ఆర్‌ఎస్‌ఎస్ స్థాపన..భారత చరిత్రలో ఓ అద్భుతం!

ఇరవయ్యో శతాబ్దంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ( ఆర్‌ఎస్‌ఎస్) స్థాపన, నిరంతర పెరుగుదల, ఒక వజ్రం వలే ప్రకాశించడం భారత దేశ చరిత్రలో ఒక అద్భుతం అని చెప్పవచ్చు. భారత దేశంలోనే కాకుండా విదేశాలలో కూడా సంఘ్ ప్రభావం చాలా విస్తృతంగా వ్యాపించింది.
సంఘ-ప్రేరేపిత సంస్థలు, ఉద్యమాలు నేడు సామాజిక, సాంస్కృతిక, విద్యా, కార్మిక, అభివృద్ధి, రాజకీయ, ఇతర జాతీయవాద ప్రయత్నాలలో బలమైన ఉనికిని కలిగి ఉన్నాయి. అవి సామజిక సంస్కరణ ఉద్యమాలు కావచ్చు లేదా వేర్పాటువాద వ్యతిరేక ఆందోళనలు కావచ్చు సామాన్య సమూహాల నుండి వివిధ రంగాలలోఉన్న అత్యధిక ప్రజల నుండి విశేషమైన స్పందనను, ఆమోదాన్ని రేకెక్తిస్తున్నాయి.
సంఘ్ కేవలం ఒకటి లేదా మరొక సామజిక లేదా రాజకీయ సమస్యలకు ప్రతిచర్యగా కాకుండా, నిజమైన జాతీయవాదం, ఈ దేశపు పురాతన సంప్రదాయాలలో ధృడంగా పాతుకుపోయిన ఆలోచనల పరంపరకు వారధిగా గుర్తింపు పొందుతున్నది. మరే ఇతర ఉద్యమం లేదా సంస్థ ఇంత పెద్ద సంఖ్యలో అనుచరులను ఆకర్షించడంలేదు. అనేక వేలమంది సామాజిక కార్యాన్ని తమ జీవిత ధ్యేయంగా చేసుకొని పనిచేస్తున్నారు. వారి స్వభావం, చిత్తశుద్ధిని వారి అత్యంత తీవ్రమైన విమర్శకులు సహితం అనుమానించడం లేదు. జాతీయ పునర్నిర్మాణం కోసం ప్రజలను సమాయత్తం చేసే ఒక మహోద్యమంగా గుర్తింపు పొందింది. భారత దేశంలో గాని లేదా ప్రపంచంలో మరెక్కడా గాని సంఘ్ ను పోలిన మరో సంస్థ, ఉద్యమం లేదని చెప్పవచ్చు. విదేశీ పాలకులు శతాబ్దాలుగా మన మానసిక, సాంస్కృతిక,ఆర్ధిక రంగాలపై దాడులు జరుపుతున్న సమయంలో పుట్టుకొచ్చిన సంఘ్ భారత జాతీయ గుర్తింపు కోసం ఒక వళమైన ఉద్యమమగా ప్రాముఖ్యతను సంతరింప చేసుకొంది.
జాతీయ పునర్నిర్మాణం జాతీయ స్వభావాన్ని పెంపొందించడం, మాతృభూమిపై రాజీలేని భక్తి, క్రమశిక్షణ, స్వీయ నిగ్రహం, ధైర్యం, వీరత్వాన్ని కోరుతుంది. ఈ గొప్ప ప్రేరణలను పెంపొందించడం దేశం ముందు అత్యంత సవాలుతో కూడుకున్న పని. దీనినే స్వామి వివేకానంద క్లుప్తంగా “మానవనిర్మాణం” అని పిలిచారు. ఈ చారిత్రాత్మక లక్ష్యం కోసం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించింది.

సంఘ్: ఒక క్రియాశీల పవర్-హౌస్

92 సంవత్సరాల క్రితం మహారాష్ట్రలోని నాగపూర్ ఒక మూల ఒక చిన్న ప్రవాహం వలే మొదలైన ఈ ఉద్యమం ఇప్పుడు దేశంలోని మారుమూల గ్రామాలను చుట్టుముట్టే ఒక శక్తివంతమైన నదిగా ప్రవహిస్తున్నది. సంఘ శాఖల సంఖ్య 57,000 దాటింది. సంఘ స్థాపకులు, `డాక్టర్జీ’ పిలువబడే డాక్టర్ కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ (1889-1940) దూరదృష్టికి ఈ కార్యవ్యాప్తి నిదర్శనంగా మిగులుతుంది.
హిందూ సమాజం పునాదులను బలోపేతం చేయడం ద్వారా సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక, మతపరమైన, తాత్విక, రాజకీయ సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధం కావాల్సిన అవసరాన్ని ఆయన గ్రహించారు. మహర్షి దయానంద, స్వామి వివేకానంద, మహర్షి అరబిందో, తిలక్ వంటి అనేకమంది మహనీయులు ఆధునిక కాలంలో జాతీయ పునరుజ్జీవనంకు బీజాలు వేశారు.
ఆ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లడానికి తగినంత బలమైన సాధన అవసరమని గ్రహించిన డా. హెడ్గేవార్ చేత రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ రూపంలో ఈ మహా ఉద్యమాన్ని 27 సెప్టెంబర్, 1925 విజయదశమి రోజున నాగపూర్‌లో ప్రారంభించారు.
సంఘటన కార్యంలో ఎదురయ్యే ప్రమాదాలలో ఒకటి తక్షణ దృష్టితో విషయాలను చూస్తుంటే అంతిమ లక్ష్యం పట్ల అవగాహన తగ్గిపోతుంది. అందుకనే డాక్టర్జీ తక్షణ అంశాలను దృష్టిలో ఉంచుకొని తాను నిర్ధేశించిన అంతిమ లక్ష్యం పట్ల ఆకాంక్ష బలహీనం కాకుండా జాగ్రత్త పడ్డారు. మొదటినుండి కూడా దేశ స్వతంత్రం పట్ల స్ఫూర్తిని కలిగిస్తూనే మన దేశపు సాంస్కృతిక మూలాలను బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. నేటికీ కూడా ఆ లక్ష్యమే ప్రామాణికతగా నిలిచింది.
లౌకికవాదం, ఆర్థిక, నైతిక దివాలా, ఆర్ధిక బలం ఉపయోగించి హిందువులను మత మార్పిడికి ప్రోత్సహించడం, పెరుగుతున్న వేర్పాటువాద ధోరణులు, మన మూలలను దూరంగా ప్రజల ఆలోచనా ధోరణులు, విద్యావిధానం, ప్రభుత్వాలే హిందూ- హిందుత్వ పేరుతో ఏమున్నా అవమానపరిచే విధంగా వ్యవహరిస్తూ ఉండడంతో దేశ సమగ్రత క్షీణించడం జరుగుతున్నది.
ఈ ప్రబలమైన ధోరణులు డాక్టర్ హెడ్గేవార్ ఊహించిన సంఘ తాత్విక పునాది దృఢత్వంను స్పష్టం చేస్తున్నాయి. హిందూ సమాజం మనుగడ, మొత్తం దేశ సమగ్రతల పరిరక్షణకు నాటి ఆలోచనలే మార్గంగా నిలుస్తున్నాయి. భారత దేశపు రాజకీయాలలోని తప్పుడు ధోరణులన్నీ చూపే విపరీత పరిణామాల పట్ల కేవలం సంఘ్ మాత్రమే నిరంతరం జాతిని అప్రమత్తం చేస్తూ వస్తున్నది.
“బ్రిటిష్ వారు దేశం విడిచి వెళ్లినా, హిందువులు బలమైన జాతిగా సంఘటితం కానీ పక్షంలో మనం మన స్వాతంత్య్రంను నిలబెట్టుకుంటామని హామీ ఏమిటి?” అని డాక్టర్జీ తరచూ అంటుండేవారు. స్వాతంత్య్రంతో పాటుగా, పంజాబ్, బెంగాల్, సింధ్ లలోని కొన్ని ప్రాంతాలకు, ఫ్రాంటియర్ ప్రాంతం భారత్ నుండి వేరుపడడంతో ఆయన ఆందోళనలు వాస్తవం అయ్యాయి.
దేశం స్వాతంత్య్రం పొందిన ఏడు దశాబ్దాలకు కూడా కాశ్మీర్ కల్లోలంగా మిగిలిపోయింది. అస్సాంను ముస్లిం మెజారిటీ ప్రాంతంగా మార్చడానికి నిరంతర ప్రయత్నాలు జరుగుతున్నాయి. క్రైస్తవ మిషన్ల ద్వారా మతమార్పిడి కోసం ఎటువంటి అడ్డంకులు లేని ప్రయత్నాలు నిరాటంకంగా కొనసాగుతున్నాయి. స్వతంత్ర క్రైస్తవ ప్రాంతాల ఏర్పాటుకు సాయుధ తిరుగుబాట్లు కూడా జరుగుతున్నాయి. (ఉదా., నాగాలాండ్‌లో).
తమ కార్యకలాపాల కోసం భారత దేశాన్ని బలహీన పరచాలని చూస్తున్న పలు శక్తులు విదేశాలకు, విదేశీ ఏజెన్సీల నుండి మద్దతు, అపరిమిత నిధులను స్వీకరిస్తున్నారు. రాజకీయ ప్రేరేపితమైంది సరైన నిర్వచనం లేని లౌకికవాదం, వేర్పాటు వాదములకు వ్యతిరేకింగా నిజమైన దేశభక్తి ఆందోళనలకు సంఘ్ మాత్రమే ఒంటరిగా అండగా నిలబడుతున్నది.
ప్రారంభంలోనే, సంఘ్ ను వ్యవస్థాపకులైన డాక్టర్జీ మరో ప్రత్యేక కార్యక్రమంగా లేదా ఉద్యమమగా కాకుండా జాతీయ కార్యకలాపాలలో ప్రతి రంగానికి శక్తినిచ్చే డైనమిక్ పవర్-హౌస్‌గా తీర్చిదిద్దే ప్రయత్నం చేపట్టారు. డాక్టర్ హెడ్గేవార్ సంఘ్ బలోపేతం, అభివృద్ధికి బలమైన పునాది వేయడానికి రేయింబవళ్లు శ్రమించారు. 15 సంవత్సరాలపాటు శ్రమించి అద్భుతమైన ఉద్యమమగా తీర్చిదిద్దారు. విశ్రాంతిలేని కృషి చేయడంతో ఆయన ఆరోగ్యం క్షీణించి, చిన్న వయస్సులోనే 51 ఏళ్లలో 21 జూన్ 1940 పరమపదించారు.

గురూజీ సారధ్యంలో దేశ వ్యాప్తం

1940 నుండి, సంస్థను రెండవ సర్ సంఘచాలక్‌గా శ్రీ గురూజీ (మాధవ్ సదాశివ గోల్వాల్కర్, 19.2.1906 – 5.6.1973) అలసట ఎరుగని రీతిలో దేశ వ్యాప్త పర్యటనలు జరుపుతూ దేశ వ్యాప్తంగా విస్తరింప చేశారు.అసోం, కేరళ వంటి సుదూర ప్రాంతాల వరకు కూడా సంఘ్ వేగంగా అభివృద్ధి చెందేలా చేశారు.
మహారాష్ట్రలోని నాగపూర్, విదర్భ, పరిసరాల్లో, లాహోర్, ఢిల్లీ, వారణాసి, కలకత్తా, మద్రాస్ వంటి కొన్ని సుదూర ప్రాంతాలలో గతంలో కొన్ని శాఖలు మాత్రమే ఉన్న సంఘ్ ఆయన స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంతో దూరప్రాంతాలలో విస్తరించడం ప్రారంభించింది.
మహారాష్ట్రలోని నాగపూర్, విదర్భ, పరిసరాల్లో, లాహోర్, ఢిల్లీ, వారణాసి, కలకత్తా, మద్రాస్ వంటి కొన్ని సుదూర ప్రాంతాలలో గతంలో కొన్ని శాఖలు మాత్రమే ఉండెడివి. శ్రీ గురూజీ స్ఫూర్తిదాయక వ్యక్తిత్వంతో దూరప్రాంతాలలో విస్తరించడం ప్రారంభించింది.
శ్రీ గురూజీ, తన గొప్ప మేధాసంపత్తితో చారిత్రక, సామాజిక నేపథ్యాన్ని, హిందూ రాష్ట్ర భావన తార్కికతను సమర్ధవంతంగా ప్రతిపాదించారు, ఇది అప్పటివరకు కేవలం అనుభావిక ఆలోచనగా మాత్రమే ఉండెడిది. ఆయన సంఘ్ సైద్ధాంతిక ప్రాతిపదికను విస్తరించారు. సాధారణ గ్రామీణుడు, పట్టణ మేధావికి కూడా అర్థమయ్యేలా చేశారు.
తన స్వంత మాట మరియు కార్యం ద్వారా ఒక గంట శాఖ టెక్నిక్‌పై రాజీలేని ఒత్తిడితో, అతను ప్రతి నిమిషం వివరంగా సంఘ పద్దతిని కూడా పరిపూర్ణం చేసాడు, తద్వారా సరైన సంస్కారాల ద్వారా, ఒక ఆదర్శవంతమైన పరికరం. సంఘ భావజాలం మరియు సంస్థాగత నైపుణ్యం కలిగిన మరింత మంది సహోద్యోగులు అతని ఆశీస్సులతో సిద్ధమయ్యారు.
సంఘ్ భావజాలం, సంస్థాగత నైపుణ్యంతో సుక్షితులైన అనేకమంది జీవిత కార్యంగా చేపట్టడం ప్రారంభం కావడంతో ఎప్పటికప్పుడు అవసరాన్ని బట్టి వివిధ రంగాలలో సంఘ్ ప్రేరేపిత సంస్థలు, ఉద్యమాలు ప్రారంభం అవుతూ వచ్చాయి. ఉదాహరణకు ఎబివిపి, బిఎంఎస్, జనసంఘ్, కిసాన్ సంఘ్, కల్యాణ ఆశ్రమం, బిజెపి వంటివి. నేడు ఆయా సంస్థలు ఆయా రంగాలలో అతిపెద్ద,శక్తివంతమైనవిగా పనిచేస్తున్నాయి.
భారత దేశంలోనే కాకుండా నేడు ప్రపంచంలోని పరిణామాలు సహితం రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ తాత్విక పునాది ప్రామాణికతను తిరిగి నిర్ధారిస్తున్నాయి. రాబోయే లేదా 21వ శతాబ్దం హిందుత్వ ఆధిపత్యంలో ఉన్న శతాబ్దం అని ప్రముఖ చరిత్రకారులతో సహా అనేక వర్గాల నుండి నేడు వినిపిస్తున్నది.

( ‘నిజంటుడే డాట్‌కామ్’ సౌజన్యంతో )