యువత భవిష్యత్తును దెబ్బ తీయవద్దు

– దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్

దర్శి : వైసీపీ పాలనలో అవినీతి, డ్రగ్ కల్చర్ పెరిగిపోయిందని దర్శి జన సేన నాయకులు గరికపాటి వెంకట్ఆరోపించారు. రాష్ట్ర పోలీసు శాఖ నిద్ర పోతోందని, ఢిల్లీ నుంచి వచ్చిన వారు అసలు విషయాన్ని బయటపెట్టారని విమర్శించారు. రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, డ్రగ్స్ కల్చర్ విచ్చలవిడిగా మారిందన్నారు.

మాదక ద్రవ్యాల వినియోగం విచ్చలవిడిగా కొనసాగుతోందని, మద్యం ఏరులై పారుతోందని ఆరోపించారు. మహిళలపై నేరాలు, దాడులు పెరుగుతున్నాయని ఆరోపించారు. వాటివల్లే మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని, మిస్సింగ్ కేసులు ఎక్కువ అవుతున్నాయన్నారు. అన్నపూర్ణ ఆంధ్రప్రదేశ్‌ను ‘డ్రగ్, గంజాప్రదేశ్’గా మార్చిన ఘనత జగన్ నేతృత్వంలోని వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు.

రాష్ట్రంలో మూడు రాజధానుల మాటేమో కానీ మూడు ప్రాంతాలను డ్రగ్స్, గంజా, మద్యం రాజధానులుగా మార్చే విధంగా జగన్ పాలన ఉందన్నారు. గతంలో విజయవాడ అడ్రస్‌తో వేల కోట్ల విలువైన డ్రగ్స్ వస్తే, నేడు వైజాగ్ పోర్టుకి నేరుగా లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

డ్రగ్స్ కంటైనర్ తెరవకుండా వత్తిడి చేసిన నాయకులు, అధికారులపైన చర్యలు తీసుకుని కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వ పాలనలో యువత భవిష్యత్తు దెబ్బతీసే అరాచకాలకు అంతు లేకుండా పోయిందని విమర్శలు గుప్పించారు.

Leave a Reply