మత్య్సకారుల్ని జగన్ రెడ్డి నట్టేట ముంచారు

– మత్య్సకారులకు ఒక్క ఫిషింగ్ హార్బర్ కట్టని జగన్ రెడ్డి తాను మాత్రం రుషికొండలో విలాసవంతమైన భవనం కట్టుకుంటున్నారు
– టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్య ప్రసాద్

మత్య్స కారులకు జగన్ రెడ్డి అడుగడుగునా అన్యాయం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత 8 ఫిషింగ్ హార్బర్లు, 4 జెట్టీలు కడతామన్నారు. కానీ ఇప్పటివరకు ఒక్కటి కూడా ఎందుకు నిర్మించలేదు ? వందల బోట్లు, వేలాదిమంది మత్స్యకారులు ఉన్న జిల్లాలో మినీ హార్బర్ నిర్మాణం జరపడంలేదు కాని రుషికొండలో రూ 500 కోట్లతో విలాస భవనం కట్టుకుంటున్నారు. జగన్ రెడ్డి తన సలహాదారుల కోసం చేసే ఖర్చులో సగం కూడా మత్య్స కారులకు ఖర్చు చేయడం లేదు. రాష్ట్రంలో మత్స్యకారులు ఉన్నారని విషయం కూడా జగన్మోహన్ రెడ్డి మర్చిపోయారు.

మత్స్యకార భరోసా (10 వేలు) నగదు తీసుకునేవారు వృద్ధాప్య పింఛన్‌కు అర్హులుకారని చెప్పి వారి పింఛను రద్దుచేస్తున్నారు. మత్స్యకారులకు ఇచ్చే అరకొర సాయానికి కూడా జగన్ ప్రభుత్వం సవాలక్ష కొర్రీలు పెడుతోంది. అమ్మఒడి తీసుకుంటే మత్స్యకార భృతి ఇవ్వబోమని, ఇతర పథకాలు పొందితే అర్హులు కారని చెబుతూ, కడలి పుత్రుల కడుపు కొడుతోంది. ఒక కుటుంబంలో నలుగురు చేపలవేటకు వెళితే, వారిలో ఒకరికే మత్స్యకార భృతి ఇవ్వడం అన్యాయం.

ఇదీకాక, మైదాన ప్రాంత మత్స్యకారుల పొట్టకొడుతున్న జీఓఆర్‌టీ నెం. 217ను ప్రభుత్వం తీసుకొచ్చి మత్స్యకారులను వృత్తి నుండి దూరం చేసే కుట్ర చేస్తోంది.

మినీ హార్బర్ నిర్మాణం జగన్ హయాంలో పేపర్లకే పరిమితమైంది. ప్రాణాలకు తెగించి సముద్రంపై చేపల వేట సాగించే వారికి జెట్టీ చేపల వేట ఆధారంగా జీవిస్తున్న మత్స్యకారులను సముద్రానికి దూరం చేస్తారా ? ఉవ్వెత్తున ఎగసిపడే అలల్ని సునాయాసంగా ఎదుర్కునే మత్సకారులు వైసీపీ ప్రభుత్వ అక్రత్యాలకు బలవుతున్నారు.

ఫిష్ ఆంద్ర ఔట్ లెట్ షాపులు తెచ్చి మత్య్సకారుల జీవనోపాధి దెబ్బ తీశారు. మత్స్యకారులకు జగన్ రెడ్డి చేసిన మోసానికి తగిన గుణపాఠం చెప్పేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు.

Leave a Reply