– సమస్యలు పరిష్కరించాలని కోరితే కేంద్రాలను వాలంటీర్లతో బలవంతంగా తెరిపించడం నీచం
– తెలుగు మహిళా నాయకురాలు పొదిలి లలిత
అంగన్‌వాడీలకు ప్రక్క రాష్ట్రం తెలంగాణ కంటే ఎక్కు వ న్యాయం చేస్తానని జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు. చంద్రబాబు నాయుడు 2018లో రూ.4200 ఉన్న అంగన్ వాడీ టీచర్ల జీతాన్ని 10,500, సహాయకులకు 2,950 ఉన్న జీతం రూ.6 వేలు చేశారు. నాలుగున్నరేళ్ల కాలంలో జగన్ రెడ్డి ఏం చేశాడు? అంగన్‌వాడీలను గవర్నమెంట్ ఉద్యోగులుగా భావించి సంక్షేమ పథకాలు రద్దు చేస్తారా?
జగన్ మోహన్ రెడ్డి పెంచిన వెయ్యి రూపాయలతో రూ.11 వేల జీతం అంగన్‌వాడీలకు నెల మొత్తం సరిపోతుందా? పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలతో…చాలీ చాలని జీతాలతో ఎలా బ్రతకాలి? అంగన్ వాడీలు ఒళ్లు బలిసి ధర్మాలు, సమ్మెలు చేస్తున్నారని మంత్రులు మాట్లాడటం దుర్మార్గం. ముఖ్యమంత్రిగా మంత్రులను కట్టడి చేయాల్సిన బాధ్యత జగన్ రెడ్డిపై లేదా? ఇదేనా మహిళలకు జగన్ రెడ్డి ఇస్తున్న గౌరవం? వైసీపీ ప్రభుత్వంలోని మహిళా మంత్రులు ఎక్కడికి పోయారు?
సాటి మహిళలుగా కనీసం స్పందిచరా? అంగన్‌వాడీలలో ఇస్తున్న నాశిరకం పౌషికాహారం తిని ఆసుపత్రులపాలవుతున్నా జగన్ రెడ్డికి పట్టడం లేదు. ఈ నాశిరకం ఆహారం తింటే…బాలింతలు, పిల్లలు ఏమవుతారో ఒక్కసారైనా ముఖ్యమంత్రి ఆలోచించారా? పసిబిడ్డల ఆరోగ్యాలతో ఆటలాడొద్దని హెచ్చరిస్తున్నాం. వాలంటీర్లతో అంగన్‌వాడీ సెంటర్ల తాళాలు పగులగొట్టడం నీచం. అంగన్‌వాడీలు రోడ్లపైకి వస్తే వారి సమస్యలపై చిత్తశుద్దిలేని మీరు తాళాలు ఏ విధంగా పగులగొడుతారు? నిరసన తెలుపేందుకు కూడా అంగన్‌వాడీలకు హక్కు లేదా? అంగన్‌వాడీలకు మద్దతు తెలిపేందుకు కూడా ప్రజలను రానీయడం లేదు.
అంగన్‌వాడీలలో ఇస్తున్న నాశిరకం పౌష్టికాహారంపై స్త్రీశిశు సంక్షేమ శాఖలో పిర్యాదు చేసిన చర్యలు శూన్యం. రక్షే లేని చోట జగనన్నన సురక్ష అంటూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జగనన్న సురక్షలో ఆశాలు చనిపోతే కూడా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. సుప్రీంకోర్టు సాంక్షన్ చేసిన గ్రాట్యువిటీకి కూడా ఈ రాష్ట్రంలో దిక్కులేదు. పిల్లలకు వారి తల్లిదండ్రులు కూడా చేయని పనులు అంగన్‌వాడీలు చేస్తుంటే వారిని కనికరించరా? జగన్ రెడ్డి ప్రభుత్వం యాప్‌ల పేరుతో పనిభారం పెంచారు.
అంగన్‌వాడీల పట్ల ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా? నియంత పాలన నడుస్తోందా? అన్న అనుమానాలు కలుగుతున్నాయి.
అంగన్‌వాడీలతో వైకాపా ప్రభుత్వం ఎందుకు చర్చలు జరపడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో అంగన్‌వాడీలకు సంక్షేమ పథకాలను ఇచ్చాం. మరి ఇప్పుడెందుకు ఇవ్వలేరు? తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 18301 అంగన్ వాడీ కేంద్రాలను నూతనంగా నిర్మించి 40 లక్షల మందికి లబ్ది చేకూరిస్తే జగన్ రెడ్డి అంగన్ వాడీలను నయవంచన చేశాడు. నాడు-నేడు పేరుతో అంగన్ వాడీలకు రంగులు వేయడం తప్ప జగన్ రెడ్డి చేసింది ఏమీ లేదు. జగన్ రెడ్డి తన విలాసాలకు ఖర్చు చేస్తారు కానీ, అంగన్ వాడీ న్యాయమైన డిమాండ్లు తీర్చలేరు. విశాఖలో జగన్ రెడ్డి క్యాంప్ కార్యాలయం కోసం కోట్లు ఖర్చు చేశారు. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అంగన్ వాడీలకు భరోసాగా నిలబడుతున్నారు.
కానీ వైసీపీ ప్రభుత్వంలోని మంత్రులకు అంగన్ వాడీలపై ఎందుకంత కక్ష? అంగన్‌వాడీలు జగన్ రెడ్డిని గద్దె దించేందుకు సిద్దంగా ఉన్నారు. జగన్ మోహన్ రెడ్డికి అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్దు ప్రజలను ఆదోకోవడంలో లేదు. అంగన్ వాడీలకు తెలుగుదేశం పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుంది. అంగన్ వాడీ డిమాండ్లు సంపూర్ణంగా అమలయ్యే వరకు తెలుగుదేశం పార్టీ అండగా నిలబడుతుంది. అంగన్‌వాడీలకు వైకాపా ప్రభుత్వం ఏం చేసిందో చర్చించే ధైర్యం వైకాపాకు ఉందా?
అంగన్ వాడీలను వైసీపీ ప్రభుత్వం మానసికంగా వేధిస్తోంది. వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్‌వాడీ కేంద్రాలు రాజకీయ కేంద్రాలుగా తయారు చేశారు. అంగన్‌వాడీలలో వసతులు కల్పించాలని కోరితో అక్రమ నేరాలు బనాయిస్తున్నారు. ఒంగోలులో హనుమాయమ్మను వైకాపా నాయకుడు ట్రాక్టర్‌తో తొక్కించి చంపేస్తా ఆ కుటుంబానికి ఇంతవరకు న్యాయం చేయలేదు. చంద్రబాబు హయాంలో అంగన్ వాడీలు మనోవికాస బాల కేంద్రాలుగా ఉంటే నేడు వైకాపా కేంద్రాలుగా తయారయ్యాయి.