సంస్థాగత నిర్మాణంతో పార్టీ మరింత బలోపేతం

-అందరితో సమన్వయం చేసుకోండి
-పార్టీ అనుబంధ విభాగాల కమిటీల నియామకం 15 రోజుల్లో పూర్తి చేయండి
-ఎంపీ విజయసాయిరెడ్డి

సంస్థాగత నిర్మాణంతో పార్టీ మరింత బలోపేతం అవుతుందని,సమన్వయంతో పార్టీ సంస్థాగత నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ శ్రీ వి విజయసాయిరెడ్డి పిలుపు నిచ్చారు. తాడేపల్లిలో వైఎస్ఆర్ సీపీ పార్టీ కేంద్ర‌ కార్యాలయం నుంచి పార్టీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యేలు, అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలతో విజయసాయిరెడ్డి సోమవారం టెలి కాన్ఫరెన్స్ నిర్వహించారు..
ఈ సందర్భంగా పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ అనుబంధ విభాగాల కమిటీల ఏర్పాటు, త్వరలో ప్రభుత్వం నిర్వహించనున్న జగనన్న సురక్ష కార్యక్రమం పై ఈ టెలి కాన్ఫరెన్స్ లో విజయసాయిరెడ్డి మాట్లాడారు.

విజయసాయి రెడ్డి మాట్లాడుతూ….. పార్టీ సంస్థాగత నిర్మాణంలో ఆలసత్వం వహించరాదని ముఖ్యమంత్రి జగన్ హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేశారు. సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా రాష్ట్రస్థాయి నుండి మండల స్థాయి వరకు పార్టీ అనుబంధ విభాగ కమిటీల నియామకాలను 15 రోజులలోపు పూర్తి చేయాలని కోరారు..

జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి పార్టీ కమిటీల ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించడంలో జాప్యం జరుగుతోందని అన్నారు. జిల్లా పార్టీ అధ్యక్షులు వారి పరిధిలోని ఎమ్మెల్యేలు,నియోజకవర్గ సమన్వయకర్తలు రీజనల్ కోఆర్డినేటర్లతో సమన్వయం చేసుకొని జూన్ 21 తేదీలోగా పార్టీ అధ్యక్షులు వారి ఆమోదం కోసం జిల్లా,మండల స్థాయి కమిటిల ప్రతిపాదనలను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించాలని కోరారు.

గత రెండు వారాలుగా పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ మొత్తం 17 పార్టీ విభాగాలకు సంబంధించిన రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు,జోనల్ ఇన్చార్జులు,జిల్లా అధ్యక్షులతో సమావేశాలు నిర్వహించిన విషయాన్ని గుర్తు చేశారు.. ఈ సమావేశాలలో విభాగాల తదుపరి కార్యాచరణ కమిటీల నియామకాలపై సమీక్షించడం జరిగిందని అన్నారు. ఈ సమీక్షించే క్రమంలో జిల్లా అధ్యక్షులు,ఎమ్మెల్యేలు, సమన్వయకర్తల నుంచి సహకారం అందినప్పుడే పార్టీ అనుబంధ విభాగాల కమిటీలను ప్రతిపాదించగలమని ఎక్కువ శాతం మంది జోనల్ ఇంచార్జీలు,విభాగ జిల్లా అధ్యక్షులు తమకు తెలియజేశారని అన్నారు.

సమన్వయం చేసుకోని పార్టీ అనుబంధ కమిటిలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు..
పార్టీ పదవుల్లో ఉన్న వారందరికీ పార్టీ ఐడి కార్డులను జారీ చేయడం జరుగుతుందని వెల్లడించారు. రాష్ట్ర పార్టీ కమిటీ నిర్మాణ క్రమం ఏ విధంగా ఉండాలి అన్నదానిపై పార్టీ ప్లాన్ చేసిన తర్వాత, పార్టీ అధ్యక్షులు వారు ఆమోదం పొందిన తర్వాత మీకు తెలియజేయడం జరుగుతుందని చెప్పారు…
అలాగే ఈ పార్టీ కమిటీలకు అధ్యక్షులు వారి ఆమోదం లేకుండా వేసిన కమిటీలకు ఎటువంటి ఉపయోగం ఉండదని స్పష్టం చేశారు. ఏ స్థాయి పార్టీ అనుబంధ కమిటీలైనా పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆమోదం పొందిన తర్వాత కేంద్ర పార్టీ కార్యాలయం ప్రకటిస్తుందని వారికి వివరించారు..
గతంలో బీసీ మహాసభ నిర్వహించిన తరహాలోని ఎస్సీ ,ఎస్టీ, ముస్లీం-మైనారిటీ మహాసభలు నిర్వహిస్తామని చెప్పారు.. త్వరలో ముస్లిం మైనారిటీ మహాసభ కర్నూలులో జూలై 15న ఏర్పాటు చేసేందుకు పరిశీలిస్తున్నామని చెప్పారు.. బీసీ మహాసభ ఎలా అయితే విజయవంతమైందో అలాగే మిగిలిన అనుబంధ విభాగాల మహాసభలను కూడా విజయవంతం చేయాలని వారిని కోరారు..

ప్రభుత్వ సేవలు అందరికి అందించడమే లక్ష్యంగా జగనన్న సురక్ష కార్యక్రమం
ప్రతి ఒక్కరికి ప్రభుత్వం సేవలను అందించి,వారిలో చిరునవ్వే లక్ష్యంగా ముఖ్యమంత్రి జగన్ జగనన్న సురక్ష కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని చెప్పారు..ఇందులో బాగంగా ప్రతి సచివాలయంలో మండల స్థాయి అధికారులు ఒక రోజు గడుపుతారని తెలిపారు.. క్యాంపు నిర్వహించిన రోజున ప్రజలు తమ పరిధిలో ఉన్న సచివాలయాన్ని సందర్శించి సర్టిఫికెట్లు ఇతర సమస్యలు పరిష్కారాన్ని ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ప్రజలు ఇంటి వద్దకే సేవలను తీసుకురావడానికి, అడ్డంకులు, అవరోధాలు తొలగించడానికి జగనన్న సురక్ష శిబిరాలను జూన్ 23 నుంచి ఒక నెల రోజులపాటు నిర్వహించబడతాయని చెప్పారు.

ఈ కార్యక్రమం ద్వారా ప్రతి కుటుంబం ప్రతి పౌరుడు ప్రభుత్వం లబ్ధిని పొందేలా చూడటం,ప్రతి కుటుంబంలో ప్రభుత్వ పథకాలు లేదా ప్రభుత్వ పత్రాలకు సంబంధించిన సమస్యలను పరిష్కారం చూపి వారికి లబ్ధి చేకూర్చడం, ఈ నాలుగు సంవత్సరాల కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాల గురించి పౌరులకు తెలియజేయడం.. పాలనలో పారదర్శకతను మెరుగుపరచడం, నమ్మకాన్ని పెంపొందించడం మరియు పాలనాపరమైన విషయాల్లో ప్రజలకు సకాలంలో సహాయం అందించడం.. పై అంశాలను ఈ కార్యక్రమంలో లక్ష్యాలుగా ప్రభుత్వం పెట్టుకుందని ఆయన అన్నారు.క్యాంపు నిర్వహించే రోజున ప్రభుత్వం జారీ చేసే 9 పత్రాలు సంబంధించిన ఫిర్యాదులను పరిష్కరించడానికి ఈ కార్యక్రమంలో ప్రాధాన్యత ఇవ్వబడుతుందని చెప్పారు.

ఎంపీ విజయసాయిరెడ్డికి వినతుల విలువ
వైయస్సార్ సిపి పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ అనుబంధ విభాగాల ఇంచార్జ్, ఎంపీ విజయసాయిరెడ్డి పార్టీ నాయకులు ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులను స్వీకరించారు. వాటికి పరిష్కారం చేసే దిగా కృషి చేస్తానని వారికి హామీ ఇచ్చారు…

Leave a Reply