కాంగ్రెస్‌లో తిరుగుబాటు ఎమ్మెల్యేలు

– చింతలపూడి వైసీపీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలిజా
– షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిక

వైసీపీకి రాజీనామా చేశా. నా రాజీనామా లేఖను వైసీపీ కార్యాలయానికి పంపించా. వైఎస్ షర్మిలా రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరాను. చింతలపూడి నియోజక వర్గంలో స్థానిక రాజకీయాలు తట్టుకోలేక పోయా. నన్ను ఇబ్బంది పెట్టారు. అవమాన పరిచారు.

సిట్టింగ్ ఎమ్మెల్యే గా నాకు తెలియకుండా కార్యక్రమాలు చేశారు. నా పేర్లను కూడా శిలా ఫలకాల మీద పేర్లు కూడా తీసేశారు.. అధిష్టానం దృష్టికి తీసుకు వెళ్ళినా ఉపయోగం లేదు. నా పార్టీ అనుకొని పని చేస్తే మోసం చేశారు. ఈ దేశానికి ,రాష్ట్రానికి కాంగ్రెస్ చాలా అవసరం.

కాంగ్రెస్ నిజమైన సెక్యులర్ పార్టీ.కాంగ్రెస్ ఒక్కటే ఏ మతానికి,కులానికి బేస్ కాదు. కాంగ్రెస్ లో కష్టపడతా. కచ్చితంగా కాంగ్రెస్ మళ్ళీ అధికారంలోకి వస్తుంది. వైసీపీ లో ఉన్న అసమ్మతి నేతలు చాలా మంది కాంగ్రెస్ లో చేరే అవకాశాలు ఉండొచ్చు. నన్ను బయటకు పంపిన వైసీపీ నేతలు ఎవరో అందరికీ తెలుసు.

Leave a Reply