– రాజ్యసభ సీట్లను వందల కోట్లకు కార్పొరేట్లకు, ప్రక్క రాష్ట్రాల వారికి అమ్ముకున్న చరిత్ర వైసీపీది
– తండ్రిని చంపారని చెప్పి వారికే రాజ్యసభ సీటు భేరం పెట్టిన వ్యక్తి జగన్ మోహన్ రెడ్డి
-మాజీ మంత్రి కిమిడి కళావెంకట్రావు
తెలుగుదేశం పార్టీ రుమాళ్ల రామచంద్రయ్య, గుండు సుధారాణి. అల్లాడి రాజకుమారి, దేవేంధర్ గౌడ్, ప్రొ.లక్ష్మన్న, జయప్రధ, జి. రామచంద్రయ్య, కెంబూరి రామ్మోహనరావు, కళా వెంకట్రావు లాంటి 8 మంది సామాన్య బీసీలకు రాజ్యసభ సీట్లు ఇచ్చిందని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమిడి కళావెంకట్రావు మంత్రి కారుమూరి విమర్శపై స్పందించారు.
తెలుగుదేశం పార్టీ ఒక్క బీసీకి కూడా రాజ్యసభ ఇవ్వలేదని మంత్రి కారుమూరి మాట్లాడటం అతని దిగజారుడుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. ఈ మేరకు పత్రికా ప్రకటన విడుదల చేసి.. వైకాపా అధ్యక్షుడిది అబద్దాల బ్రతుకు….అందులో ఉన్న మంత్రులది అబద్దాల బ్రతుకే అని అన్నారు.
అబద్దాలతో ఎంతోకాలం రాజకీయాలు చేయలేరని, తెలుగుదేశం పార్టీ సామాన్య బీసీలను రాజ్యసభకు పంపితే వైసీపీ వందల కోట్లు తీసుకుని కార్పొరేట్లకు, ప్రక్క రాష్ట్రాల వారికి అమ్ముకున్నారని విమర్శించారు. గుజరాత్, ఇతర రాష్ట్రాల వారికి రాజ్యసభ సీట్లు అమ్ముకుంది వైసీపీ కాదా? తండ్రి వైఎస్ఆర్‌ను హత్య చేశారని చెప్పి రిలయన్స్ వారికే రాజ్యసభ సీటు అమ్ముకున్న చరిత్ర మీ అధినేత జగన్ రెడ్డిది.
వైసీపీ ఒక్క ఎస్సీకీ గానీ, ఒక్క మైనారిటీకీ గానీ రాజ్యసభ సీటు ఇవ్వలేదు. 10 శాతం బీసీ రిజర్వేషన్లకు కోత కోసి 16,800 రాజ్యాంగబద్ద పదవులు దూరం చేసి బీసీల గొంతుకోసింది జగన్ రెడ్డే అని ధ్వజమెత్తారు. అధికారం లేని పదవులు ఎందుకు? తెలుగుదేశంలా ఒక బీసీని రాష్ట్ర అధ్యక్షుడిని చేసే దమ్ము జగన్ రెడ్డికి ఉందా?