Suryaa.co.in

Crime News Telangana

సెంట్రల్ యూనివర్సిటీలో డ్రగ్స్ కలకలం

– డ్రగ్స్ కేసులో ఎక్కువ మంది సాప్ట్ వేర్ ఉద్యోగులే
– ప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీ విద్యార్థుల అరెస్ట్
– ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్‌ పార్టీలు

హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేపుతున్నాయి. డ్రగ్స్ కేసుల విషయంలో విద్యార్ధులు ఎక్కువగా వున్నారని, వారిపై కేసులు నమోదు చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నామన్నారు హైదరాబాద్‌ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్.

ఓయో రూమ్‌ల్లో ప్రైవేట్‌ పార్టీలు జరుగుతున్నట్టు గుర్తించాం.. రూల్స్‌ పాటించకపోతే చర్యలు తీసుకుంటాం సీసీ కెమేరాలు ఉండాలి 6 నెలల స్టోరేజీ ఉండాలి ఓయో రూమ్ బుక్‌ చేసుకున్నప్పుడు ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలన్నారు సీపీ సీవీ ఆనంద్‌.

యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజీ, డిగ్రీ కాలేజీలలో జోరుగా మత్తు ముందు విక్రయాలు జరుగుతున్నాయి. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గంజాయి విక్రయాలు జరుగుతున్నాయి. డార్క్ నైట్ ద్వారా డ్రగ్స్ తెప్పించుకుంటున్నారు విద్యార్థులు. డార్క్ నెట్ పైన హైదరాబాద్ పోలీస్ నిఘా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన ముగ్గురు విద్యార్థులను అరెస్ట్ చేశామన్నారు. ఇద్దరు విద్యార్థినులను కూడా అరెస్టు చేశాం.

cp-cv-anandప్రతిభ, అవినాష్ డిగ్రీ కాలేజ్, మల్లారెడ్డి కాలేజీలో చదువుకుంటున్న విద్యార్థుల్ని అరెస్ట్ చేశామన్నారు సీపీ సీవీ ఆనంద్. కొంతమంది సాఫ్ట్ వేర్ ఇంజనీర్ లను కూడా అరెస్టు చేశామన్నారు. సాఫ్ట్ వేర్ కంపెనీలో కీలక పోస్టులలో వున్న కొంతమందిని పట్టుకున్నాం. మూడుకేసులలో 11 మంది అరెస్ట్ చేశాం. 4.50 లక్షల రూపాయలు విలువ చేసే డ్రగ్స్, లాప్ టాప్ మొబైల్ ఫోన్లు సీజ్ చేసాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లో ఏడుగురు అరెస్ట్ కాగా, ఒకరు పరారీలో ఉన్నారు. నార్కోటిక్స్ ఎన్ఫోర్స్ మెంట్ వింగ్ ఏర్పాటు చేసిన తర్వాత పెద్ద ఎత్తున డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠా అరెస్ట్ చేశాం అని సీపీ చెప్పారు.

సాప్ట్ వేర్ ఉద్యోగులే ఎక్కువ మంది ఈ డ్రగ్స్ కేసులో వున్నారు. 11 మంది సాప్ట్ వేర్ ఉద్యోగుల ప్రమేయం వుంది. స్టూడెంట్స్ ను అరెస్ట్ చెయ్యాలా లేదా కౌన్సిలింగ్ ఇవ్వాలా అర్థం కాలేదు. చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అందుకే వీళ్ళని అరెస్ట్ చేసాం. టోనీ కేసులో మెయిన్ నిందితుడిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసాం. మొన్న వ్యాపార వేత్తల అరెస్ట్ వల్ల కొంత మార్పు వచ్చింది. సాఫ్ట్ వేర్‌ ఉద్యోగులలో సైతం ఇప్పుడు మార్పు వస్తుందని ఆశిస్తున్నాం. కొరియర్ సంస్థలపై నిఘా ఉంటుంది. డ్రగ్స్ ని హైదరాబాద్‌ నుంచి తరిమి కొట్టేందుకు ఎన్సీబీ వాళ్ళతో కలిసి పనిచేస్తామన్నారు.

LEAVE A RESPONSE