Suryaa.co.in

Andhra Pradesh

ఎల్లో బ్యాచ్‌కు త్యాగాలకు అర్ధం తెలుసా?

-కర్నూలులో హైకోర్టు మా రాయలసీమ హక్కు
-ఈ విషయంలో రాజీ పడే ప్రసక్తి ఏ మాత్రం లేదు
-త్వరలో మంత్రులు, ప్రజా ప్రతినిధులు, మేధావులతో భేటీ
-జేఏసీ ఏర్పాటు చేస్తాం. వికేంద్రీకరణ కోసం కృషి చేస్తాం
-అరసవెల్లి యాత్రలో పాల్గొంటున్నది రైతులే కాదు
-స్వార్థం కోసం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారుల నడక
-పాదయాత్ర పేరుతో ఉత్తరాంధ్రపై ఒక దండయాత్ర
-అందుకే డ్రామాలు. రెచ్చగొట్టే విధంగా ప్రసంగాలు
-ఆకుపచ్చ కండువాలు వేసుకున్నంత మాత్రాన రైతులు కారు
-రైతుల త్యాగం అంటే నిజంగా రాయలసీమ వారిది
-నెల్లూరులో సోమశిల ప్రాజెక్టు కోసం భూములిచ్చారు
-శ్రీశైలం, నాగార్జునసాగర్‌ నిర్మాణంలో ఊళ్లు కోల్పోయారు
-కడప వైయస్సార్‌సీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి

కడప: ప్రెస్‌మీట్‌లో ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి ఏం మాట్లాడారంటే..:

అమరావతిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌:
అమరావతి నిర్మాణం జరిగింది. దాన్ని చంద్రబాబు పూర్తి చేశారు. జగన్‌గారు అడ్డుకుంటున్నారు అని అంటున్న వారు సిగ్గు పడాలి.అమరావతి ప్రాంతంలో రాజధాని వస్తుందని ముందే తెలుసుకుని, అక్కడ ఎవరెవరు భూములు కొన్నారు.. ఎవరు ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడ్డారు.. అన్నది ఆధారాలతో సహా ఏకంగా అసెంబ్లీలోనే చూపించడం జరిగింది.
ఎవరెవరు, ఎక్కడ, ఎంత భూమి కొన్నారు. ఎప్పుడు రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారనేది కూడా చూపాం. అమరావతి నోటిఫికేషన్‌కు ముందే అక్కడ టీడీపీ నాయకుల బినామీలు భూములు ఎందుకు కొన్నారన్న దానికి మాత్రం సమాధానం చెప్పరు.

ఆడి కార్లు. ఐఫోన్లు:
ఇప్పుడు అక్కడ భూములు ధరలు మళ్లీ పెరగాలని, తమ రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగా జరగాలని కోరుకుంటూ, ఇవాళ రైతుల ముసుగులో పాదయాత్ర చేస్తున్నారు. ఆడికార్లు, ఐఫోన్‌లు, ఐవాచ్‌లు పెట్టుకుని పాదయాత్ర చేస్తున్న వారు, ఒకరోజు రొటీన్‌ కార్యక్రమంగా నడుస్తున్నారు. తమ ఆరోగ్యం కోసం ఎంత దూరం నడిచానమనేది చూసుకుంటూ పాదయాత్ర చేస్తున్నారు. యాత్రలో డ్యాన్స్‌లు చేస్తున్నారు. ఇంకా వారి నాటకాలు, ఆర్భాటాలు చూస్తుంటే అసలు దాన్ని పాదయాత్ర అంటారా? నిజానికి అది పాదయాత్ర కాదు. ఉత్తరాంధ్రపై ఒక దండయాత్రలా వారి పాదయాత్ర కొనసాగుతోంది.

చంద్రబాబు క్షమాపణ చెప్పాలి:
నిజానికి గతంలో రాయలసీమకు చేసిన అన్యాయానికి చంద్రబాబు క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నాం. తన 14 ఏళ్ల పాలనలో రాయలసీమకు అన్ని విధాలుగా మోసం చేశారు. దీనిపై అందరిలో ఆగ్రహం ఉంది. అది బయట పడిన రోజు చంద్రబాబు భస్మం అయిపోతారు.
ఎన్టీ రామారావుగారి హయాంలో హంద్రీనీవాకు డిజైన్‌ చేశారు. కానీ పనులు మాత్రం చేయలేదు. ఆ తర్వాత దాన్ని చంద్రబాబు అస్సలు పట్టించుకోలేదు. పైగా హంద్రీనీవా, గాలేరు నగరి పథకాల వల్ల పెద్దగా ప్రయోజనం ఉండబోదని, గండికోటకు 20 టీఎంసీలు అవసరం లేదని, కేవలం 2 టీఎంసీలు సరిపోతాయంటూ జీఓ జారీ చేశారు. దీనిపై మీకు దమ్ముంటే చర్చకు రండి. మాట్లాడుదాం. అలాగే హంద్రీనీవా ప్రాజెక్టు కూడా పెద్దగా పనికి రాదని, దానికి 40 టీఎంసీలు అవసరం లేదని చెప్పి, 5 టీఎంసీలు చాలంటూ అప్పటి సీఎం చంద్రబాబు ఉరవకొండ వద్ద భూమి పూజ చేసిన మాట వాస్తవమా? కాదా?.
ఆ తర్వాత 1999లో రెండోసారి సీఎం అయిన తర్వాత కూడా, అదే ప్రాంతంలో మరో శిలా ఫలకం వేసి, ప్రాజెక్టును నిర్వీర్యం చేశారు. హంద్రీనీవా అవసరం లేదంటూ జీఓ కూడా జారీ చేశారు. అదే విధంగా గాలేరు నగరి కూడా వద్దన్నారు.

వైయస్సార్‌ హయాంలో..:
అలాంటి ప్రాంతంలో ప్రాజెక్టులు చేపట్టిన స్వర్గీయ రాజశేఖర్‌రెడ్డిగారు సస్యశ్యామలం చేశారు. అలా గొల్లపల్లి ప్రాజెక్టులో నీరు రావడం వల్లనే అక్కడ కియా పరిశ్రమ ఏర్పాటైందన్న విషయాన్ని ఎవరైనా చెబుతారు. ఆనాడు వైయస్సార్‌ మొదలు పెట్టిన ప్రాజెక్టుల్లో గండికోటను, ఆయన తనయుడు జగన్‌గారు పూర్తి చేశారు. అదే విధంగా పోతిరెడ్డిపాడు నుంచి 11 వేల క్యూసెక్కులకు బదులు 76 వేల క్యూసెక్కులు వచ్చేలా చేశారు.

చంద్రబాబు రెచ్చగొట్టే ప్రసంగం:
రాయలసీమకు అన్ని విధాలుగా అన్యాయం చేసిన చంద్రబాబు, చివరకు ఇవాళ కూడా అక్కడ హైకోర్టు వద్దంటున్నాడు. అదే మేము అమరావతిని వ్యతిరేకించడం లేదే? కానీ వారు మాత్రం దురుద్దేశంతో ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టి, ప్రయోజనం పొందాలని చూస్తున్నారు.
అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు.. అంటూ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రసంగ వీడియో చూపారు.
‘చావు చచ్చిపోయింది మీకు. అసలు మీకు రోషం లేదు. సిగ్గుందా? లేదా?. ’ అంటూ చంద్రబాబు మాట్లాడారు. అక్కడ ఓడిపోతే వికేంద్రీకరణకు అనుమతించినట్లు అని చంద్రబాబు అన్నారు. మరి అక్కడ ఓడిపోయారు.. అంటే, వికేంద్రీకరణను ప్రజలు ఆమోదించినట్లే కదా?

ఎల్లో బ్యాచ్‌కు త్యాగాలకు అర్ధం తెలుసా?:
మాకు రైతులు అంటే చాలా గౌరవం. కానీ మేము రైతులకు వ్యతిరేకం అని ప్రచారం చేస్తున్నారు. నిజానికి అరసవెల్లి పాదయాత్రలో పాల్గొంటున్నది రైతులేనా? కాదా? అని ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి.
నిజమైన రైతులు ఎవరంటే.. నెల్లూరు జిల్లాలో పచ్చదనం కోసం కడప జిల్లా బద్వేలు, రాజంపేట ప్రాంత రైతులు భూములు ఇచ్చారు. అదే విధంగా శ్రీశైలం, నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుల కోసం ఊళ్లు, భూములు కోల్పోయిన వారు. వారే నిజమైన రైతులు. కృష్ణా డెల్టా కింద తమ భూములు ఇచ్చిన వారు నిజమైన రైతులు. వారు నిజమైన త్యాగధనులు. వారిది త్యాగం అంటే.
అంతేతప్ప ఆకుపచ్చ కండువాలు వేసుకుని, ఆడి కార్లలో తిరిగే వారు రైతులు కారు. ఐఫోన్లు, ఐవాచ్‌లు వాడే వారు రైతులు కారు. తొడ గొడుతూ రెచ్చగొట్టే వారు రైతులు కారు. ఆరోగ్యం కోసం లెక్కలు వేసుకుంటూ నడిచే వారు రైతులు కారు.

అమరావతిలో ఏం కట్టారు?:
అసలు మేము అడుగుతున్నాం. కర్నూలులో హైకోర్టు ఎందుకు ఏర్పాటు చేయొద్దు? మేము నగరాల నిర్మాణం కోరడం లేదు. అదే అమరావతి అయితే, అన్నీ నిర్మించాల్సి ఉంది. అమరావతిలో రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ఏముంది అక్కడ? కనీసం టీ కొట్టు కూడా లేదు.
అదే వి«శాఖలో అన్ని సదుపాయాలు ఉన్నాయి. అది అభివృద్ధి చెందిన నగరం. అక్కడ తక్కువ పెట్టుబడితో రాజధాని ఏర్పాటు చేయొచ్చు.

దానికి బాధ్యుడు బాబు కాదా?:
ఇవాళ రాష్ట్రానికి రాజ«ధాని లేకుండా మమ్మల్ని తిడుతున్నారు. కానీ అ పని చేసింది ఎవరు? చంద్రబాబు కాదా? అమరావతిలో రాజధానిని గ్రాఫిక్స్‌లో చూపడం తప్ప, అక్కడ కట్టిందేమీ లేదు. మరి తప్పు చేసింది ఎవరు?
అదే డబ్బును గుంటూరు, విజయవాడ, విశాఖ వంటి సిటీల్లో ఖర్చు చేసి ఉంటే ఎంతో బాగుండేది. అవి ఇంకా ఎంతో అభివృద్ధి చెంది ఉండేవి. అమరావతి రాజధాని అని కూడా, కనీసం విజయవాడ, గుంటూరులో కట్టలేదు. ఎక్కడో 40 కి.మీ, 50 కి.మీ దూరంలో కట్టాడు. అది కూడా పూర్తి చేయలేదు. ఇవాళ విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తామంటే కోర్టును ఆశ్రయించింది ఎవరు?

జేఏసీ ఏర్పాటు చేస్తాం:
కొన్నాళ్ల క్రితం అమరావతి నుంచి తిరుపతి పాదయాత్ర చేశారు. మొత్తం డ్రామా. రెచ్చగొట్టే ప్రయత్నం. అయినా భరించాం. కానీ ఇప్పుడు భరించం. త్వరలోనే మేము కూడా జేఏసీ ఏర్పాటు చేసుకుని, పోరాడతాం. రాయలసీమ అభివృద్ధిని అడ్డుకుంటే, కర్నూలులో హైకోర్టు వద్దనే వారిని ఉపేక్షించబోము.
ఇక చంద్రబాబు దత్తపుత్రుడు. రాజధానిపై ఆయన రోజుకో మాట మాట్లాడారు. ఎక్కడికి పోతే అక్కడే రాజ«ధాని కావాలన్నారు. ఆయన ఎన్ని రకాలుగా మాటలు మాట్లాడుతున్నాడనేది అందరూ గమనించాలి.
నిజానికి శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీలు ఏం చెప్పాయో ఒకసారి చూడండి. వాటిలో నిపుణులు ఉన్నారు. వారు నెలల పాటు అధ్యయనం చేసి నివేదికలు ఇచ్చారు. అలాగే ఆనాడు శ్రీబాగ్‌ ఒప్పందంలో ఏం చెప్పారో, దాన్ని అమలు చేయమంటున్నాం. ఇంకా శ్రీకృష్ణ, శివరామకృష్ణ కమిటీలు ఏం చెప్పాయనేది చూడమంటున్నాం. కాబట్టి రాయలసీమ వాసులను ఒకటే కోరుతున్నాను. శ్రీకృష్ణ, శివరామకృష్ణన్‌ కమిటీల నివేదికలు చదవాలి.

సమాధానం చెప్పండి:
ఇక బీజేపీ నాయకులు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఆరోజు మీరు డిక్లరేషన్‌ చేశారు. కర్నూలులో హైకోర్టు పెడతామన్నారు. మరి ఇవాళ ఎందుకు మాట్లాడడం లేదు. అక్కడ ౖహైకోర్టు పెట్టడం అనేది బీజేపీ చేతిలో ఉంది. రాయలసీమలో హైకోర్టు మా హక్కు. కర్నూలులో హైకోర్టు అనేది మా హక్కు. దీన్ని అడ్డుకుంటే మేము ఉపేక్షించేది లేదు. దీనికి బిజేపీ విష్ణువర్ధన్‌రెడ్డి సమాధానం చెప్పాలి. అలాగే టీజీ వెంకటేశ్‌. ఆయన కూడా ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. పార్టీలు మార్చి పదవులు పొందిన ఆయన, కర్నూలులో హైకోర్టు కావాలని ఎందుకు అడగడం లేదు. సిగ్గు శరం లేదని అంటున్నాడు. ఆయన మొన్నటి వరకు ఎంపీగా ఉన్నారు. మరి కర్నూలులో హైకోర్టు కోసం ఎందుకు మాట్లాడలేదు? ఆ విధంగా ఆయన కూడా మోసం చేశాడు. కానీ అందరూ కూడగట్టుకుని మా పార్టీపై విమర్శలు చేస్తున్నారు.

అమరావతికి వ్యతిరేకం కాదు:
మేము సంక్షేమ ఎజెండాతో పని చేస్తున్నాం. కులం, మతం, వర్గం, ప్రాంతం, రాజకీయాలకు తావు లేకుండా పథకాలు అమలు చేస్తున్నాం.
మేము అమరావతిని వ్యతిరేకించడం లేదే? రాష్ట్రంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మాత్రమే మేము కోరుతున్నాం. దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు.
విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తే, ఎంత ఖర్చవుతుంది? అదే అమరావతిలో కట్టాలంటే ఎంత ఖర్చవుతుందో మీరు చెప్పిన ఫిగర్సే చూస్తే.. అమరావతిలో రోడ్లు, డ్రైనేజీ వంటి కనీస సదుపాయాల కోసమే 2018 లెక్కల ప్రకారమే రూ.1.20 లక్షల కోట్లు కావాలన్నారు. ఇది వాస్తవమా? కాదా? టీడీపీ నేతలు చెప్పాలి. మీరు అక్కడ రూ.12 వేల కోట్లు ఖర్చు చేశారు. కానీ ఏం ఒరగబెట్టారు. మేము అక్కడ రూ.20 వేల కోట్లు ఖర్చు చేసినా, వచ్చేదేమీ లేదు.
మేము సెంటిమెంట్‌ ఉన్న వ్యక్తులం. అన్ని ప్రాంతాలు సమానంగా చూడాలని కోరుకునే వాళ్లం. అమరావతిలో కూడా అభివృద్ధి కోరుకుంటున్నాం. అందుకే అక్కడ శాసన రాజ««ధాని ఉండాలని చెబుతున్నాం.

ఇదే మా డిమాండ్‌:
విశాఖ, కర్నూలులో కొత్తగా నిర్మించాల్సిందేమీ లేదు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తే, అనుబంధంగా మరి కొన్ని కోర్టులు, కార్యాలయాలు వచ్చి, కొన్ని వేల మందికి ఉద్యోగావకాశాలు వస్తాయి. అదే మేము కోరుతున్నాం.
శ్రీబాగ్‌ ఒప్పందం ప్రకారం ఆనాడు రాజధాని వదులుకున్నాం. ఇవాళ అక్కడ హైకోర్టు కావాలంటే కూడా వ్యతిరేకిస్తున్నారు. ఎంత దారుణం?
ఇది సరైన సమయం. మన రాయలసీమ వాసుల విధానం ఒక్కటే. మన ప్రాంతంలో హైకోర్టు ఉండాలి. ఇక్కడ రాయలసీమ ఎత్తిపోతల పథకం పూర్తి కావాలి. ఈ రెండింటి సాధనే మన ధ్యేయం. దాన్ని సాధిస్తే రాయలసీమ దానంతట అదే అభివృద్ధి చెందుతుంది.
బీజేపీ వారు కూడా తమ మాట నిలబెట్టుకుని, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తూ.. రాష్ట్రంలో బాగా వెనకబడి ఉన్న ఉత్తరాంధ్ర, రాయలసీమకు ప్రత్యేక హోదా కనక ఇస్తే, ఇంకా మీరేం చేయాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంతాలు కచ్చితంగా అభివృద్ధి చెందుతాయి. అందుకే ఈ పని చేయాలని డిమాండ్‌ చేస్తున్నాం.

గతి తప్పిన వామపక్ష నేతలు:
ఇక వామపక్షాలు. ఆ పార్టీల నేతలు కూడా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. అసలు వారి నైజం ఏమిటి? పేదల ప్రజలకు ఇళ్లు ఇవ్వాలని అడగాలి. అదే పేద ప్రజలకు అమరావతి ప్రాంతంలో నిరుపేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామంటే వ్యతిరేకించిన, అడ్డుకున్న టీడీపీతో కలిసి పని చేస్తున్నారు. ఎందుకంటే ఎన్నో మంచి పనులు చేస్తున్న జగన్‌గారికి మంచి పేరు రావొద్దన్న కుట్ర. ఆ లక్ష్యంతో పని చేస్తున్న చంద్రబాబుతో కలిసి వామపక్షాల నేతలు పని చేస్తున్నారు. బద్ధశతృవులైన బీజేపీతో కూడా కలిసి ఒకే వేదిక పంచుకుంటున్నారు.

మా లక్ష్యం వికేంద్రీకరణ:
రాయలసీమ ఎప్పటికీ అభివృద్ధి చెందవద్దని కోరుకుంటున్న వీరందరికీ తగిన బుద్ధి చెబుతాం. త్వరలోనే జేఏసీ ఏర్పాటు చేస్తాం. మా హక్కుల కోసం పోరాడుతాం. ఈ ప్రాంతానికి చెందిన మంత్రులు, ప్రజా ప్రతినిధులతో సమావేశమై.. వికేంద్రీకరణ కోసం జేఏసీ ఏర్పాటు చేసి పోరాడతాం.

మీడియా ప్రశ్నలకు సమాధానంగా…
మేమెందుకు ఉలిక్కిపడతాం?:
అరసవెల్లి పాదయాత్ర ఇంకా ఉత్తరాంధ్ర చేరలేదు. దాని కోసం మేము ఎందుకు భయపడతాం? మాకు రాజీనామాలు కొత్త కాదు? మా గతం ఏమిటో అందరికీ తెలుసు. ఆనాడే అధికార పార్టీని ఎదిరించి, ఎన్నికలు ఎదుర్కొన్నాం. మేము ఉలిక్కి పడడం లేదు. ఆరోజు వారు తిరుపతి పాదయాత్ర చేసినప్పుడు కూడా రెచ్చగొట్టేలా వ్యవహరించారు. కానీ మేమే సంయమనం పాటించాం.
కానీ ఇవాళ ఉత్తరాంధ్ర యాత్ర పేరుతో దండయాత్ర చేస్తున్నారు. ఎక్కడికక్కడ రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తున్నారు. అందుకే ఉత్తరాంధ్ర వాసులు స్పందిస్తున్నారు. ఆరోజు మేము రాయలసీమలో సంయమనం పాటించాము. కానీ ఇప్పుడు కూడా ఈ ప్రాంతం అభివృద్ధి చెందొద్దని అంటే మాత్రం, ఊర్కునే ప్రసక్తి లేదు.

వారే రాజీనామా చేయాలి:
అమరావతి రాజధాని కోరుతున్న టీడీపీ ఎమ్మెల్యేలు.. ముందు రాజీనామా చేయాలి. తిరిగి ప్రజల నిర్ణయం కోరాలి. గతంలో స్థానిక ఎన్నికల్లో అమరావతి ప్రాంతంలో ప్రచారం చేసిన చంద్రబాబు, ఆ ఎన్నికల్లో ఓడిపోతే, వికేంద్రీకరణను ఆమోదించినట్లే అన్నారు. ఆ ఎన్నికల్లో వారు ఓడిపోయారు. అంటే వికేంద్రీకరణను అక్కడి వారు కూడా ఆమోదించినట్లే కదా.

ఉత్తరాంధ్ర తరహాలో..:
ఉత్తరాంధ్ర మాదిరిగా ఇక్కడ కూడా అన్ని వర్గాల వారు, మేధావులను కలుపుకుంటాం. అందరం కలిసి జేఏసీ ఏర్పాటు చేస్తాం.
హైకోర్టు కర్నూలులో ఉండాలి. అక్కడ ఎందుకు వద్దంటున్నారన్న దానికి సమాధానం చెప్పాలి. మా హక్కుల కోసం పోరాడతాం.
రాయలసీమలో హైకోర్టు కోసమే కాకుండా, ఇక్కడ ఎత్తిపోతల పథకాల కోసం, స్టీల్‌ ప్లాంట్‌ కోసం కూడా మేము మాట్లాడతాం.
వికేంద్రీకరణ మా స్పష్టమైన విధానం. కర్నూలు, విశాఖ నగరాలు నిర్మించాల్సిన అవసరం లేదు. ఇప్పటికే అవి పెద్ద నగరాలు. అందుకే కర్నూలులో హైకోర్టు, విశాఖలో ఎగ్జిక్యూటివ్‌ రాజధాని ఏర్పాటు చేయాలని కోరుతున్నాం.

ఆ నివేదికలు చదవండి:
మళ్లీ వేడుకుంటున్నాను. శ్రీకృష్ణ కమిటీ, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికలు ఏం చెప్పాయనేది రాయలసీమ వాసులు చదవాలి. అదే విధంగా శ్రీబాగ్‌ ఒప్పందంలో ఏముందో కూడా చూడమంటున్నాం.
విశాఖ ఇప్పటికే బాగా అభివృద్ధి చెందిన నగరం. అందుకే అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ ఏర్పాటు చేస్తే, ఇంకా అభివృద్ధి చెందుతుంది. దే«శంలోని టాప్‌ 10 నగరాల్లో ఒకటిగా ఎదుగుతుంది. పైగా అక్కడ ఎగ్జిక్యూటివ్‌ క్యాపిటల్‌ కోసం పెద్దగా పెట్టుబడి కూడా అవసరం లేదని ఎమ్మెల్యే జి.శ్రీకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు.

LEAVE A RESPONSE