– రైతుపై లాఠీ ఎత్తిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
– టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం చదలవాడ వద్ద పాదయాత్రకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిపై పోలీసులు లాఠీ ఛార్జ్ చెయ్యడం దారుణం. పోలీసుల దాడిలో గాయపడిన వారికి మెరుగైన వైద్య సహాయం అందించాలి. న్యాయస్థానాల ఉత్తర్వులను ధిక్కరిస్తూ ఉద్యమకారుల పై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి.
న్యాయస్థానం నుంచి దేవస్థానం వరకూ అమరావతి రైతులు చేపట్టిన మహాపాదయాత్ర జగన్ సర్కారుకి కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. పోలీసుల్ని ప్రయోగించి పాదయాత్రకి అడుగడుగునా ఆటంకాలు కల్పించడం న్యాయమా? హైకోర్టు అనుమతితో చేస్తున్న పాదయాత్రకి ఖాకీల ఆంక్షలు ఎందుకో? ఎండనక, వాననక ఏడుకొండలవాడి సన్నిధికి పాదయాత్రగా వెళ్తుంటే, వారికి సంఘీభావం తెలపడమూ నేరమా? కవరేజ్‌కి వచ్చిన మీడియా ప్రతినిధుల్ని ఎందుకు ఆపుతున్నారు? మహాన్యూస్ ఎండీ వంశీని, పలువురు పాత్రికేయులను పోలీసులు అడ్డుకోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.