– రూ.10కోట్లు చెల్లించలేని ప్రభుత్వదుస్థితితో 7నెలలుగా సీమగ్రామాలకు తాగునీరు నిలిచిపోయింది.
– పేదలకు గుక్కెడు నీరు, రైతులకు సాగునీరుఇవ్వలేని ప్రభుత్వం పేదలు, రైతులప్రభుత్వమా?
– మాజీ ఎమ్మెల్యే కే.ఈరన్న
అనంతపురం జిల్లాసహా, రాయలసీమలో ప్రజలకు అందుబాటులో ఉన్న సత్యసాయి తాగునీటి పథకంపై నీలినీడలు అని పత్రికల్లో కథనాలు వచ్చాయని, ఆ పథకంద్వారా దాదాపు 600గ్రామాలకు తాగునీరు సరఫరాఅవుతోందని, 1998లో ఆ పథకం ప్రారంభమైం దని టీడీపీసీనియర్ నేత, మాజీఎమ్మెల్యే కే.ఈరన్న తెలిపారు.గురువారం ఆయన మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
ప్రజల దాహార్తి తీర్చేపథకాన్ని నిరుపయోగంగామార్చిన ఘనత, ఈ పథకానికి గ్రహణంలా పట్టిన ఖ్యాతి జగన్ ప్రభుత్వానిదే. సదరుపథకంలో పనిచేసే దాదాపు 572 మందికార్మికులకు 7నెలలనుంచీ జీతాలు లేకుండా పోయాయి. 7 నెలల కాలానికి వారికి దాదాపు రూ.10కోట్లవరకు జీతం అందాల్సి ఉంది. ఆ మాత్రం సొమ్ముకూడాఇవ్వకుండా ఈప్రభుత్వం అటుప్రజల గొంతెండేలాచేయడమే కాకుండా, పథకాన్ని నిర్వహిస్తున్న కార్మికులను రోడ్డునపడేయడం దారుణం. తాగునీటి పథకం నిర్వహణకు ప్రభుత్వం రెండుసార్లు టెండర్లు పిలిచినా ఉపయోగంలేకుండా పోయింది. రెండుసార్లు టెండర్లు పిలిచిన ప్రభుత్వం అర్హులైనవారు బిడ్లువేయలేదంటూ వాటినిరద్దు చేసింది.
అర్హత ఉన్నవారికే టెండర్లు ఇస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వ నిర్ల క్ష్యం, అధికారుల అలక్ష్యం వెరసి ప్రజలు గుక్కెడునీరులేక నానా అవస్థలు పడుతున్నారు. పేదప్రజలకు గుక్కెడు తాగునీరు అందించలేని ఈ ప్రభుత్వం, పేదలప్రభుత్వమని చెప్పుకోవ డం సిగ్గుచేటు. రాయలసీమలో అనంతపురం
జిల్లా తీవ్రమైన వర్షాభావాన్ని ఎదుర్కొంటోంది . దేశంలోనే అతితక్కువ వర్షపాతం నమోదవుతున్న జిల్లాగా అనంతపురానికి పేరుంది. అలాంటి జిల్లాను సస్యశ్యామలం చేయడంకోసం, సీమవాసుల దాహార్తి తీర్చడంకోసం టీడీపీ ప్రభుత్వంలో ఆనాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుగారు నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టారు.
ఆ క్రమంలోనే గోదావరి జలాలను కృష్ణానదికి, అక్కడినుంచి రాయలసీమకు వచ్చేలా చేశారు. తనపట్టుదల, అకుంటితదీక్షతో రాష్ట్రానికి అసలైన అపరభగీరథుడిగా చంద్రబాబుగారు పేరుప్రఖ్యాతులు పొందారు. చంద్రబాబునాయుడి దయతో రాయలసీమలో జలకళపెరిగింది. బోర్లలో నీళ్లు పైకి వచ్చాయి. దానివల్ల విపరీతంగా సాగువిస్తీర్ణంపెరిగి, కంది, మొక్కజొన్న, వేరుశనగ, అరటి, బొప్పాయి, చీని, నిమ్మ వంటి పంటలసాగు ఊపందుకుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పంటలు ఎండిపోతున్నా, పైర్లకు తెగుళ్లు, చీడపీడలు సోకినా ప్రభుత్వయంత్రాంగం స్పందించే స్థితిలో లేదు.
రైతుల ప్రభుత్వం అని చెప్పుకుంటున్న జగన్ ప్రభుత్వంలో అన్నదాతలకంట నిత్యం కన్నీరే వస్తోంది. 2020లో పంటనష్టంజరిగినా రైతులకు సకాలంలో అందాల్సిన పంటలబీమా, ఇన్ పుట్ సబ్సిడీల సొమ్ము ఇంతవరకు అందలేదు. రైతులు నెత్తీనోరు కొట్టుకుంటున్నాకూడా ప్రభుత్వం మూర్ఖత్వంతో వ్యవహరిస్తోంది తప్ప, వారిగోడు పట్టించుకోవడం లేదు. రైతులతో పాటు, మహిళలు, విద్యార్థులు, యువత జగన్మోహన్ రెడ్డిని నమ్మి మోసపోయామని, ముఖ్యమంత్రి దోపీడీ, లూఠీతో రాష్ట్రం 20ఏళ్లు వెనక్కు వెళ్లిందని వాపోతున్నారు. ఎన్నికలు ఎప్పుడు వస్తాయా… తిరిగి చంద్రబాబుగారిని ఎప్పుడు ముఖ్యమంత్రిని చేద్దామా అని అన్ని వర్గాలప్రజలు వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు.