-ఏపీ ఫిషర్మె న్ జేఏసీ చైర్మన్ సైకం రాజశేఖర్
కాకినాడ : ఈనెల ఫిబ్రవరి 17వ తారీఖున పాత్రికేయుల సమావేశంలో కాకినాడ సిటీ శాసనసభ్యులు చంద్రశేఖర్ రెడ్డి ఒక సందర్భంలో మాట్లాడుతూ “కొండబాబు కోటి రూపాయలు పెట్టి గుడి కడితే పది కోట్లు వసూలు చేసుకునే జాతి నీది” అని మత్యకార జాతిని అవమానపరిచి, అవహేళనగా మాట్లాడిన ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు కొంకనాడ కాస్మోపోలిటన్ క్లబ్ లో పాత్రికేయుల సమావేశం జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగినది.
ఈ సమావేశంలో మాజీ మంత్రివర్యులు పెద్దలు మల్లాడి కృష్ణారావు గారు మాట్లాడుతూ చంద్రశేఖర్ రెడ్డి గారు మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలనీ, తక్షణమే మత్స్యకార జాతికి క్షమాపణలు చెప్పని ఎడల కార్యచరణ ప్రకటిస్తామని మాట్లాడారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ రాజశేఖర్ మాట్లాడుతూ రాజకీయ ఆరోపణలు హద్దు దాటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మత్స్యకారులను జాతి పేరుతో అవమానించడం ఆక్షేపనీయం. మత్స్యకార ఓట్లతో గద్దెనెక్కిన ద్వారంపూడి జాతిని దూషించే హక్కు ఆయనకు ఎవరిచ్చారు అని ప్రశ్నించారు.
ఈ విషయమై ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు ఏపీ ఫిషర్ మెన్ జేఏసీ ఆందోళనలను చేపడుతున్నప్పటికీ చంద్రశేఖర్ రెడ్డి తన మొండి వైఖరి విడనాడటం లేదని, ఇది సరైనది కాదని హెచ్చరించినారు. వారు రోజు లోపల మత్స్యకార జాతికి చంద్రశేఖర్ రెడ్డి గారు బేషరుతుగా క్షమాపణ చెప్పకపోతే భవిష్యత్ కార్యక్రమం ప్రకటించి, ఆందోళన కార్యక్రమాలు ఉదృతం చేస్తామని, 2024 ఎన్నికల్లో చంద్రశేఖర్ రెడ్డిని ఓడించడమే లక్ష్యంగా కార్యచరణ రూపొందిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో పూర్వ శాసనమండలి సభ్యురాలు బలిసాడి ఇందిరా గారు, భారతీయ జనతా పార్టీ మత్స్య విభాగ రాష్ట్ర అధ్యక్షులు బొమ్మిడి గణేష్, కొల్లేరు పరిరక్షణ మత్స్యకార నాయకురాలు ఘంటసాల వెంకటలక్ష్మి గారు, అగ్నికుల క్షత్రియ సంఘ రాష్ట్ర అధ్యక్షులు బర్రి ప్రసాద్ గారు, జెఎసి రాష్ట్ర నాయకులు నాయుడు గోపాల్ గారు, మల్లాడి రాజు, అగ్నికుల క్షత్రియ నాయకులు ఒడుగు శ్రీకాంత్ , కొల్లాటి బాబురావు, వైదాడి నూకరాజు, బొడ్డు సత్యనారాయణ తదితర సాంప్రదాయ మత్స్యకార నాయకులు పాల్గొన్నారు