పిఠాపురంలో పైసలే పైసలు

-డ‌బ్బులు వేరే రూట్‌లో వెళుతున్నాయి
-మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
-వైసీపీ నేతల వాహనాలు తనిఖీ చేయరా?
-పోలీసులు పట్టించుకోవడం లేదు
-ప‌వ‌న్ పై కుట్ర‌
– మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపణ

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌పై భారీ కుట్ర జ‌రుగుతుంద‌ని పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పోటీ చేయడంతోనే భారీ మొత్తంలో నగదు వస్తుంద‌ని పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆరోపించారు. మంగ‌ళ‌వారం రాత్రి భారీగా వైసీపీ ప్ర‌చార సామాగ్రి ప‌ట్టుబ‌డ‌టం, దానిపై అధికారులు వెంట‌నే స్పందించ‌క‌పోవ‌డంపై వ‌ర్మ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. నేరుగా పిఠాపురం ప‌ట్ట‌ణ పోలీస్ స్టేష‌న్‌కు వెళ్లి అక్క‌డ పోలీసుల అదుపులో ఉన్న ప్రచార సామాగ్రిని ఆయ‌న ప‌రిశీలించారు.

ముందుగా ప్ర‌చార సామాగ్రి పంపించి అంద‌ర్ని డైవ‌ర్ట్ చేసి, పక్క రూట్ నుండి నగదు పంపిస్తున్నార‌న్నఅనుమానాలు క‌లుగుతున్నాయ‌న్నారు. మంత్రి దాడిశెట్టి రాజా, కాకినాడ ఎంపీ వంగా గీతకు నగదు పంపిస్తున్నారని త‌మ‌కు అనుమానం ఉంద‌ని చెప్పారు. వాహనం పట్టుకుని నాలుగు గంటలు గడిచినా ఎటువంటి చర్యలు చేపట్టలేదంటే అర్థం ఏంట‌ని వ‌ర్మ ప్ర‌శ్నించారు.

ఇప్పటికే బ్లేడ్లతో దాడి చేస్తున్నారని పవన్ కళ్యాణ్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈనేప‌థ్యంలో అనుమతులు లేకుండా భారీగా సామాగ్రి తరలించి ఆ ముసుగులో నగదు బదిలీ చేయడం వైసీపీ కుట్ర బ‌య‌ట‌ప‌డుతుంద‌న్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ను ఓడించడానికి భారీ మొత్తంలో నగదు బదిలీ చేస్తున్నారడానికి ఇదొక ఉదాహరణ.

Leave a Reply