Suryaa.co.in

Features

డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌… డాక్టర్‌ కాదు.. ఆయనో బ్రాండ్‌

డాక్టర్‌ వ్యాకరణం నాగేశ్వర్‌. డాక్టర్‌ కాదు.. ఆయనో బ్రాండ్‌.రోగులకు వైద్యం అందించడమే కాదు.. అలర్జీ ఇమ్యునాలజీపై ఎన్నో ఎన్నెన్నో పరిశోధనలు చేశారు. చేస్తూనే ఉన్నారు. పల్మనాలజీ రంగంలో సుదీర్ఘ అనుభవం ఆయన సొంతం. తాను సముపార్జించిన విజ్ఞానాన్ని, ఆర్జిస్తున్న అనుభవాన్ని భావితరాలకు అందించే అసోసియేట్‌ ప్రొఫెసర్‌గానూ ఆయన వ్యవహరిస్తున్నారు. దేశ విదేశాల నుంచి అనేకానేక సత్కారాలు పొందారు. పదుల సంఖ్యలో అవార్డులు, రివార్డులు సాధించారు. ప్రధానంగా అమెరికా గుర్తించిన ప్రఖ్యాత కన్సల్టెంట్‌ అలర్జీ నిపుణుల్లో వ్యాకరణం నాగేశ్వర్‌ ఒకరు.

ఆయన వైద్య నిపుణులు మాత్రమే కాదు.. మెడికల్‌ జర్నలిస్ట్‌, గొప్ప వక్త, రచయిత కూడా. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటి, ఏకైక అర్హత కలిగిన మెడికల్ జర్నలిస్ట్. పలు మీడియా సంస్థలకు ఫ్రీలాన్స్‌ మెడికల్‌ జర్నలిస్ట్‌గా సేవలందిస్తున్నారు. అంతేకాదు.. వివిధ టెలివిజన్‌ ఛానెళ్లకు హెల్త్‌ బులెటిన్లు అందించారాయన. న్యూస్‌ అనలిస్ట్‌గా వందకు పైగా లైవ్‌ షోలలో పాల్గొన్న అనుభవం ఆయన సొంతం.

ప్రస్తుతం వివిధ కార్పొరేట్‌ హాస్పిటల్స్‌కు చీఫ్‌ కన్సల్టెంట్‌ పల్మోనాలజిస్ట్‌గా, అలర్జీ సూపర్‌ స్పెషలిస్టుగా, క్రిటికల్‌ కేర్‌ ఇంచార్జ్‌గా తన సేవలు అందిస్తున్నారు. దుర్గాబాయి దేశ్‌ముఖ్‌ ఆసుపత్రిలో అసోసియేట్‌ ప్రొఫెసర్‌గా, ఎంసీహెచ్‌ఆర్‌డీలో ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఎఫ్‌ఎస్‌లకు అలర్జీ, ఆస్తమా, కరోనా ఇన్ఫెక్షన్లపై బోధించే విజిటింగ్‌ ఫ్యాకల్టీగానూ వ్యవహరిస్తున్నారు. పల్మనరీ మెడిసిన్, అలర్జీ, ఆస్తమాకు సంబంధించి బోధనలు, పరిశోధనలు సాగిస్తున్నారు.

16 సంవత్సరాల క్రితం, అలర్జీ ఇమ్యునాలజీలో సేవలు ప్రారంభించి, ప్రపంచంలోని అత్యాధునికమైన, అంతర్జాతీయ వైద్య నైపుణ్యతతో, సేవలను హైదరాబాదులో అందిస్తున్న దక్షిణ భారతదేశంలోనే, అగ్రజుడు వైద్యుడు డాక్టర్ వ్యాకరణం. అమెరికా, ఆస్ట్రేలియా,లండన్, దుబాయ్,మస్కట్, అబుదాబి, oman, కువైట్, కెన్యా, వంటి ప్రపంచ దేశాల నుండి కూడా హైదరాబాద్ కి అనునిత్యం, అలర్జీ రోగులు డాక్టర్ వ్యాకరణం ని వెతుక్కుంటూ వస్తున్నారు అంటే, ఆయనపై ,అంతర్జాతీయంగా,ఉన్న అపారమైన వైద్యపరమైన విశ్వాసం అద్దం పట్టినట్లు చెప్తుంది.

నిత్య విద్యార్థి అనే నానుడి డాక్టర్‌ వ్యాకరణం విషయంలో అక్షర సత్యం. ఎందుకంటే.. ఇన్ని బాధ్యతలు, వృత్తి పనుల్లో బిజీగా ఉండి కూడా ఈ వయసులోనూ పలు కోర్సులు అభ్యసిస్తున్నారు. ఇప్పటికే పదికి పైగా డిగ్రీలు సొంతం చేసుకున్నారు. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీలు తన అమ్ముల పొదిలో చేర్చుకున్నారు. ఇంకా విద్యా దాహం తీర్చుకుంటూనే ఉన్నారు. ఇక, వైద్యరంగంలోనే కాకుండా.. సామాజిక రంగంలోనూ తనదైన సేవలందిస్తున్నారు. పలు సంస్థల నుంచి ప్రశంసలు అందుకుంటున్నారు.

డాక్టర్ వ్యాకరణం సేవలో విశేషమేమిటి!!
అలర్జీ ఇమ్యునాలజీ ఇబ్బందులతో బాధపడే వారి సంఖ్య భారతదేశంలో 30 కోట్లు, అలర్జీ ఇమ్యునాలజీ సూపర్ స్పెషలిస్ట్ సేవలందించే వారి సంఖ్య 100కు పైగా లేదు. 2 తెలుగు రాష్ట్రాల్లో, అలర్జీ ఇమ్యునాలజీ తో బాధపడుతున్న వారి సంఖ్య, సుమారు రెండున్నర కోట్లు, అలర్జీ ఇమ్యునాలజీ వైద్య సేవలు అందిస్తున్న నిష్ణాతులు ఇద్దరు లేక ముగ్గురు. ఇటువంటి అరుదైన, విశేషమైన వైద్య సేవలు డాక్టర్ వ్యాకరణం అందించడమే కాకుండా, హైదరాబాద్కి అంతర్జాతీయ వైద్య సేవ రంగములో, ఆయన వంతు పాత్ర పోషించడం వలన, గుర్తింపు వస్తున్నదంటే అతిశయము కాదు.

మోడిఫైడ్ ఎలర్జీ స్కిన్ టెస్టింగ్, అల్లర్జున్ స్పెసిఫిక్ sublingual immunotherapy, కాంపొనెంట్ రిజల్ట్ డయాగ్నసిస్, వంటి ప్రపంచ స్థాయి, అలర్జీ చికిత్స విధానాలు అందుతున్న దేశాలు కొన్ని మాత్రమే, ఇట్టి పరిస్థితుల్లో, మన భారతదేశంలో, హైదరాబాద్ కు చెప్పుకోదగ్గ స్థానాన్ని డాక్టర్ వ్యాకరణం అందించారు.
అలర్జిక్ రైనైటిస్, అలర్జిక్ ఆస్తమా, అలర్జిక్ సైనసైటిస్, డ్రగ్ ఎలర్జీ, ఫుడ్ ఎలర్జీ, స్కిన్ ఎలర్జీ, డస్ట్ ఎలర్జీ, పూలన్ ఎలర్జీ , వంటి పాలైన ఎలర్జీ సమస్యలకు ప్రపంచ స్థాయి విలువలతో చికిత్స చేయడమే కాకుండా, అందరికీ అందుబాటులో ఉండే లాగా డాక్టర్ వ్యాకరణం సేవలందిస్తున్నారు.

ఇటువంటి సీనియర్ అలర్జీ ఇమ్యునాలజీ వైద్యుడిని సంప్రదించడానికి, వైద్య సలహాల కోసం సంప్రదించడం అంటే, అభివృద్ధి చెందిన దేశాల్లో అంత సులువైన పని కాదు. అటువంటిది, ఆన్లైన్ అపాయింట్మెంట్ తీసుకొని, ఇబ్బంది లేకుండా హైదరాబాద్ చేరుకొని, ఒకట్రెండు రోజుల్లో డాక్టర్ వ్యాకరణం బద్ద అలర్జీ చికిత్సా విధానము ముగించుకొని, తిరిగి ప్రయాణం అవుతున్న విదేశీయులు ఎంతోమంది. భారతదేశంలోనే మొట్టమొదటి అలర్జీ helpline 1800-425-0095 సర్వీస్ ప్రారంభించిన, ప్రాణాంతకమైన ఎలర్జీల పట్ల ఉచిత సత్వర సలహాలు అందిస్తున్నారు డాక్టర్ వ్యాకరణం.

LEAVE A RESPONSE