-కేసీఆర్ అంటే ఒక నమ్మకం.. కేసీఆర్ అంటే ఒక గురి
– గజ్వేల్ నియోజకవర్గం వర్గల్ రోడ్ షోలో మంత్రి హరీశ్ రావు
నాడు ఇక్కడ చుక్క నీళ్ళు లేని పరిస్థితి. ఇప్పుడు ఎండాకాలం కూడా చూడకుండా మంచినీళ్లు ఇచ్చింది కేసీఆర్.60 ఏళ్ల పాటు ఎంతోమంది మారారు కానీ మంచినీళ్ల సమస్య తీర్చిదిద్ది కేసీఆర్ మాత్రమే. రూ. 2000 రూపాయల పింఛన్ ఇచ్చి ముసలవ్వలను, తాతలను ఆదుకుంటున్నది మన కేసీఆర్.200 రూపాయల పింఛన్ 2000 చేసి బుక్కెడు అన్నం పెట్టింది కేసీఆర్.
బీడీ కార్మికులు, నేత కార్మికులు, ఒంటరి మహిళలు.. ధైర్యంగా బతుకుతున్నారు అంటే కేసీఆర్ వల్లే. ఈసారి కారుని గెలిపిస్తే 5000 పింఛన్ చేస్తా అని కేసీఆర్ మేనిఫెస్టోలో పెట్టారు. కేసీఆర్ అంటే ఒక నమ్మకం కేసీఆర్ అంటే ఒక గురి. చావు నోట్లో తలపెట్టి రాష్ట్రాన్ని సాధించింది కేసీఆర్. కల్యాణ లక్ష్మి, కెసిఆర్ కిట్టు, న్యూట్రిషన్ కిట్టు ఇవన్నీ ఇచ్చింది కేసీఆర్నాడు నేను రాను బిడ్డ సర్కార్ దవాఖానా అని అంటే నేడు సర్కారు దవాఖానకే పోదాం పద బిడ్డ అనే రోజులు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ వ్యవసాయాన్ని దండగ అంటే, కెసిఆర్ వ్యవసాయాన్ని పండగగా మార్చారు. కూరగాయలు పండించి హైదరాబాద్ కు వచ్చే మీ అందరికీ నాటి కరెంట్ కష్టాలు తెలుసు. కర్ణాటకలో రైతుల పరిస్థితి పెనం నుంచి పొయ్యి మీద పడ్డట్టు అయింది.కాంగ్రెస్ ను ఎందుకు గెలిపించాము అని లబో దిబో అంటున్నారు. కరెంటు సమస్య వస్తే 24 గంటల్లో కొత్త కరెంటు ట్రాన్స్ఫారం ఏర్పాటు చేస్తున్నాం.
కాలేశ్వరం నీళ్లు తెచ్చి బంధం చెరువును నిండుకుండేలా మార్చింది కేసీఆర్రెం.డున్నర కోట్లతో కొత్తచెరువును మంచిగ చేసినం. ఎండాకాలం కూడా హల్దీ వాగులో నీళ్లు తెచ్చి చూపించింది కేసీఆర్. శివుడి నెత్తి మీద గంగమ్మ లెక్క, వర్గల్ నెత్తిన కొండ పోచమ్మను కట్టిండు కేసీఆర్. ఉప్పు నీళ్ళ గజ్వేల్ ను గోదావరి నీళ్ళు ఉప్పొంగే గజ్వేల్ చేశారు. నీళ్ళు మోసి భుజాలు వంకర పోయిన పరిస్థితి.
సైకిల్ పోయి చెయ్యి వచ్చింది, చెయ్యి పోయి సైకిల్ వచ్చింది ఏమైనా అభివ్రుది జరిగిందా? దేవుడు కూడా మొక్కితే అన్ని ఇవ్వడు, అలాగే కేసీఆర్ కూడా దాదాపు అన్ని చేశారు.ఇంకా చేసుకుందాం. గజ్వేల్ అభివ్రుది జరగాలంటే కారు గెలవాలి. నాడు అతుకుల గజ్వేల్, నేడు బతుకుల గజ్వేల్. కాంగ్రెస్ వాళ్లది సుతి లేని సంసారం. ఎవరికి వాడే సీఎంలు.తన్నుకునెందుకే కాంగ్రెస్ వాళ్లకు సరిపోతుంది. బిజెపి వాడు మోపైండు.. చుట్టరికం కలుపుతున్నడు.కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళిండు?
బిజెపి వాడు ఒక్క పని చేసిండా.. ఒక్కటి చేసిండు 400 సిలిండర్ 1000 చేసిండు.మన ప్రభుత్వం మళ్ళా రాగానే 400 లకు సిలిండర్, రేషన్ పై సన్నబియ్యం, 16000 రైతు బంధు, 15 లక్షలకు ఆరోగ్య శ్రీ, కోటి కుటుంబాలకు 5 లక్షల బీమా ఇవ్వబోతున్నాము.జనవరిలో అసైన్డ్ భూములు పట్టా భూములు చేసుకోబోతున్నాం. ఒక్క గుంటా ఎవరు తీసుకోరు. ఉన్న భూములకు మిమ్మల్ని హక్కు దారులను చేస్తాం.నిజం నిలకడ మీద తెలుస్తుంది. చెడుకు వ్యాప్తి ఎక్కువ ఉంటది. బిజెపి, కాంగ్రెస్ వాళ్లకు చేసింది చెప్పుకునే ముఖం లేదు. అందుకే అడ్డగోలుగా తప్పుడు ప్రచారం చేస్తున్నారు. కారు గుర్తుకు ఓటు వేసి, కేసీఆర్ని మంచి మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.