ఒంగోలులో ఘనంగా టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ప్రకాశం జిల్లా ఒంగోలు టీడీపీ కార్యాలయంలో శుక్రవారం టీడీపీ 42వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ముఖ్యఅతిథులుగా జిల్లా పార్టీ అధ్యక్షుడు డాక్టర్‌ నూకసాని బాలాజీ, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి హాజరయ్యారు. ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు మారెళ్ళ వెంకటేశ్వర్లు, జిల్లా అధికార ప్రతినిధులు మొగల్‌ కాలేషా బేగ్‌, గవదకట్ల హరికృష్ణ, నల్లూరి అశోక్‌, టీడీపీ రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి షేక్‌ కాలేషావలి, గొంది రమణారెడ్డి, బత్తుల వెంకటేశ్వర్లు, మువ్వా శివ, తాత ప్రసాద్‌, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply