Suryaa.co.in

Andhra Pradesh

సమస్యను జఠిలం చేసి పేదలను బలిచేయొద్దు!

– టిడిపి జాతీయ ప్రధానకార్యదర్శి నారా లోకేష్

అస్తవ్యస్త పాలనతో ఖజానా ఖాళీచేసిన జగన్మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు దాదాపు రూ.1200 కోట్లు బకాయి పెట్టడంతో రాష్ట్రవ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు నిలచిపోయాయి. ముఖ్యమంత్రి సొంత జిల్లా కడపలో సైతం ఆసుపత్రుల యాజమాన్యాలు ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేయడంతో పేదోళ్ల వైద్యం గాలిలో దీపంలా మారింది.

బకాయిలు విడుదల చేసి సమస్యను పరిష్కరించడంలో చొరవచూపని ప్రభుత్వం… ఆసుపత్రులను డీలిస్టు చేస్తూ బెదిరింపులకు దిగడం దారుణం. అత్యవసరమైన వైద్యసేవల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యానికి అమాయకులను బలిపశువులుగా మార్చొద్దు. లక్షలాది పేదల ప్రాణాలతో కూడుకున్న ఆరోగ్యసేవల విషయంలో మొండివైఖరి విడనాడి సమస్యను సామరస్యంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.

LEAVE A RESPONSE