-దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా?
-సోనియమ్మ మాటంటే శిలాశాసనం
-టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి
నిజాం నిరంకుశ పాలనపై ఎక్కుపెట్టిన ఫిరంగి పరకాల.తెలంగాణ సిద్ధాంత కర్త జయశంకర్ సార్ పుట్టిన గడ్డ.అలాంటి ఈ గడ్డను ప్రత్యేక నిధులతో అభివృద్ధి చేసే బాధ్యత మాది.మచ్చలేని , అవినీతి మరక లేని నాయకుడు రేవూరి ప్రకాష్ రెడ్డి. కేసీఆర్ మతి తప్పి మాట్లాడుతుండో.. మందేసి మాట్లాడుతుండో తెలియదు. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపడుతుండు..
దొరల రాజ్యం కావాలా? ఇందిరమ్మ రాజ్యం కావాలా పరకాల ప్రజలు తేల్చుకోవాలి.ఆనాడు పేదలకు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.ఇల్లు కట్టుకునే ప్రతీ పేదవాడికి రూ.5లక్షలు ఉచితంగా ఇచ్చే రాజ్యం ఇందిరమ్మ రాజ్యం.వేలాది ఎకరాల దొరల భూములను సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చి పేదలకు పంచింది ఇందిరమ్మ రాజ్యం.ఈ ప్రాంతంలో అభివృద్ధి ఇందిరమ్మ రాజ్యంలోనే జరిగింది. ఇందిరమ్మ రాజ్యాన్ని తప్పుపట్టిన కేసీఆర్ ముక్కు నేలకురాసి క్షమాపణ చెప్పాలి.
సోనియమ్మ మాటంటే శిలాశాసనం. ఇచ్చిన మాట ప్రకారం తెలంగాణ ఇచినట్లే అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరుతాం.