Suryaa.co.in

Features

లడ్డులో కల్తీ నెయ్యి అని చెప్పేందుకు లడ్డు తిన్న ప్రతి భక్తుడు సాక్ష్యమే

శ్రీ వెంకటేశ్వర స్వామికి ఎంతో ప్రీతిపాత్రమైన ప్రసాదం లడ్డు. ఆ లడ్డును తిరుమల క్షేత్రంలో ఎంతో భక్తి శ్రద్ధలతో, ఎంతో పవిత్రతతో, శుచి శుభ్రతతో, శ్రీ వైష్ణవులు తయారుచేసి ముందుగా స్వామివారికి నైవేద్యంగా సమర్పించిన తర్వాత, భక్తులకు ప్రసాదంగా వితరణ చేస్తారు.

ఎప్పటినుండో, అనాదిగా ఆ లడ్డు ప్రసాదంలో పదార్థములు కలుపుతున్న బూందీ, ఆవునెయ్యి , జీడిపప్పు, యాలకులు, ద్రాక్ష, పచ్చ కర్పూరం లాంటివి కలపవలసిన పాళ్ళలో కలిపితేనే దాని రుచి, దాని పవిత్రత ఎంతో కాలం నుంచి ఉంటూ వచ్చింది. ఈ లడ్డు ఎంత ప్రసిద్ధి పొందిందో మన దేశంలోనే కాదు, ఇతర దేశాలకు కూడా తెలుసు. అది ఎవరి గొప్పో కాదు. ఆ స్వామి వారు ఈ భక్తులకిచ్చే పవిత్ర,అతి పవిత్రమైన ప్రసాదం.

కానీ ఈ ప్రజాస్వామ్య దేశంలో దురదృష్టం కొద్దీ.. రాజకీయాలకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధులతో సహా భాగమైపోయాయి కాబట్టి, ఇటువంటి నీచులు ఈ అపచారాలు చేస్తున్నారు. నిజంగా స్వామి మీద ఈ నీచులకు ఇసుమంత భక్తి ఉన్నా, ఈ దుష్టులు ఈ పని చేసి ఉండేవారు కాదు. కానీ పాపం చేసినవాడు ఏదో రకంగా ఆ పాపం బయటకు రావాలి. వాళ్లు శిక్షలు అనుభవించాలి. దానికి ఇదొక మార్గం అనుకోవాలి.

అసలు జగన్మోహన్ రెడ్డికి, వారి తండ్రిగారికి హిందూ ధర్మం మీద నమ్మకం లేక, తమ ఇష్టం వచ్చిన వారిని ఆ స్థాయి ఉద్యోగ అర్హతలు లేకపోయినా, తిరుమలలో ఈవోలు, జేఈవోలుగా ఇతర పదవులలో నియమించుకొని, తన ఇష్టం వచ్చినట్టుగా పరిపాలన చేశాడు.

అయితే ఇక్కడ ఒకటి గమనించాలి. స్వామివారికి అపచారం జరిగితే గతంలో రాజశేఖర్ రెడ్డి.. తిరుమల ఏడుకొండలు హిందువులకు కాదు. రెండు కొండలు మాత్రమే హిందువులకు. మిగతా ఐదు కొండలు అన్ని మతస్తులకు అని చెప్పి.. తన అధికారాన్ని ఉపయోగించి ఒక ప్రయత్నం మొదలుపెట్టాక, హిందూ సంఘాల ఆందోళనలతో వెనక్కి తగ్గారు. తర్వాత వారు ఏమైపోయారో ఈ దేశ ప్రజలకు తెలుసు.

అర్హత లేని, పాపాలు చేసిన ధర్మారెడ్డి గారు జే ఈ ఓ గా ఈవో గా బాధ్యతలు తీసుకొని, భక్తి పూర్వకంగా లేకుండా ఉద్యోగాలు చేస్తే, ఏమైందో వారి కుటుంబంలో వారికి తెలుసు దేశ ప్రజలందరికీ తెలుసు.

బ్రహ్మోత్సవాలకు సతీ సమేతంగా, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించే ఆచారం ఉన్నప్పటికీ.. దానిని తుంగలో తొక్కి ఒక్కడే వచ్చి, స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పరిస్థితి మనం మర్చిపోలేదు.

అధికారులు, ఆగమ శాస్త్ర పండితులు కూడా ఆయనకు చెప్పకపోవడం కూడా అపచారమే. హిందూ ధర్మం మీద విశ్వాసం లేకపోతే దేవాదాయ శాఖ మంత్రి గారిని సతీ సమేతంగా పట్టు వస్త్రాలు స్వామివారికి సమర్పించడం సాంప్రదాయం.

ఈ నెయ్యి బాగోతం బయటపడ్డాక, జగన్మోహన్ రెడ్డి పత్రికా విలేఖరుల సమావేశం సందర్భంలో చేసిన వ్యాఖ్యలు మరో తప్పిదం. వారి మాటలు ఎలా ఉన్నాయంటే.. జరిగిందేదో జరిగింది. దీనికి ప్రచారం కల్పించి భక్తుల మనోభావాలు దెబ్బతినేట్టుగా చంద్రబాబు నాయుడు వ్యవహారం చేస్తున్నారని మాట్లాడారు.

నెయ్యి ట్యాంకరు తిరుమల కొండపైకి వచ్చిన తర్వాత, మూడు చోట్ల వివిధ రకాలైన చెకింగ్ లు చేసి, మూడింటిలో నాణ్యత సరిపోయిందంటేనే అన్లోడ్ చేస్తారు. లేకుంటే వెనక్కి పంపించేస్తారని సత్య హరిశ్చంద్రుడు చెప్పినట్టుగా చెప్పాడు. ఆ విధంగా తను అధికారంలో ఉన్నప్పుడు 14 సార్లు జరిగిందని వెల్లడించారు.

ఇందులో వాస్తవం ఏంటంటే, తిరుమలకు సరఫరా చేస్తున్న ఆహార పదార్థాలలో నాణ్యత లేదని నిరుడు వెలుగులోకి వస్తే.. కేంద్ర హోం శాఖ నియమించిన నిపుణుల బృందం 2023 జూన్, జూలై నెలలో తిరుమలలోని పరిస్థితిని అధ్యయం చేసింది. ఆహార భద్రత చట్టం నిబంధనలను, సరఫరాదారులు పాటించేలా టీటీడీ చూడడం లేదని అది గుర్తించింది.

నాణ్యత పరీక్షలకు అవసరమైన పరికరాలు, అక్కడి ల్యాబ్ లో లేవని ఆ నిపుణుల బృందం గమనించింది. ఈ మేరకు ఒక నివేదికను కూడా రూపొందించింది. పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ, తనను ఎవరో చూడడం లేదనుకుంటుంది. మరి మీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు చేసిన నెయ్యి ఆర్డర్ AR డైరీ వారు, సప్లై చేస్తే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం దానిని పరీక్షకు దేశంలో ఉన్న అత్యుత్తమమైన గుజరాత్ లోని NDDB డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ల్యాబ్ లో (ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ) పరీక్ష జరిపి, 20% నాణ్యత మాత్రమే ఉన్నదని తేల్చిన తరువాత, ఈ జగన్మోహన్ రెడ్డికి మాట్లాడడానికి నోరు ఎలా వచ్చిందో వారే తెలపాలి.

జగన్ రెడ్డి బిజెపికి సగం తెలుసు. సగం తెలియదని కామెంట్ ను లోతుగా విశ్లేషిస్తే.. అయిపోయిన దానికి ఏమి చేయగలము ఎక్కువమంది హిందువులకు తెలిసి, వారి మనోభావాలు దెబ్బతినకుండా చంద్రబాబు నాయుడుని ఆపవచ్చు కదా! దానికి తగిన ప్రచారం కల్పించకుండా ఉంటే సరిపోతుంది కదా! అనే అభిప్రాయంతో ఉన్నట్లుగా అర్థమవుతుంది. ఈ రకమైన ప్రేలాపనలు ఆపండి మర్యాదగా ఉంటుంది. మీ పార్టీ లాగా బిజెపి ఏమి అలాటప్ప పార్టీ కాదు.

మన ఇండ్ల దగ్గర, మన గ్రామాలలో స్వచ్ఛమైన నెయ్యి ఎవరికి కావాల్సిన మోతాదులో వారు వాడుతుంటారు. ఆ నెయ్యి కేజీ 650 నుండి 700 రూపాయల వరకు అమ్ముతున్నారు. స్వామివారికి అప్పటివరకు కర్ణాటక డైరీ కి సంబంధించిన నందిని కంపెనీ ఆవు నెయ్యిని సప్లై చేస్తూ ఉండేది.

ఆ నెయ్యితో స్వామివారికి తీర్థ ప్రసాదాలు చేసి, స్వామివారికి నైవేద్యం పెట్టి భక్తులకు పంచుతుండేవారు. కానీ ప్రస్తుతం తమిళనాడుకు చెందిన ఏఆర్ డైరీ కేజీ నెయ్యి 320 రూపాయలకు, సప్లై చేస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. మరి ఇందులో కల్తీ లేక ఏముంటుంది? ఈ నెయ్యితో లడ్డు తయారుచేస్తే అది తిన్న ప్రతి భక్తుడికి అర్థమయిపోతుంది.

అనాదిగా ఈ కోట్లాదిమంది భక్తులు ఆ దేవదేవునికి మొక్కులు చెల్లించుకుని, బిడ్డ పుడితే తలనీలాలు సమర్పించి మొదటగా అన్న ప్రసాదంతో పాటుగా.. స్వామివారి లడ్డును కూడా ఆ బిడ్డకు తినిపించే ఆచారం ఈ హిందూ భక్తులకు ఉంది. ఆ లడ్డు నాణ్యత, రుచి, రంగు, పరిణామము (సైజు, తూకం) అందులో ఉండవలసిన అన్ని వస్తువులు ఈ దేశ ప్రజలందరికీ సుపరిచితమే.

పుట్టిన బిడ్డ నుండి ఆ లడ్డు ప్రసాదాన్ని అంత పవిత్రంగా భావిస్తారు. మరి అటువంటి పవిత్రమైన లడ్డూకు వాడే నెయ్యిలో పంది మాంసం తో సహా కల్తీ కలిపారు. అంటే అంత నీచ, నికృష్టపని చేసిన వారికి, చేయించిన వారికి, అమలు చేసిన వారికి భగవంతుడు కఠినాతి కఠినమైన శిక్షణ శిక్షించక తప్పడు. దానికి కారణం ఆ పరిపాలిస్తున్న ప్రభుత్వ పెద్దలకు కాక ఎవరికి వేయాలి?

ఈ జరిగిన తప్పుకు శ్రీ వెంకటేశ్వర స్వామే విపరీతమైన ప్రచారం కల్పించుకొని, భక్తుల చేత పాప ప్రక్షాళన చేయించుకొని, (అందులో భాగమే శ్రీ పవన్ కళ్యాణ్ గారి 11 రోజులు దీక్ష) జగన్మోహన్ రెడ్డి కి ఈ ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాలలో పనికిరాడని.. ప్రజలందరూ చీకొట్టేటట్టుగా నిర్ణయం చేసుకొని, ఈ హిందూ సమాజం నుంచి వెలివేసినట్టుగా చేసి, జరిగిన తప్పుకు సరిపోయే శిక్ష వేస్తాడని భక్తులందరూ భావిస్తున్నారు.

– కరణం భాస్కర్
బిజెపి రాష్ట్ర నాయకులు,
7386128877

LEAVE A RESPONSE