మోడీ ఇప్పటివరకు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదో తెలుసా?

ఎవరైనా జర్నలిస్ట్ పుసుక్కున బయట ప్రచారంలో ఉన్న మూడింటిలో మీ నిజమైన పుట్టిన రోజు ఏది అని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో అని భయం.
మీరు రైల్వే స్టేషన్లో చాయ్ అమ్మినప్పుడు అక్కడ రైల్వే స్టేషన్ లేదు కదా అంటే నిజం బయటపడుతుందని భయం
మీరు చిన్నప్పుడు చెరువు నుండి మొసలిని ఇంటికి తీసుకొచ్చాను అని చెప్పారు, కానీ మాజీ ఫారెస్ట్ ఆఫీసర్ మా దగ్గర ఎలాంటి ఆధారాలు లేవు, అది అసత్యం అని చెప్పారు కదా అని అడుగుతారు అని భయం.
మీరు ఈ మెయిల్ 1988 లోనే ఉపయోగించారు కదా! కానీ మన దేశంలో ఇంటర్నెట్ వచ్చింది 1995 లో, మరి మీకు
ఎలా సాధ్యమయ్యింది?
అని అడుగుతారని భయం.
మీరు డిజిటల్ కెమెరా 1988 లోనే ఉపయోగించాను అని చెప్పారు, కానీ ఇండియాలో డిజిటల్ కెమెరాల అమ్మకాలు మొదలుపెట్టింది 1991 లో కదా అని అడుగుతారు అని భయం.
మీరు 10వ తరగతి ఎక్కడ చదువుకున్నారు?
మీతో పాటు చదువుకున్న మిత్రులు ఉన్నారా అని అడిగితే
ఏమి సమాధానం చెప్పాలని భయం
మీరు 1978లో ఢిల్లీ యూనివర్సిటీలో డిగ్రీ చేసినట్టు కంప్యూటరైజ్డ్ మార్క్స్ షీట్ చూపిస్తున్నారు బాగానే వుంది కానీ అప్పుడు దేశంలో ఏ యూనివర్సిటీలో కంప్యూటరైజ్డ్ సిస్టం లేదు కదా మీకెలా సాధ్యమయ్యింది? అలాగే మొదటి సంవత్సరంలో నుండి మూడవ సంవత్సరం వరకు ఒకే
పేరుతో డిగ్రీ మార్క్స్ మెమో ఉంటుంది కానీ మీ పేరు ఎందుకు మారింది అని అడుగుతారు అని భయం.
బంగ్లాదేశ్ స్వాతంత్రం కోసం మీరు పోరాటం చేసి జైల్ కు కూడా పోయారు అని చెప్పారు కదా, ఏ జైల్లో ఉన్నారని అడిగితే ఏమి సమాధానం చెప్పాలో అని భయం.
అదానీకి, మీకు ఉన్న సంబంధం ఏమిటి ? అని అడిగితే ఏమి చెప్పాలో అని భయం.
ఇలా ఇన్ని భయాలు ఉన్నోడు ఎలా ప్రెస్ మీట్ పెడుతాడు?
మీరు మరీనూ!

– కంకణాల శ్రీనివాసరావు

Leave a Reply