Suryaa.co.in

Telangana

నటుడు కృష్ణంరాజు మృతికి డాక్టర్ కె లక్ష్మణ్ సంతాపం

మాజీ కేంద్రమంత్రి, బిజెపి నాయకులు యు.వి.కృష్ణంరాజు నేడు అనారోగ్యంతో మరణించారన్న వార్త తీవ్రంగా బాధించింది. వారితో కలిసి అనేక సంవత్సరాలు పార్టీలో పని చేయడం జరిగింది. మృదుస్వభావి.

రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా, కేంద్ర మంత్రిగా అనేక సంవత్సరాలు పనిచేసినా, నీతి నిజాయితీతో సమర్థవంతంగా పనిచేశారు.

వారి మరణం బిజెపి పార్టీ కి, తెలుగు ప్రజలకు, సినిమా కళాకారులకు తీరని లోటు. కృష్ణంరాజు మరణం పట్ల వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం, సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తున్నాం.

LEAVE A RESPONSE