తెలంగాణలో ప్రతి ఇంటిలో తెలుగుదేశంపార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబుకు సంబంధించిన జ్ఞాపకాలు
– తెలుగుదేశంపార్టీ తెలంగాణ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్
ఎన్.టీ.రామారావు శతజయంతి ఉత్సవాలనేపథ్యంలో అంగరంగ వైభవంగానిర్వహిస్తున్న మహానాడుకి విచ్చేసిన ప్రతిఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. స్వర్గీయ ఎన్.టీ.ఆర్ ఒకశక్తి. తెలుగువారి ఆత్మగౌరవాన్ని కాపాడిన ధీశాలి. తెలుగుప్రజల ఆశలు అడియాశలవుతున్న తరుణంలో నమ్మినప్రజలకోసం తెలుగుదేశంపార్టీని స్థాపించారు. పెత్తందారీ వ్యవస్థ కబంధహస్తాల్లో నలిగిపోతున్న బడుగుబలహీనవర్గాలు, దళితులకు అండగా నిలిచి, పేదలకు కడుపునిండా తిండి, ఉండటానికిఇల్లు, కట్టుకోవడానికి బట్ట ఉండేలా గొప్పపథకాలు తీసుకొచ్చారు.
రూ.2లకే కిలోబియ్యం, జనతావస్త్రాలపంపిణీ, పేదలకుపక్కాఇళ్లు, రాజకీయంగా బీసీలకు రిజర్వేషన్లు, మాండలికవ్యవస్థ తీసుకురావడం, పటేల్ పట్వారీ వ్యవస్థరద్దుచేయడ వంటిగొప్ప పథకాలు తీసుకొచ్చారు. చంద్రబాబు పటిష్టమైన నాయకత్వంలో పల్లెలు, పట్టణాలను అభివృద్ధిపథంలో నడిపారు. చంద్రబాబు చేసిన పనులు, ఎన్టీఆర్ రాజకీయల్లో చూపిన చొరవ ఎప్పటికీ ప్రజల గుండెల్లో పదిలంగా ఉంటాయి.
తెలంగాణలో మినీమహానాడు, ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాలు చేపట్టాం. ప్రజల్లోకి వెళితే చంద్రబాబుగారు చేసిన పనులు కళ్లముందు కనిపిస్తున్నాయి. అవిచూసి ఆశ్చర్యపోయిన సందర్భాలు అనేకం. ఎక్కడచూసినా, ఏ గ్రామానికి వెళ్లినా తెలంగాణలో ప్రతిఇంటిలో తెలుగుదేశంపార్టీ, స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబుకు సంబంధించిన జ్ఞాపకాలు కనిపిస్తాయి. క్రమశిక్షణ, పట్టుదలకు మారుపేరు చంద్రబాబు, ఆ క్రమశిక్షణతోనే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధిచేసి ప్రపంచపటంలో నిలిపారు. మా పిచ్చోడు, ఇక్కడున్న సైకోగానీ ప్రజల్ని భయపెట్టే పనులు చేస్తున్నారుగానీ, వారికి ఉపయోగపడే పనులుచేయడం లేదు.పసుపుజెండాలు చేతపట్టి యువతీయువకులు ముందునడిస్తేనే తెలుగు రాష్ట్రాలకు, తెలుగు ప్రజలకు న్యాయం జరుగుతుంది.
కోమటి జయరాం ఏమన్నారంటే..
• రాష్ట్రంలో దుర్మార్గపు పాలనను అంతం చేయాలని అమెరికాలో 4 లక్షల తెలుగు వాళ్లు నడం కట్టారు.
• తెలుగు తమ్ముళ్లను ఎన్ఆర్ఐ విభాగం తరుపున ఆదుకునేందుకు సిద్ధంగా ఉన్నాం.• చంద్రబాబు నాయుడును ముఖ్యమంత్రి చేసేందుకు ఎన్ఆర్ఐలు దృడ నిత్చయంతో ఉన్నాం.
• ఎంతో మంది ఎన్ఆర్ఐలు మహానాడుకు తరలివచ్చాం.
• రాష్ట్రాన్ని సరిచేయగల ఒక్క మగాడు చంద్రబాబు మాత్రమే.
• అమెరికాల్లో 60 నగరాల్లో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాలను జరుపుకుంటున్నాం.
• న్యూయార్క్ టైమ్ స్కేర్స్ లో ఎన్టీఆర్ విగ్రహాన్ని ప్రదర్శింపజేశాం.
తెలంగాణ రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షురాలు కాట్రగడ్డ ప్రసూన ఏమన్నారంటే..
మహిళల విధిరీతను మార్చిన కందుకూరి వీరేశిలింగం పుట్టిన రాజమహేంద్రవరంలో, స్త్రీకి శారద చట్టం ద్వారా ఔన్నత్యం కల్పించిన అంబేద్కర్ పేరును ఈ జిల్లాల్లో మహానాడు ఏర్పాటు చేయడం గర్వకారణం. రైతన్నను ఆర్ధికంగా పైకి తీసుకురావలన్నదే చంద్రబాబు ద్యేయం. వ్యవసాయానికి ప్రధాన్యం ఇచ్చిన ఘనత టీడీపీకే దక్కుతుంది. నేడు రైతులు ధీన స్థితిలో ఉన్నా కేసీఆర్, జగన్ రెడ్డిలు చోద్యం చూస్తున్నారు.
పొలిట్‌బ్యూరో సభ్యురాలు తిరునగరి జోత్స్నా ఏమన్నారంటే..
అనుక్షణం నా ఆడపడుచులంటూ ఎన్టీఆర్ పలకటం ఆనందదాయకం.టీడీపీ హయాంలో దేశ వ్యాప్తంగా మహిళలకు కమీషన్ తెచ్చారు.మహిళలకు విశ్వవిద్యాలయం, ఆస్థిలో సమాన హక్కు కల్పించింది టీడీపీ. మహిళల రిజర్వేషన్ కోసం బిల్లు పెట్టిన పార్టీ టీడీపీ. 17 శాతం మహిళలపై అఘాయిత్యాలు పెరిగిపోయాయి.
తెలుగుమహిళ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు భవనం షకీలారెడ్డి ఏమన్నారంటే..
మహిళలకు ఆస్తిహక్కు కల్పించిన మహానుభావుడు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని, తెలుగు ప్రజలు ఆదరించాల్సిన బాధ్యత ఉంది. తెలంగాణలో మహిళలకు రక్షణ లేదు. టీడీపీ హయాంలో తెలంగాణ మహిళలు ధైర్యంతో బతికారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. చంద్రబాబునాయుడు వేసిన అభివృద్ధి మొక్క, ఇప్పుడు తెలంగాణలో మహావృక్షమై, అందరికీ నీడ నిచ్చింది. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్న సౌకర్యాలు, సంపద అంతా చంద్రబాబు చలవే. అందుకు తెలంగాణ ప్రజల తరఫున బాబుకు కృతజ్ఞతలు. చంద్రబాబు ప్రోత్సాహంతో మళ్లీ తెలంగాణలో పార్టీ రెపరెపలాడేలా పనిచేస్తాం.
సామా భూపాల్ రెడ్డి ఏమన్నారంటే..
పేద ప్రజల గుండెల్లో గూడు కట్టుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు.అకాల వర్షాలతో తెలంగాణ ప్రాంతాల్లో రైతులు కన్నీరు మున్నీరు అవుతున్నా కేసీఆర్ మాత్రం ప్రగతి భవన్ నుంచి భయటకు రాని పరిస్థితి.పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. సబ్సిడీలు లేవు, రైతన్న లు తీవ్ర దుర్బర పరిస్థితిలో ఉన్నారు.