Suryaa.co.in

Features

పూర్తి స్వాతంత్రం సాధించడంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ డాక్టర్ హెగ్డేవార్ పాత్ర

1948 జనవరి 17న ఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సమావేశాల్లో ఆర్ఎస్ఎస్ ను నిరోధించే చర్యలు చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు వెళ్లాయి . కాంగ్రెస్ లోని క్రింది స్థాయి కమిటీలు ఈ పని చేపట్టాలని నిర్ణయించారు. అప్పుడే ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యక్రమాల్లో పాల్గొనడం చట్ట విరుద్ధం అంటూ, కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది . ఈ సంఘం వ్యతిరేక బృందానికి ఉత్తరప్రదేశ్ మంత్రి రఫీ అహ్మద్ కిద్వాయ్ నాయకత్వహించారు . దేశ విభజన పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి చేసిన సహాయ కార్యక్రమాలు స్వయంసేవకులకు, ఈ పరిణామాలన్నీ ఎంతటి నిరాశ కలిగించి ఉంటాయో అర్థం చేసుకోవచ్చును .

నిజానికి ప్రజలకు కష్టం వస్తే సంఘం ఆదుకుంటుందనే విశ్వాసం అందరిలో ఉంది. ముఖ్యంగా తూర్పు పంజాబ్ లో హిందువులు, సిక్కు శరణార్థులను కాపాడి పునరావాసం కల్పించడంలో స్వయంసేవకులు ప్రధాన పాత్ర పోషించారని అందరికీ తెలుసు. ఈ విషయంలో (పునరావాసం) నెహ్రూ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కూడా ఎదురుగా కనిపిస్తున్న సంగతే. కానీ సంఘమే పంజాబ్ లో ఉద్రిక్తతలు రెచ్చగొడుతుందని కాన్పూర్ సభలో నెహ్రూ ఆరోపించారు.

తన ఆరోపణలకు ఆధారాలు మాత్రం ఆయన చూపలేదు. అటువంటి పదవిలో ఉన్న ఆయన, ముందుగా ఆలోచించి మాటలు ప్రయోగించాలి . ఆరోపణలు చేయాలి. పంజాబ్ ప్రాంతం మొత్తం హింసాత్మక దాడులతో అట్టుడుకు తున్నప్పుడు , ముస్లిం లీగ్ దుండ గీడు తనాన్ని ఎదుర్కొనలేక కాంగ్రెస్ నాయకులంతా ఢిల్లీలో శాంతి వచనాలు పలుకుతూ కూర్చుంటే క్రమశిక్షణ,శక్తి సామర్థ్యాలు నిస్వార్థ సేవా భావం కలిగిన స్వయంసేవకులే, ప్రజలకు అండగా నిలబడ్డారు . దాడులను ఆపడానికి కఠినంగా వ్యవహరించాలని, గవర్నర్ జనరల్ ను కూడా ఒప్పించలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. అని ఏ.ఎన్. బాలి తన పుస్తకంలో వివరించారు .

కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటలు — ఆర్ఎస్ఎస్ పై ఆరోపణలు
మధ్యప్రదేశ్ హోమ్ మంత్రి ద్వారకీ ప్రసాద్ మిశ్రా చేసిన ఒక ప్రకటన , సంఘాన్ని ప్రశంసిస్తున్న విధంగా ఉంది.ప్రత్యర్థులకు సమాధానం ఇస్తూ ఆయన తన ప్రకటనలో (నవభారత్ 1947 డిసెంబర్ 19 ) “సంఘం లాఠీ బలంతో ప్రభుత్వాన్ని కూల దోస్తుందని ఆరోపణ, భయం, అర్ధరహితమైనవి ఇదే ఆరోపణ స్థానిక డీఎస్పీ గురించి ఎందుకు చేయరు ? సంఘం రాజకీయ సంస్థ అంటే నేను నమ్మను అది నెహ్రూ ప్రభుత్వాన్ని కూల దోస్తుందనే ఆరోపణను అసలే నమ్మను “అని పేర్కొన్నారు .

అప్పుడే స్వాతంత్రం పొందిన దేశాన్ని రాజకీయ వైరుధ్యాలు , ఒత్తిడిలు ,సమస్యలు చుట్టుముట్టాయి . నెహ్రూ- పటేల్ వర్గాల మధ్య విభేదాలు పూర్తిగా బయటపడ్డాయి. వీటివల్ల సంఘానికి కూడా ఇబ్బంది కలిగింది . 1948 జనవరిలో ఒక సభలో మాట్లాడుతూ పటేల్ ఇలా అన్నారు – “అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారు తమ హక్కులు అధికారులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, సంఘంతో భిన్నమైన (సామరస్య పూర్వక )ధోరణిలో వ్యవహరించాలి .కేవలం అధికార బలంతో ఒక సంస్థను అణిచివేయాలనుకోవడం సాధ్యం కాదు .సంఘ కార్యకర్తలు వ్యక్తిగత స్వార్ధ ప్రయోజనాల కోసం పనిచేసే వారు కారు .తమ మాతృభూమిని ప్రేమించే ,అభిమానించే దేశభక్తులు .

ఆ తరువాత కొద్దిరోజులకే పటేల్ గారి ఉపన్యాసానికి సమాధానం చెబుతున్నట్టుగా అమృతసర్ లో జరిగిన ఒక సభలో నెహ్రూ ఇలా అన్నారు-“.సంఘం, హిందూ మహాసభ వారు మన జాతీయ పతాకాన్ని అవమానించారు . వాళ్లు దేశద్రోహులు వారు నేను పూర్తిగా అణిచివేస్తాను” . అలా ప్రభుత్వం లోనే భిన్న స్వరాలు వినిపించేవి. విభజన కల్లోలం సద్దుమణిగి ఢిల్లీలో స్థిరపడిన తరువాత, ఒకప్పుడు ప్రాణభయంతో ఆర్ఎస్ఎస్ సహాయాన్ని ఆర్థించిన కాంగ్రెస్ నాయకులే మాట మార్చారు . అటువంటి వారిలో ప్రముఖుడు సీనియర్ నేత భీమ్ సేన్ సచార్ విభజన సమయంలో లాహోర్ లోని ఈయన ఇంటిపై ముస్లింలు, గుండాలు దాడి చేసినప్పుడు, స్వయంసేవకులు రక్షణగా నిలిచి ఆయనను, ఆయన కుటుంబాన్ని కాపాడారు.

కానీ అదే సచార్ ఆ తరువాత ఎలాంటి ఆధారాలు చూపకుండా, గాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ దుష్ప్రచారం సాగించాడు.అప్పుడు ప్రభుత్వం విధించిన నిషేధానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో స్వయంసేవకులు సత్యాగ్రహాలు నిర్వహించారు. పంజాబ్లో సచార్ ప్రభుత్వం, ఆ సత్యాగ్రహాలను అణిచివేయడంలో ముందుంది. స్వయంసేవకులను ఏ స్థాయిలో హింసించారంటే.. సత్యాగ్రహం లో పాల్గొన్న సచార్ ఇద్దరు మేనమామలను కూడా జైలులో బంధించారు .
( స్వరాజ్య సాధనలో ఆర్ఎస్ఎస్ అనే పుస్తకం ఆధారంగా)

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు ,
మొబైల్ నెంబర్ 7386128877

LEAVE A RESPONSE