Suryaa.co.in

Telangana

పివిని భారతరత్నతో గౌరవించింది

– కాంగ్రెస్ చేసిన అవమానం దారుణం
– మాజీ ప్రధాని పీవీ 104వ జయంతి సందర్బంగా నివాళులర్పించిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

హైదరాబాద్: పీవీ బహుముఖ ప్రజ్ఞాశాలి.. బహుభాషాకోవిదుడు.. దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి..మన పీవీ తెలంగాణ ఖ్యాతిని ఖండాంతరాలకు చాటిన మహా మేధావి.. భారత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జయంతి నేడు. 104 వ జయంతి సందర్బంగా దేశానికి వారు అందించిన సేవలను గుర్తు చేసుకుంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా, భారత ప్రధానిగా క్లిష్టసమయాల్లో బాధ్యతలు స్వీకరించిన పీవీ.. ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన భారతదేశాన్ని భారత ప్రధానిగా తన శక్తియుక్తులతో గట్టెక్కించారు. రాజకీయాల్లో పీవీ అపరచాణక్యుడు. ఆయన ఏ పదవి చేపట్టినా అది ప్రజల పక్షంగానే నడిచింది. ముఖ్యమంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఆయన ప్రజల మనిషిగానే పనిచేశారు.

కవి, రచయిత, అనువాదకుడు, కథకుడు, పాత్రికేయుడిగా ఆయన చేసిన సేవలు వెలకట్టలేనివి. తనకు వారసత్వంగా వచ్చిన భూమిని పేదలకు పంచిన త్యాగశీలి మన పీవీ. ఇంతటి గొప్ప వ్యక్తి సేవలను కాంగ్రెస్ విస్మరించినా.. మోదీ సర్కారు.. భారత రత్న పురస్కారంతో గౌరవించిందని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గుర్తు చేశారు.

LEAVE A RESPONSE