-ధర్నాకు దిగిన వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులు
విజయవాడ రాష్ట్ర ప్రభుత్వం వాణిజ్య పన్నుల శాఖలో చేపట్టిన పునర్వ్యవస్థీకరణకు ప్రక్రియను ఉద్యోగులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఉద్యోగుల అధికారాలను హైజాక్ చేసేందుకు కొంతమంది ఉన్నతాధికారులు ఈ ప్రక్రియకు రూపకల్పన చేసి ప్రభుత్వాన్ని తప్పుదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో ఆదాయం వనరులు పెరుగుదల కంటే నష్టం ఎక్కువ జరుగుతుందని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఈ ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతూ వాణిజ్య పన్నుల శాఖ సర్వీసెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత రెండు రోజులుగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా గురువారం నగరంలోని వాణిజ్య పన్నుల శాఖ 1,2డివిజన్ కార్యాలయాలు ముందు ఉద్యోగులు భోజన విరామ సమయంలో పెద్ద ఎత్తున నిరసనలు తెలిపారు.పునర్వవస్థీకరణకు వ్యతిరేకంగా ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా 1,2డివిజన్ గిరి శాస్త్రి, నాగరాజు మాట్లాడుతూ అధ్యక్షులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదాయవనరులు పెంపు కోసం పునర్వ్యవస్థీకరణ విధానాలలో మార్పులు తీసుకురావాలని కోరారు. కొంతమంది స్వప్రయోజనాల కోసం కాకుండా పూర్తి స్థాయిలో పరిశీలన జరగాలని సూచించారు. ఉద్యోగుల అధికారాలకు ఎటువంటి భంగం కలగకుండా నిర్ణయాలు చేయాలని అన్నారు. దీంతో బదిలీలు వ్యవహారం కూడా గందరగోళంగా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శులు దుర్గా ప్రసాద్, శ్రీనివాసరావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు మెహర్ కుమార్, ప్రసాద్ బాబు,వంశీధర్, నాగేంద్రరావు తదితర నాయకులతో పాటు ఉద్యోగులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.