10 లక్షలకు పైగా ఓట్ల తొలగింపునకు టీడీపీ కుట్ర

ఎంపీ విజయసాయిరెడ్డి

వైఎస్ఆర్ సిపికి అనుకూలంగా ఉన్న ఓట్ల తొలగింపే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ కుట్రలు చేస్తుందని రాజ్యసభ,వైఎస్ఆర్ సిపి జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి అన్నారు..ఈ మేరకు సోషల్ మీడియాలో ఒక ప్రకటనను విడుదల చేశారు..మై పార్టీ డ్యాష్ బోర్డు.కామ్ పేరుతో ఓటర్ల వ్యక్తిగత సమాచార సేకరణను ఆ పార్టీ ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు. చనిపోయారని, నకిలీవని, వలస పోయారని, రెండు చోట్ల ఓట్లు ఉన్నాయని, రకరకాల సాకులు చూపిస్తూ ఓట్ల తొలగింపుకు దరఖాస్తులు చేస్తుందని చెప్పారు. ఓటర్ల జాబితాలో అక్రమాలకు పాల్పడడం ద్వారా ఎన్నికల్లో గెలుపొందడానికి కుట్రలు చేయడం టిడిపికి అలవాటు గా మారిందని ఆయన అగ్రహాం వ్యక్తం చేశారు

వైద్య రంగంలో ఏపీ నెంబర్ వన్
ప్రైవేట్ ఆసుపత్రులకు దీటుగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సదుపాయాలు, వైద్యులు అందుబాటు, శానిటేషన్ ఇతర సదుపాయాలు కల్పనపై సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం మొదటి నుంచి ప్రత్యేకంగా దృష్టి సారించిందని చెప్పారు.. నాడు నేడు కింద ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖల్లో సమూల మార్పులు తీసుకొచ్చిందన్నారు. ఫలితంగా ప్రభుత్వాసుపత్రిలో స్వచ్ఛత పరిశుభ్రమైన వాతావరణంలో ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు.

దేశంలోనే కాయకల్ప గుర్తింపు కలిగిన అత్యధిక ఆసుపత్రులు మన రాష్ట్రంలో ఉండడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందని చెప్పారు. ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ ఈ విషయాన్ని వెల్లడించిందన్నారు. 2022 -23 దేశవ్యాప్తంగా 20,336 ప్రభుత్వాసుపత్రులకు కేంద్రం ఈ అవార్డులు కేటాయించారు. ఇందులో 3,161 ఆసుపత్రులకు అవార్డులు పొందిన ఆంధ్రప్రదేశ్ దేశంలోనే తొలి స్థానంలో నిలిచిందని ఆయన అన్నారు.

Leave a Reply