Suryaa.co.in

Political News

ఏడవకండేడవకండేడవకండే!

యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా…USA…
సంభ్రమం తో తన కొత్త స్నేహితుడి రాకకై ఎదురు చూస్తోంది…
ఆరు నెలలుగా…తన ఆత్మీయ మిత్రుడి కోసం… వైట్ హౌస్ అద్భుతమైన ఏర్పాట్లు చేస్తూ…ఎప్పుడెప్పుడా అతడి రాక అని నిమిషాలు లెక్కపెడుతోంది…
ఎన్ని విధాలుగా..ఈ విశ్వాధినేతను ఆకట్టుకోగలుగుతామో… రిహార్సల్స్ వేసుకుంటుంది…
అతడి చూపు కోసం…అతడి దృష్టిని ఆకర్షించడం కోసం…తన హాస్పిటాలిటీ ఎలా ఉంటే బాగుంటుందో సలహాలు తీసుకుంటోంది…
అవును…మొదటి సారి అమెరికాకి వెళ్తున్న…నరేంద్ర దామోదర్ దాస్ మోడీ కోసం…
మొత్తం అమెరికా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తోంది…
మీరు చదివింది నిజమే…
మొదటి సారే…ఇది…
అమెరికా తన అత్యంత ఆప్త మిత్రులకి మాత్రమే ఇచ్చే గౌరవం..విలువ…స్టేట్ హానర్..
అక్కడ ఇరు దేశాధినేతలు రెండు దేశాల జాతీయ గీతాలను వింటారు…
వారి ఆర్మెడ్ ఫోర్సెస్ నీ సమీక్షిస్తారు…
ఆ తరువాత మాటల కోసం వైట్ హౌస్‌లోకి వెళతారు…
ఆ రాత్రి తర్వాత దౌత్యపరమైన విషయాలు సమీక్ష చేస్తారు..
అక్కడ మన ప్రధాని గౌరవార్థం రాష్ట్ర విందు ఏర్పాటు చేస్తారు…
ఆపై అమెరికా రాష్ట్రపతి అధికారిక అతిథి గృహమైన బ్లెయిర్ హౌస్‌లో, ప్రథమ పౌరునికి రాత్రిపూట అతిథిగా…మన ప్రధాని అక్కడ ఉంటారు…
ఒకప్పుడు అహంకారంతో..తప్పుడు సమాచారంతో వీసా నిరాకరించిన మోడీ కే…ఇప్పుడు సకల మర్యాదలు చెయ్యబోతున్నది అమెరికా…
జో బైదెన్..జిల్ బైదేన్ మన ప్రధానికి దగ్గరుండి కొసరి కొసరి వడ్డించ బోతున్నారు…
ఇప్పటికే..అమెరికా పత్రికలు…ఈ మహత్తర సన్నివేశం ఎలా ఉండబోతోందో… ఇంతలింతలుగా వ్రాసేస్తున్నాయి..
అవును…అమెరికాకి మోడీ గారు చేస్తున్న మొదటి స్టేట్ విజిట్ ఇది…

స్టే… ట్…వి… జి… ట్…
అప్పుడెప్పుడో రాష్ట్రపతి రాధాకృష్ణన్ గారిది తప్ప..మిగతా అన్నీ అధికారిక పర్యటనలే…
అంటే నలుగురితో పాటు నారాయణ…
అవీ గొప్పవే…
కానీ…
ఇప్పుడు ఒక ప్రభుత్వాధినేతను.. రాజ్యాధినేతగా ఫీల్ అవుతూ…అమెరికా ఇస్తున్న గౌరవం…
ప్రపంచం దృష్టిలో..అమెరికా దృష్టిలో…ఇది మరీ గొప్పది…
అధినేతలు ఇద్దరూ..పరస్పరం మాట్లాడుకుంటారు…
అధికారులు..అధికారులు కాదు…
రాజ్యం..మరో రాజ్యం తో.. ప్రపంచం గురించి చర్చిస్తుంది…
ఏమి ఇచ్చి పుచ్చుకోవాలో…ఇద్దరే తేల్చుకుంటారు…
విశ్వానికి చెయ్యాల్సిన మేలు గురించి చర్చిస్తారు…
తీవ్రవాదం మెడలు ఎలా వంచాలో నిర్ణయిస్తారు…
ఆ తరువాత..జో బైడేన్ తన కేబినెట్ సహచరులను…టాప్ పొలిటికల్ బ్రాస్ ను మోడీకి పరిచయం చేస్తారు…
మరునాడు…అమెరికా ఉభయ సభలను ఉద్దేశించి ప్రధాని ప్రసంగిస్తారు…
వచ్చే నాలుగు రోజులు…అమెరికాకి పండుగే…
వరల్డ్ కి యోగా దినోత్సవాన్ని కానుకగా ఇచ్చిన భారత్ కి…
వసుధైవ కుటుంబకం భావనను ఇచ్చిన విశ్వ గురువుకి…
ఐదో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా మారిన భారత్ కీ…అమెరికా ఇస్తున్న గౌరవం ఇది…
మన ప్రధాని మోడీకి ఇది మామూలే కావచ్చు..కానీ మనకి చాలా గొప్ప…
అంతే….
ఏడవకండేడవకండేడవకండే….!!!

– పులగం సురేష్‌
జర్నలిస్టు

LEAVE A RESPONSE