Suryaa.co.in

International

వీడు డాక్టరా?.. రేపిస్టా?

– 299 మంది రోగులపై వైద్యుడి అత్యాచారం
– వీరిలో ఎక్కువ మంది చిన్నారులే
– 74 ఏళ్ల జోయెల్‌ లి స్కౌర్నెక్‌ అఘాయిత్యాలకు ఉరే సరంటున్న ఫ్రాన్స్ జనం

పవిత్రమైన వైద్య వృత్తిలో ఉన్న ఓ వైద్యుడు విచక్షణ మరిచి క్రూరంగా ప్రవర్తించాడు. తన వద్దకు వచ్చే రోగులకు వైద్యం చేసి నయం చేయవలసింది పోయి వారిపై అకృత్యాలకు ఒడి కట్టాడు. అలా మూడు దశాబ్దాల పాటు తన సర్వీసులో ఏకంగా 299 మంది రోగులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీరిలో ఎక్కువ మంది చిన్నారులే కావటం మరింత విచారకరం.

ఫ్రాన్స్ దేశంలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ అత్యంత దారుణమైన ఘటనపై పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఫ్రాన్స్‌లోని బ్రిటానీ అనే ప్రాంతంలో 74 ఏళ్ల జోయెల్‌ లి స్కౌర్నెక్‌ అనే వైద్యుడు గతంలో ఓ ఆసుపత్రిలో సర్జన్‌ గా పని చేసేవాడు. 1989 నుంచి 2014 మధ్య అతడి వద్దకు వచ్చే రోగు లపై లైంగిక దాడి చేశాడు. వారు మత్తులో ఉండగా ఈ దారుణానికి పాల్పడేవాడు.

అయితే జోయెల్ నిజస్వరూపం మాత్రం 2017లో బయటపడింది. తన పొరుగింట్లో ఉంటే ఆరేళ్ల చిన్నారిపై నింది తుడు అసభ్యంగా ప్రవర్తిం చటంతో కేసు నమోదైంది. ఈ కేసు దర్యాప్తులో భాగం గా పోలీసులు నిందితుడు జోయెల్ ఇంటిని తనిఖీ చేయగా విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి.

తన ఇంట్లో ఏకంగా 3 లక్షలకు పైగా ఫొటోలు, 650లకు పైగా అశ్లీల వీడియోలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మరో షాకింగ్ విషయమే మిటంటే.. చిన్నారులు, జంతువులకు ఎక్కువగా ఆకర్షితుడై శృంగార కార్యక లాపాలు నెరుపుతున్నట్లు నిందితుడి డైరీలో రాసుకున్నాడు.

అంతేకాదు, ఎవరెవరిపై ఎలా లైంగిక దాడి జరిపాడో వంటి విషయాలను ఎప్పటి కప్పుడు నోట్ చేసుకోవడా న్ని గుర్తించి పోలీసు అధికారులు సైతం నిర్ఘాంతపోయారు. నాలుగు నెలలుగా ఈ కేసు విచారణ ముమ్మరం చేశారు. తాజాగా అతడు కోర్టులో నేరాన్ని అంగీకరించాడు 1989 నుంచి 2014 మధ్య 158 మంది అబ్బాయిలు 141 మంది అమ్మాయిలపై అతను అత్యాచారానికి పాల్పడినట్లు న్యాయ స్థానంలో తెలిపారు.

వీరిలో అత్యధికులు చిన్నారులేనని పేర్కొన్నాడు నేను చాలా ఘోరమైన పనులు చేశా నా చర్యలకు పూర్తి బాధ్యత వహిస్తున్న అని జోయల్ కోర్టుకు తెలిపారు. దీనిపై రేపు విచారణ కొనసాగనుంది, ఒకవేళ అతడు దోషిగా తేలితే జోయల్ చనిపోయే వరకు కఠిన కారాగార శిక్ష పడే అవకాశం ఉంది.

LEAVE A RESPONSE