కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా?
నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరిగిన రైతు సదస్సు అనంతరం మీడియాతో మాట్లాడిన బండి సంజయ్
నిన్న చిక్కడపల్లి లో ప్రవల్లిక అనే యువతి ఆత్మహత్య చేసుకోవడం దారుణం.ప్రవల్లిక తల్లిదండ్రులకు ఫోన్ చేసి పరీక్షలు పోస్ట్ పోన్ అవుతున్నాయని, మీరు నాకోసం ఎంతో కష్టపడ్డారని వాళ్ళ అమ్మ నాన్న తో ఫోన్ లో బాధపడింది.ఆమె మృతికి నిరసనగా యువత మొత్తం కదలి వచ్చింది.లక్ష్మణ్, భానుప్రకాష్ కూడా వెళ్లి వాస్తవాలను తెలుసుకుందామని వెళ్లారు.
కానీ ప్రభుత్వానికి అది నచ్చక పోలీసులతో లాఠీ చార్జీ చేశారు.లక్ష్మణ్ ఎంపీ అని కూడా చూడకుండా ఈడ్చుకెళ్లి అరెస్ట్ చేస్తారా?విద్యార్థులు, రైతులు ఆత్మహత్య చేసుకున్న స్పందించని మూర్ఖుడు కేసీఅర్.సిగ్గులేకుండా ఇంకా మళ్ళొసారి అవకాశం ఇవ్వాలని అడుగుతున్నాడు.కుటుంబంలో మనోధైర్యం నింపకుండా పోలీసులతో లవ్ ఫెయిల్యూర్ అని అబద్ధాలు చెప్పిస్తున్నాడు.
థు.. నీదీ ఒక బతుకేనా?పోలీసుల తప్పుడు ప్రకటనల వల్ల ఆ కుటుంబం కుమిలిపోతోంది.ఆమె లవ్ ఫెయిల్ వల్ల చనిపోయిందని అబద్ధపు లేఖలు సృష్టించేందుకు కూడా కేసీఆర్ వెనుకాడరు.నిరుద్యోగులకు అండగా మేముంటాం.రాష్ట్రంలోని 50 లక్షల మంది నిరుద్యోగులకు చేతులు జోడించి కోరుతున్నా…..మీరు కోచింగ్ సెంటర్లు మొత్తం బంద్ చేసి మీ గ్రామాలకు వెళ్ళండి.
50 రోజులపాటు బీఅరెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేయండి. కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న అరాచకాలను వివరించి బీజేపీకి ఓటు వేసేలా చూడండి. బీజేపీ అధికారంలోకి వచ్చాక ఏడాదిలోపు 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసి నియామక పత్రాలు అందజేసే బాధ్యత నేను తీసుకుంటా. ఈ మేరకు అధిష్టానాన్ని ఒప్పిస్తా.ఉద్యోగులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తలుచుకుంటే ప్రభుత్వం కూలడం పెద్ద మ్యాటర్ కాదు.
ఉద్యోగులకు జీతాలు కూడా అందించలేని పరిస్థితి కేసీఅర్ పాలనలో నెలకొంది.మీకు చేతులు జోడించి అడుగుతున్నా.మీకోసం జైలుకు వెళ్లిన అన్నగా అడుగుతున్నా.50 రోజులు కొట్లాడండి.. బీజేపీకి అండగా నిలవండి.నవంబర్ 30 కేసీఆర్ కు డెడ్ లైన్ కావాలి. కేసీఆర్ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో వేయాలి.
కల్వకుంట్ల రాజ్యాంగం కావాలా.. అంబేద్కర్ రాజ్యాంగం కావాలా?కాంగ్రెస్, బిఆరెస్ ఒక్కటే. కర్ణాటక లో 40 కోట్లు దొరికాయి. తెలంగాణ ఎన్నికల కోసం వాటిని తరలించాలనుకున్నారు.బోరబండలో బిఆరెస్ పార్టీ నేత ఇంట్లో డ్రగ్స్ దొరికాయి.ఎన్నికల కోసమే విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అందిస్తున్నారు.3+3=6.. బిఆరెస్ ఇంటికి పోవడం ఫిక్స్.గత పార్లమెంట్ ఎన్నికల్లో కారు షెడ్డుకు పోయింది.. సారు ఫామ్ హౌజ్ కు.. 16 ఎక్కడ పోయిందో వారికే తెలియాలి.