పట్టణం లో ఇల్లు కట్టు కోవాలంటే రిజిస్ట్రేషన్ ఛార్జీలు 50వేల నుండి 3 లక్షలు కట్టాలి. LRS లక్ష నుండి ఐదు లక్షలు కట్టాలి. పర్మిషన్ చార్జెస్ లక్ష నుండి రెండు లక్షలు కట్టాలి. మొత్తం పది లక్షలు చెల్లించాలి. LRS దరఖాస్తు దారులు మొత్తం 26 లక్షల మంది ఉన్నారు. LRS రద్దు చేయలేదు. మళ్ళీ కెసిఆర్ గెలిస్తే బలవంతంగా LRS వసూలు చేస్తారు. నాలుగు ప్లాట్లు కష్ట పడి కొనుక్కున్నవి ఉన్నాయి అంటే, LRS కట్టడానికి ఒక ప్లాట్ అమ్ము కోవాల్సిందే. రిజిస్ట్రేషన్లు బంద్చేసైనా LRS వసూలు చేస్తాడు.
గ్రామ పంచాయితీలలో LRS లేని ప్లాట్లకు ఇల్లు కట్టు కోవడానికి పర్మిషన్ ఇవ్వడం లేదు. గ్రామ ప్రజలకు సొంతింటి కలను దూరం చేశాడు. BRS అమలు చేసి ప్రతి ఇంటికి కనీసం లక్ష నుండి ఐదు లక్షలు వసూలు చేస్తాడు. ఇది నిజం కాదంటే LRS ను BRS ను రద్దు చేయమనండి. ధరణీ తెచ్చిండు. మన భూమి ఇతరుల మీద నమోదు చేసిండు. మనకు నిద్ర లేకుండా చేసిండు. ఎవ్వరికీ మొర పెట్టు కున్నా వారికి( అధికారులకు) మన సమస్య తీర్చే అధికారం ఇవ్వలేదు.
లక్షల లో సాధబై నామాలు ఉన్న రైతులు ఆగం అయ్యారు. ఫ్రీడమ్ పైటర్ ల మిలటరీ అధికారుల భూమి , ప్రోహిబి టెడ్ లిస్ట్ లో పెట్టిండు. అసైన్డ్ భూములు గుంజు కుంటూ అసైన్డ్ భూమి ఉన్న రైతులను, అడుక్కునే వారిని చేసిండు. పోడు భూములు సాగుచేసు కుంటున్న రైతులను, బట్ట లూడంగా పొర్లించి కొట్టి జైల్లో పెడుతుండు. అత్యధిక భూమిని సాగు చేసి పంట పండిస్తున్న కౌలు రైతులను గుర్తించను అన్నాడు. పంట్ట పండని భూమికి రైతు బంధు ఇచ్చి, ప్రజా ధనం వృధా చేస్తుండు… వామ్మో మళ్ళీ కేసీఆర్ వద్దు నేను ఓటెయ్యను.
– నారగొని ప్రవీణ్ కుమార్