అందమైన కవితలలో
కదిలే కల్పనలు
మధురమైన భావనలుగా
ఊరిస్తుంంటే….
అందమైన మాటల్లో
మెదిలే ఊహలు
తీయనైన వేదనలుగా
ఎదురువస్తుంటే…
అందమైన జ్ఞాపకాలలో
దోబూచులాడే కలలు
తీరని తపనలుగా
మారుతుంటే…
అవ్యక్త మాధుర్యముల
తీపి చెమరింతల నడుమ
“అంతులేని ఆరాధానంతా”
నీకే అంకితం
జన్మజన్మలకు
నేను నీకే సొంతం…!!
నలిగల రాధికా రత్న