– అదిపోయే….ఇదివచ్చే…..
పండగ అడ్వాన్సుల కాలం చెల్లి పోయే..
ELS ఎన్కేషమెంట్ రోజులు వెళ్లి పోయే…
DA అరియర్స్ తీసుకున్న విషయాలు ముచ్చట్లు గా మిగిలి పోయే..
PRC ఊహలు పేకమేడల్లా కూలి పోయే…
పెన్షన్ బెనిఫిట్స్ పొందే పసందైన రోజులు మరలి పోయే..
ఖాతాల్లోని PF డబ్బులు తరలి పోయే..
ఇన్సూరెన్స్ డబ్బులు ఇంటికెళ్లి పోయే..
సీపీస్ రద్దు అనే వారం ఇంకా రాక పోయే..
అన్నీ పోయే.పోయే.పోయే.
మరి కొత్తగా వచ్చిందేమిటి?
నెల జీతాలు కు ఎదురుచూసే రోజులు వచ్చే..
జీతం ఖాతాలో పడితే అబ్బురపడి ఆనందపడే ఘడియలు వచ్చే…
ఏమి ఇచ్చినా ఎంత వచ్చినా మహాప్రసాదంగా భావించే దుస్థితి వచ్చే..
పనిచేసి పొందే జీతాలే పండుగ కానుకలుగా ఫీలయ్యే పరిస్థితి వచ్చే..
రెండు సంవత్సరాలుకు సరిపడా పండగకానుకలు ఇచ్చే జీవోల కాలం వచ్చే..
30 నెలలకొకసారి పలకరించే కరువుభత్యం కాన వచ్చే…
పెన్షన్ బాండ్స్ తో బ్యాండ్స్ వాయించుకునే రోజులు రానే వచ్చే..
అదిపోయే….ఇదివచ్చే…..
– సగటు ఉద్యోగి ఆవేదన
(పి.నాగరాజ)