పిటల్ లో మిగిలిన రెండు గంటల్లో డాక్టర్లు ఏమైనా చేయగలరు కాబట్టి.

ఏం చేస్తారంటే. మొదట సీటీస్కాన్ చేయాలి. సీటీస్కాన్ లో రక్తనాళాల్లో రక్త సరఫరా ఆగిపోయిందని రూఢీ చేసుకున్నాక ఆ ఆగిపోయిన రక్తాన్ని పలుచన చేసి క్లాట్ ని కరిగించి మళ్ళీ సరఫరాను పునరుద్ధరించడానికి థ్రాంబోలైటిక్ ఇంజక్షన్ ఇస్తారు. ఇదంతా మూడు గంటల్లోపలే చేయాలి. లక్షణాలు కనబడ్డాక హాస్పిటల్ కి నాలుగైదు గంటల తర్వాత చేరుకుంటే ఈ థ్రాంబోలైటిక్ ఇంజక్షన్ ఇవ్వరు. ఇవ్వమన్నా ఇవ్వరు.

ఎందుకంటే అప్పటికే బ్రెయిన్ ఉబ్బిపోయి ఉంటుంది. ఇపుడుఇవ్వడం వలన లాభం ఉండదు. ఒక్కసారి నష్టం కూడా. ఉబ్బిపోయిన కణజాలం నుండి రక్తస్రావం జరిగి పేషంట్ చనిపోవచ్చు కూడా. కాబట్టి ఉన్న సమయం మూడుగంటలు. మూడు గంటల్లో హాస్పిటల్ లో ఉండాలి. ప్లస్ సీటీ స్కాన్ ఐపోయుండాలి. అపుడే థ్రాంబోలైటిక్ ఇంజక్షన్ ఇవ్వడం సాధ్యమౌతుంది. బ్రెయిన్ మనకిచ్చే ఈ మూడుగంటల సమయాన్నే విండో పీరియడ్ అంటాం.

థ్రాంబోలైటిక్ ఇంజక్షన్ ఇవ్వగానే చాలా డ్రమాటిక్ గా పేషంట్లు లేచి కూర్చుంటారు. ఏంటి మేము ఇక్కడెందుకున్నాం. ఏమయింది మాకు అని అడుగుతుంటారు. అంతగా సినిమా మారిపోతుంది. జీవితాంతం బెడ్ లోనే అన్ని కొనసాగిస్తూ బతకవలసిన వ్యక్తి మళ్ళీ మామూలు వ్యక్తిగా నవ్వుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడం జరగడం వింత కదా. That is science. కానీ , మన దేశంలో గంటలోపల హాస్పిటల్ వచ్చి ఇలా ఇంజెక్షన్లు తీసుకునేవారు ఎంత మంది ఉంటారో తెలుసా?.

వేలల్లో ఒక్కరు. ఎంత చెప్పినా వినకుండా అనవసరంగా చెట్లమందులనీ తాయెత్తులనీ తిరిగి, జీవితాంతం బెడ్ కి పరిమైపోతుంటారు. చాలా దా‌రుణం కదా. ఒకసారి అలాంటి పేషంట్ ని నా క్లినిక్ లో చూసి మీరు విండో పీరియడ్ లోనే ఉన్నారు వెంటనే హాస్పిటల్ కి వెళ్ళండి అని చెబితే సరే అని తలలూపారు. కానీ వీళ్ళు ఎవరికెవరికో ఫోన్లు చేస్తుంటారు ఆ సమయంలో. చూసిన ఎక్స్పర్ట్ డాక్టర్ చెప్పినది. వినరుగానీ ఫోన్లలో సో కాల్డ్ బంధువులు స్నేహితులు అనబడేవారు చెప్పే పుచ్చు సలహాలు వింటుంటారు. తీరా చూస్తే ఏమైంది. చెట్లమందు పోస్తే తగ్గుతుందని ఎవరో చచ్చు సలహా చెప్పారని అటెటో పోయారు. అతడిప్పటికీ బెడ్ మీద అన్నీ చేస్తున్నాడు. మాటలేదు. గుర్తుపట్టలేడు. ఇలా ఉంటుంది.

Doctor-Virinchi
– డాక్టర్ విరించి విరివింటి

 

LEAVE A RESPONSE