Suryaa.co.in

Features

కరోనా మూలంగా అటకెక్కిన పేద పిల్లల చదువు

ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న కరోనా మహమ్మారి మూలంగా ఎన్నో ఆర్థిక ఒడిదుడుకులు ఆటుపోట్లను చవిచూసిన జనావళికి, పిల్లల చదువు ప్రశ్నార్థకంగా మారింది. డబ్బున్న బడా బాబుల పిల్లలు ఆన్లైన్ విద్యతో తరగతులను ప్రమోట్ అవుతూ ముందుకు వెళుతుంటే, నేటికి సిగ్నల్ లేని గ్రామాల్లో ఆన్లైన్ విద్య పేద విద్యార్థుల పాలిట శాపంగా మారింది.

బాలల చదువు భవిష్యత్తుకు బంగారు బాట పడుతుందని ఆశించిన తల్లిదండ్రులకు, వారితోపాటే పిల్లలు రోజు వారి కూలీ కి వెళుతూ విద్యకు దూరం అవుతూ, బాల కార్మికులుగా మారే పరిస్థితి దాపురిస్తున్నది.ప్రభుత్వాలు తమ అధికారిక కార్యక్రమాలు, ఎన్నికలపై పెడుతున్న శ్రద్ధ.. విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించిన విద్యపై తాత్సరాలు చేస్తున్నది.

సినిమా థియేటర్లు నిబంధనలు పెట్టి ప్రారంభించాలి అంటూ సమావేశాలు పెడుతున్న ప్రభుత్వాలు, విద్యార్థుల భవిష్యత్తుపై మాత్రం ఆలోచించడం లేదు. కరోనా నిబంధనలు పాటిస్తూ విద్యార్థులకు ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలలను విద్యాలయాలను ప్రారంభించాలి. లేదా ఆన్లైన్ కు సంబంధించిన అవసరమగు వాటిని అందించి, వారి ఉన్నత విద్యకు బాటలు వేయాలి.

లేకుంటే నేటి బాలలే రేపటి పౌరులంటూ… నినదించిన గొప్ప గొప్ప మేధావుల ఆశయం నీరుగారి, నేటి బాలలే రేపటి కార్మికులు..అనే పరిస్థితి వచ్చే ప్రమాదాన్ని తొలగించి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించాలని ఆశిద్దాం.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
ఓసి సంఘం
జాతీయ అధ్యక్షుడు 9666606695

LEAVE A RESPONSE