Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు….ఏ వర్గం సంతోషంగా లేదు

– జగన్ రెడ్డి పాలన కంటే బ్రీటీషు పాలనే నయమని ప్రజలు భావిస్తున్నారు
– ఎన్నికలు రాబోయే మూడు నెలలైనా ఉద్యోగులకు 1వ తేది జీతాలు ఇవ్వగలవా జగన్ రెడ్డి?
– తెదేపా శాసనమండలి సభ్యులు

రాష్ట్రంలో ఉద్యోగులు, రైతులు, కార్మికులు..ఇలా ఏ వర్గం సంతోషంగా లేదు. రాష్ట్రంలో 13,42,000 మంది ఉద్యోగులున్నారు. ఇందులో 6 లక్షల మంది రెగ్యులర్ ఉద్యోగులు ఉన్నారు. రెగ్యులర్ ఉద్యోగుల పరిస్థితే ఘోరం గా ఉంది. మిగిలిన వారి పరిస్థితి చెప్పాల్సిన అవసరం లేదు. జగన్ రెడ్డి ఉద్యోగులకు ఇచ్చిన ఒక్క హామీ నెరవేర్చలేదు. ఉద్యోగులు హెల్త్ కార్డు తీసుకుని ఆసుపత్రులకు వెళ్తే పురుగులను చూసినట్టు చూస్తున్నారు. డబ్బులు కట్టని ఆరోగ్యశ్రీ రోగులు, డబ్బులు కట్టే ఉద్యోగులను ఆసుపత్రులు ఒకేలా చూస్తున్నాయి.

ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు వచ్చే పరిస్థితి లేదు. పీఆర్సీ అరియర్స్‌కు దిక్కులేదు. రెండు డీఏ అరియర్స్ పెండింగ్‌లో పెట్టారని నాడు ఉద్యోగులు చంద్రబాబు నాయుడిని కాదనుకున్నారు. 01.07.2018 నుంచి నేటి వరకు 284 డీఏ అరియర్స్‌ కిస్తీలు పెండింగ్‌లో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం ప్రీజ్ చేసిందనే నెపంతో డీఏలను పెండింగ్‌లో పెట్టారు. పోలీస్ డిపార్ట్ మెంట్ వారికి వీక్లీ ఆఫ్ లు అమలు చేయడం లేదు. సిపిఎస్ ఉద్యోగుల ఖాతాలో జమ చేయాల్సిన డబ్బులు ఆరు నెలలుగా జమ చేయడం లేదు. కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఎంప్లాయిస్ మాదిరి జీతాలు ఇస్తానని మాట తప్పాడు. అంగన్‌వాడీలు తమ సమస్యలపై రోడ్లపైకి వస్తే వాలంటీర్లతో బలవంతంగా తాళాలు పగులగొట్టి సెంటర్లను తెరిపిస్తున్నారు.

రేపోమాపో మునిసిఫల్ సానిటరీ వర్కర్స్ కూడా రోడ్లపైకి వస్తారు. మద్యాహ్న బోజనం కార్మికులను కూడా జగన్ రెడ్డి నమ్మించి మోసం చేశాడు. గ్రంధాలయ ఉద్యోగులకు 010 సాలరీలు చెల్లిస్తానని హామీ ఇచ్చి మోసం చేశాడు. వారికి నెలనెలా జీతాలు కూడా రావడం లేదు. జగన్ రెడ్డి వ్యవస్థలన్నింటినీ నీరు గార్చాడు. గోపాలమిత్రలను తీసివేశాడు. చంద్రన్న భీమాలో పనిచేస్తున్న ఉద్యోగులను తొలగించాడు. జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పే విశ్వసనీయత ఆయనే కోల్పోయాడు. ప్రజలకు వాగ్దానాలు చేసేటప్పుడు వాటి పర్యావసానాలను కూడా అంచనా వేసుకోవాలి. వాగ్దానం నమ్మి రోడ్డుమీదకు వచ్చి అడిగితే వారిపై కేసులు పెట్టి జైల్లో పెట్టడం ఎంతవరకు సబబు.

సోషల్ మీడియాలో పోస్టు పెట్టినా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. జగన్ రెడ్డి పాలన కంటే బ్రిటీషు వారి పాలనే బాగుందని ప్రజలు భావిస్తున్నారు. జగన్ రెడ్డి కంటే నీరో చక్రవర్తే ఎన్నో రెట్లు మేలు. జగన్ రెడ్డి స్వార్ధప్రయోజనాలకు టీచర్లను ఎన్నికల విధుల నుంచి తప్పించాలని చూశారు. జగన్ రెడ్డికి తన ఇంటిలోని తన తల్లి, చెల్లి కూడా ఓటు వేయరు. జాబ్ క్యాలెండర్ ఇస్తానని నిరుద్యోగులను మోసం చేశాడు. అమ్మఒడి ఇస్తానని సగం మంది తల్లులకు ఇవ్వలేదు. రాష్ట్రాన్ని ఆర్ధిక ఊబిలో ముంచేశారు. తెస్తున్న అప్పులు ఎక్కడ ఖర్చు చేస్తున్నారో కూడా చెప్పలేని పరిస్థితి.

జగన్ మోహన్ రెడ్డిపై పందేలు కట్టి అభాసుపలైన ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ ఇచ్చే పరిస్థితి లేదు. చంద్రబాబు నాయుడు ఉద్యోగులకు ఏ విధమైన మేలు చేశాడో ఇప్పుడు తెలుస్తోంది. దేశంలోనే రివర్స్ పీఆర్సీ ఇచ్చిన ఘనుడు జగన్ మోహన్ రెడ్డి ఒక్కడే. ఆశావర్కర్లు, నిరుద్యోగులు, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్టు ఉద్యోగులు, మునిసిఫల్ వర్కర్లు ఎవ్వరూ సంతోషంగా లేరు.

ఉద్యోగులు, వ్యవసాయదారులు, కార్మికులు జగన్ రెడ్డిని గద్దెదించేందుకు ఎదురు చూస్తున్నారు. అంగన్ వాడీలకు 2016, 2018 లో తెలుగుదేశం ప్రభుత్వం రెండు సార్లు జీతాలు పెంచాం. జగన్ రెడ్డి ఎన్నికల మూడు నెలల్లోనైనా ఉద్యోగులకు 1 వ తారీఖున జీతాలు ఇవ్వగలడా?

LEAVE A RESPONSE