పరీక్షలు మొదలుకొని.. వేసిన ఓటు వరకు అనుమానాలే?

Spread the love

– ఈవిఎం లను కంట్రోల్ చెయ్యడం రష్యన్ హ్యాకర్లకు చాలా కష్టమైన పనా?
– పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చెయ్యగలిగినప్పుడు.. ఒక్కో నియోజకవర్గంలో పదేసి ఈవీఎంలు హ్యాక్ చెయ్యలేరా?

పాతికేళ్ల రష్యా కుర్రాడు మన దేశ అత్యున్నత ఐఐటీ ఎంట్రన్స్ జె ఇఇ మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్యూటర్లను హ్యాక్ చేశాడు.
820 మంది ఐఐటీలలో అడుగుపెట్టేలా చేశాడు.
మనదేశంలో గౌరవంగా ప్రతిష్టాత్మకంగా గర్వంగా చెప్పుకొనే ఆ ఎగ్జామ్స్ తొమ్మిది లక్షలమందికి పైగా వ్రాశారు.
ఆ విధానం అభాసుపాలు అయ్యింది అంటే, ప్రపంచ వ్యాప్తంగా ఆ ఐఐటీ ప్రాంగణాలకు వచ్చి కోట్ల రూపాయల ప్యాకేజి ఇచ్చే ఇంటర్నేషనల్ కంపెనీలు ఏమనుకొంటాయి?
మన దౌర్భాగ్యం.. మన పిల్లలు వ్రాసే పరీక్షల మొదలుకొని ..వేసిన ఓటు వరకు అనుమానాలతో దేశ ప్రతిష్ట మీద నీలి మేఘాలు కమ్ముకొంటున్నాయి.
డెకాయిటీలను జనం నిజ్జంగా ఎన్నుకొంటే ఆ ఎధవలు అభివృద్ధి చేస్తారు. ఏమీ చేయకపోయినా.. జనం ఉమ్మేస్తున్నా.. మేమే గెలవబోతున్నాం అని దేశంలో చెబుతుంటే… అనుమానాలు అందరికీ రావడమే కాదు.. ఆ డెకాయిటీల అభిమానులు కూడా ఆశ్చర్యపోతున్నారు.
పరీక్షల కంప్యూటర్లను బయట నుండి కంట్రోల్ లోకి తీసుకొని, పరీక్షలు వ్రాయించారు, ప్రొఫెషనల్స్ ని ప్రక్కన బెట్టుకొని.
మరి ఈవిఎంలను కంట్రోల్ చెయ్యడం రష్యన్ హ్యాకర్లకు చాలా కష్టమైన పనా?
820 విద్యార్థుల యూజర్ నేమ్ పాస్వర్డ్ తీసుకొని హ్యాక్ చెయ్యగలిగినప్పుడు.. ఒక్కో నియోజకవర్గంలో పదేసి ఈవీఎంలు హ్యాక్ చెయ్యలేరా?
అసలు పేపర్ బ్యాలెట్ వద్దని ఎందుకు చెబుతారు?

– రమాదేవి

Leave a Reply