Suryaa.co.in

Andhra Pradesh

రాజ్యాంగం ద్వారా డా. అంబేడ్కర్ ఆశించిన రాజ్యాంగ ఫలాలు రాష్ట్రంలో పేదలకు అందడం లేదు

– తెదేపా రాష్ట్ర అధ్యక్షులు కింజరాపు అచ్చెన్నాయుడు
-తెదేపా ప్రధాన కార్యాలయంలో 74 వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

‘రాజ్యాంగం ఎంత చెడ్డదైనా పాలకుడు మంచివాడైతే అది మంచి ఫలితాలు ఇస్తుంది. రాజ్యాంగం ఎంతమంచిదైనా పాలకుడు చెడ్డవాడైతే అది చెడ్డ ఫలితాలు ఇస్తుందని’ డా. అంబేడ్కర్ చెప్పారు. ఈ మాట వింటుంటే జగన్ మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గులు ఉంటారని నాడే అంబేడ్కర్ ఊహించాడు. దేశంలోని ప్రతీ వ్యక్తి కుల, మత బేధాలు లేకుండా అందరికీ సమాన హక్కుల కల్పించాలని నాడు అంబేడ్కర్ తలచారు. నాడు అంబేడ్కర్ గారు కలలు కన్న రాజ్యాంగ ఫలాలు నేడు రాష్ట్రంలో కాలరాయబడుతున్నాయి.

దళిత-గిరిజనులపై దాడులు అరికట్టాలని నాడు తెలుగుదేశం ప్రభుత్వం జస్టిస్ పున్నయ్య కమీషన్ ఏర్పాటు చేసి అనేక రక్షణ చర్యలకు చట్టాలు తీసుకొచ్చింది. జగన్ రెడ్డి పాలనలో పేదలకు అంబేడ్కర్ ఫలాలు అందకపోవడమే కాకుండా వారిపై దుర్మార్గమైన దమనకాండ కొనసాగుతున్నది. వైకాపా పాలనలో 28 మంది ఎస్సీలను పొట్టన పెట్టుకున్నారు. భారత రాజ్యాంగం రాష్ట్రంలో అమలు జరగాలంటే, హరిజన, గిరిజన, బడుగు వర్గాలు ఈ రాష్ట్రంలో తలెత్తుకు తిరగాలంటే జగన్ మోహన్ రెడ్డిని అధికారం నుంచి దింపాలి.

తెలుగుదేశం పార్టీ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌ను త్రికరణశుద్దిగా అమలు చేస్తే దాన్ని జగన్ రెడ్డి నిర్వీర్యం చేశాడు. జగన్ రెడ్డి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల ఎస్సీ, ఎస్టీ బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. తెలుగుదేశం ప్రభుత్వం దళితులు ఇచ్చిన భూములను సైతం జగన్ రెడ్డి లాక్కున్నాడు. రాజ్యాంగం ప్రసాదించిన స్వాతంత్ర్య ఫలాలు అందరికీ అందాలంటే పేదల పార్టీయైన తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావాలి.

ప్రపంచ దేశాల్లన్నింటిలో భారత రాజ్యాంగం అత్యుత్తమమైనది – వర్ల రామయ్య
డా. అంబేడ్కర్ అన్ని దేశాల రాజ్యాంగాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసి ప్రపంచ దేశాల్లోనే అత్యుత్తమ రాజ్యాంగాన్ని దేశానికి ఇచ్చారు. అటువంటి రాజ్యాంగానికి రాష్ట్రంలో విలువ లేదు. జగన్ మోహన్ రెడ్డి రాజ్యాంగేతర శక్తిగా మారి రాజ్యాంగాన్ని అపహస్యం చేస్తున్నాడు. వేల కోట్ల రూపాయలు దోపిడీ చేసి 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డి లాంటి వ్యక్తులు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు అవుతారని ఊహించి ఉండరు. ఇలాంటి వ్యక్తులు అధికార పగ్గాలు చేపడతారని నాడు అంబేడ్కర్ ఊహించి ఉంటే ఇలాంటి వారు అధికారంలోకి రాకుండా రాజ్యాంగంలోనే ఏదో ఒక మెలికపెట్టేవారు.

జగన్ మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరులు అవినీతి సొమ్ముతో ఎన్నికల ఫలితాలను కూడా తారుమారు చేస్తున్నారు. దేశ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటే జగన్ మోహన్ రెడ్డి లాంటి నేరచరితులు అధికారం చేపట్టకుండా రాజ్యాంగాన్ని సవరించుకోవాలి. అవినీతిపరులకు చెక్ పెట్టాల్సిన అవసరం ఉంది. జగన్ మోహన్ రెడ్డి లాంటి అవినీతిపరుడు పదేళ్ల నుంచి బెయిల్ ఎలా బయట ఉండగలిగారు అని అత్యున్నత న్యాయస్థానం కూడా సమీక్షించుకోవాలి. అత్యున్నత న్యాయస్థానం సిబిఐ పాత్రపై కూడా సమీక్ష చేయాలి. జగన్ మోహన్ రెడ్డి అవినీతిపరుడు జైలుకు పోవడం ఖాయం.

అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్ రెడ్డి కాలరాస్తున్నాడు -ఎం.ఎస్ రాజు 
డా. అంబేడ్కర్ భారత రాజ్యాంగంతో అందరికీ సమాన హక్కుల కల్పించారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని జగన్ రెడ్డి కాలరాస్తున్నాడు. రాష్ట్ర ముఖ్యమంత్రి వ్యవస్థలను మేనేజ్ చేస్తూ రాజ్యాంగేతర శక్తిగా ఎదిగాడు. దళిత, గిరిజన, బడుగు, బలహీన వర్గాలపై జగన్ రెడ్డి ప్రభుత్వం దాడులు చేయిస్తోంది. జగన్ రెడ్డి పాలనలో SC, ST, BC, మైనారిటీలకు రాజ్యాంగబద్ధంగా రావాల్సిన హక్కులను రద్దు చేస్తున్నారు. దిశ చట్ట ప్రచార సభ నిర్వహించిన రాజమండ్రిలోనే దళిత బిడ్డ అత్యంత కిరాతకంగా అత్యాచారానికి గురయ్యింది. SC, ST, BC, మైనారిటీలపై దాడులు జరుగుతున్నా ముఖ్యమంత్రి వాటిని అరికట్టే ప్రయత్నం చేయడం లేదు. జగన్ రెడ్డి నియంతలను తరిమికొట్టాలంటే భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి. తెలుగుదేశం ప్రభుత్వాన్ని తీసుకురావాలి.

జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు – పీతల సుజాత
డా. అంబేడ్కర్ మహిళా హక్కుల కోసం హిందూ కోడ్ బిల్లు తీసుకురావడం కోసం ఎంతో శ్రమించారు. జగన్ రెడ్డి పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలకు రక్షణ కల్పించిన నాయకుడు చంద్రబాబు నాయుడు. జగన్ రెడ్డి పాలనలో సంక్షేమ పథకాలు SC, ST, BC, మైనారిటీలకు అందడం లేదు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 50 వేల బ్యాక్‌లాగ్ పోస్టులు భర్తీ చేయడం లేదు. SC, ST, BC, మైనారిటీలకు గతంలో అమలు చేసిన పథకాలు మరలా అమలు కావాలంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలి.

రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడి పాలన రావాలి -పిల్లి మాణిక్యాల రావు 
అధికారం ఎవరి చేతుల్లో ఉన్న రాజ్యాంగాన్ని అనుసరించే పాలన చేయాలి. రాజ్యాంగం లేని రోజుల్లో దళితులపై జరిగిన దాడులు నేడు జగన్ రెడ్డి పాలనలో జరుగుతున్నాయి. ఏపీలో దళితులపై జరుగుతున్నన్ని దాడులు 29 రాష్ట్రాలలో ఎక్కడా జరగడం లేదు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాజ్యాంగాన్ని రక్షించుకోవాలంటే చంద్రబాబు నాయుడి పాలన రాష్ట్రంలో తెచ్చుకోవాలి.

కార్యక్రమంలో ఎస్సీ సెల్ ఉపాధ్యాక్షులు అఖిల్, గొట్టిముక్కల కోటేశ్వర్ రావు, రాష్ట్రపార్టీ కార్యదర్శి దేవతోటి నాగరాజు, రాష్ట్ర ఎస్టీ సెల్ అధ్యక్షులు ధారు నాయక్ తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE