Suryaa.co.in

Andhra Pradesh

ఓటమి తప్పదని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు

– పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం
– మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం
– బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ

బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి గుంటూరు పశ్చిమ నియోజకవర్గ కన్వీనర్ వల్లూరు జయప్రకాష్ నారాయణ మలివిడత బిజెపి విజయసంకల్పయాత్ర నాలుగోవరోజు కార్యక్రమంలో భాగంగా చంద్రమౌళి నగర్ లోని కార్యాలయం వద్ద ప్రారంభమై లక్ష్మీపురం అశోక్ నగర్ పండరీపురం కోబాల్ట్ పేట అంకమ్మ నగర్ మీదుగా ఏటి ఆగ్రహారం నాలుగో లైన్ వద్ద ముగిసింది.

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిదులుగా బిజెపి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్ రాష్ట్ర ప్రధాన కార్యాలయ ఇన్చార్జి మకుటం శివ పాల్గొన్నారు.. ముందుగా 75వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా జయప్రకాష్ నారాయణ చంద్రమౌళి నగర్ లోని కార్యాలయం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.

ఈసందర్భంగా వల్లూరు జయప్రకాష్ నారాయణ మాట్లాడుతూ..
వచ్చే ఎన్నికల్లో ఓటమి తప్పదని ముఖ్యమంత్రి జగన్ గ్రహించారు కాబట్టే నిర్వేదంతో మాట్లాడుతున్నారని ఇంట్లో కూర్చుంటానని సీఎం చేసిన వ్యాఖ్యలకు అర్థం ఇదేన్నారు.కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అందిస్తున్న పథకాల్ని కూడా జగన్ ప్రభుత్వం సద్వినియోగం చేయటం లేదని దుయ్యబట్టారు. గుంటూరు నగరానికి భూగర్భ డ్రైనేజి మంజూరు చేస్తే పనులు పూర్తి చేయటంలో వైసీపీ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

రొంగల గోపి శ్రీనివాస్ మాట్లాడుతూ నరేంద్ర మోడీ ఈ జిల్లాకి ఏమేమి నిధులు ఇచ్చారో ఏ విధంగా అభివృద్ధి చెందిందో, సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలవుతున్నాయో ప్రజలకు వివరించడం జరిగింది. ఈ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. నరేంద్రమోడీ ఇచ్చే సంక్షేమ ఫలాలు అందుకున్న ప్రతి ఒక్కరూ ఎదురొచ్చి స్వాగతం పలుకుతున్నారు. నరేంద్రమోడీ లాంటి తరహా పాలన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కావాలని కోరుకుంటున్నారు.

మోడీ పాలన దేశంలో ఏ విధంగా సాగుతుందో అవినీతి లేనటువంటి పాలన అందిస్తున్నారు. ప్రజల యొక్క ఆశీర్వాదం ప్రజలకు బిజెపి పట్ల ఉండే ఆదరణ ప్రజల ద్వారా తెలుసుకుంటున్నాము అదేవిధంగా పాదయాత్రలో సమస్యలు తెలుసుకుని సమస్యలు తీర్చడమే పరమావధిగా పనిచేసి ఎన్నికలలో ముందుకెళ్తామని తెలిపారు.

మకుటం శివ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం ఇస్తున్న సహకారాన్ని ప్రజలకు వివరించేందుకు ఈ పాదయాత్ర ఉపయోగ పడుతుంది. రోడ్లు డ్రైనేజీ సిస్టం అద్వానంగా ఉన్నాయని డ్రైనేజ్ ఏరులై పారుతోందని దోమల బెడద దుర్గంధంతో అపార్ట్మెంట్ వాసులు స్థానిక ప్రజలు నానా రకాల ఇబ్బందులు పడుతున్నారని నగరంలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఈ ప్రభుత్వం విఫలం అయిందని మరో రెండు నెలల్లో జరగబోయే ఎన్నికలలో ఈ ప్రభుత్వానికి ప్రజలు తగురీతిలో బుద్ధి చెప్పటానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు.

ఈకార్యక్రమంలో ఈదర శ్రీనివాసరెడ్డి, పాలపాటి రవికుమార్, ఆవుల నాగేంద్ర, ఏడుకొండల గౌడ్, వెంకటేష్, నరసింహారావు, ఏలూరి లక్ష్మి, నాగమల్లేశ్వరి యాదవ్, సరోజిని, లంకా రవిశంకర్, ప్రతాప్ ప్రసాదు, తోట శ్రీనివాస్, రాచుమల్లు భాస్కర్, రామకృష్ణ, కొక్కెర శ్రీనివాస్, ఏసోబు, తాను చింతల అనిల్, సత్యనారాయణ, రామకోటేశ్వరరావు, దారా అంబేద్కర్, స్టాలిన్, శశాంక్, శ్రీకళ్యాణి, లక్ష్మీ ప్రసన్న, మౌనిక, శివకుమారి, రాధాకృష్ణ, నవీన్, మంజు, సిహెచ్ వెంకట్, చంద్రశేఖర్, శేషగిరి, కామేపల్లి వెంకటేశ్వర్లు, మందలపు సురేష్ తదితరులు పాల్గొన్నారు

LEAVE A RESPONSE