Suryaa.co.in

Telangana

అవినీతి జాతిపిత కేసీఆర్ కావాలా..? అవినీతి రహితంగా పాలన చేస్తున్న మోడీ కావాలా?

– నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్

కేసీఆర్ ఎన్ని అడ్డంకులు సృష్టించినా..3వ విడత పాదయాత్రను బండి సంజయ్ దిగ్విజయంగా పూర్తి చేశారు. కేసీఆర్ ఎన్ని కుట్రలు చేసినా… బీజేపీ ఎదుగుదలను ఆపలేరు.వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ను కాషాయ తెలంగాణ చేయడం తధ్యం.కేసీఆర్ పంటల తెలంగాణ కావాలా? మంటల తెలంగాణ కావాలా? అంటుండు…
ఇప్పుడు నేను అడుగుతున్నా… పంట నష్టపోయిన రైతులను ఆదుకోని కేసీఆర్ కావాలా..? ఫసల్ బీమా యోజన అమలు చేస్తున్న మోడీ కావాలా? అంబేద్కర్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న మోడీ కావాలా…? కల్వకుంట్ల రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న కేసీఆర్ కావాలా…? నిరుద్యోగ భృతి ఇవ్వని కేసీఆర్ కావాలా?… మేక్ ఇన్ ఇండియా, స్టాండ్ అప్ ఇండియా ఇస్తున్న మోడీ కావాలా..?అవినీతి జాతిపిత కేసీఆర్ కావాలా..? అవినీతి రహితంగా పాలన చేస్తున్న మోడీ కావాలా? కల్వకుంట్ల చంద్రశేఖరరావు లాంటి కేడీ కావాలా…? దేశాన్ని అభివృద్ధి పథంలో దూసుకుపోయేలా చేస్తున్న మోడీ కావాలా..?

వరంగల్ గడ్డ నుంచే… కేసీఆర్ ను బొందపెట్టే రోజు వస్తుంది
– రావు పద్మ, బీజేపీ హన్మకొండ అధ్యక్షురాలు:
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రలో ఈటెల రాజేందర్ ను గెలిపించుకున్నాం.రెండో విడత సంగ్రామ యాత్రలో అమిత్ షా సభను నిర్వహించుకున్నాం.ఉద్యమాల గడ్డ… తెలంగాణ గడ్డ.పాదయాత్రను అడ్డుకోవాలని చూసినా… కోర్టు అనుమతించింది.వరంగల్ ను డల్లాస్ చేస్తా అన్న కేసీఆర్ హామీ ఏమైంది?ప్రధాని ఇచ్చిన నిధులను కేసీఆర్ పక్కదారి పట్టించాడు.ఇచ్చిన హామీలను విస్మరించాడు కేసీఆర్.కేసీఆర్ మాయమాటలు చెప్పే… రెండు సార్లు అధికారంలోకి వచ్చాడు.తెలంగాణ లో కుటుంబ, అవినీతి, అక్రమ, మాఫియా పాలన సాగుతోంది.సభను అడ్డుకునేందుకు ఎన్ని ఆటంకులు సృష్టించినా.. చివరికి ధర్మమే గెలిచింది. వరంగల్ గడ్డ నుంచే… కేసీఆర్ ను బొందపెట్టే రోజు వస్తుంది.

LEAVE A RESPONSE