Suryaa.co.in

Telangana

నన్ను రెచ్చగొట్టొద్దు!

– నేను దేనికి భయపడను
– కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలి
– బీసీలను గౌరవించాలని కోరా
– కడియం, రేవూరి, నాయినిపై చర్యలు తీసుకోవాలి
– మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి
గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీతో కొండా మురళీ భేటీ

హైదరాబాద్: ‘నేను బలహీనుడినా బలవంతుడినా అనేది అందరికీ తెలుసు. నన్ను రెచ్చగొట్టొద్దు. నేను రాజీనామా చేసి కాంగ్రెస్‌లోకి వచ్చా. కాంగ్రెస్‌లో చేరిన కడియం శ్రీహరి రాజీనామా చేస్తారో లేదో ఆయనే తేల్చుకోవాలి. బీసీలను గౌరవించాలని కోరా. నేను దేనికి భయపడను. సీఎం, పీసీసీ అంటే గౌరవం ఉంది. మళ్ళీ అవసరం వచ్చినప్పుడు వరంగల్‌లో మాట్లాడుతా’ అని మాజీ ఎమ్మెల్సీ, మంత్రి కొండా సురేఖ భర్త కొండా మురళి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కాంగ్రెస్ పార్టీ అంటే తనకు గౌరవం ఉందని కొండా మురళి అన్నారు. వైఎస్సార్‌తో కాంగ్రెస్‌పై తనకు అభిమానం పెరిగిందన్నారు. రాహుల్ గాంధీని ప్రధాన మంత్రిని చేయాలనే తపన తనలో ఉందన్నారు. బహిరంగ విమర్శలు చేయడం మంచిదో చెడునో అంతరాత్మకు తెలుసన్నారు.

శనివారం గాంధీభవన్‌లో క్రమశిక్షణా కమిటీతో కొండా మురళీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా 15 పేజీలతో కూడిన నివేదికను కమిటీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. గతంలో కొండా మురళి చేసిన వ్యాఖ్యలపై క్రమశిక్షణ కమిటీ వివరణ కోరిన నేపథ్యంలో 15 పేజీల లేఖను సమర్పించినట్లు తెలుస్తోంది.
కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, నాయిని రాజేందర్ రెడ్డిపై కమిటీకి కొండా ఫిర్యాదు చేశారు . ఉమ్మడి వరంగల్‌లో ప్రతీ నియోజకవర్గంలో జరుగుతున్న అంశాలపై నివేదిక సమర్పించినట్లు తెలుస్తోంది. కడియం, రేవూరి, నాయినిపై వెంటనే చర్యలు తీసుకోవాలని కొండా మురళి కోరుతున్నారు.

LEAVE A RESPONSE