ప్రతి ఎమ్మెల్యే చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి టీం ని ఏర్పాటు చేసుకోవాలి

-సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి
-ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ పై కేటీఆర్ టెలికాన్ఫరెన్స్

ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షులు కేసీఆర్ ఆత్మీయ సమ్మేళనాల నిర్వహణ కార్యక్రమాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు ఆత్మీయ సమ్మేళనాలు కొనసాగుతున్న తీరుపైన పార్టీ సీనియర్ నాయకులు మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఆధ్వర్యంలో పదిమందితో కూడిన కార్యక్రమాల అమలు కమిటీని ఏర్పాటు చేసుకున్నాం. ఈ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాల కార్యక్రమాలు జరుగుతున్న తీరును పరిశీలిస్తుంది. వీరికి పూర్తి సహాయ సహకారాలు అందించాలని, జిల్లా పార్టీ అధ్యక్షులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు, ఎమ్మెల్యేలకు విజ్ఞప్తి చేసిన కేటీఆర్.

ఈ కమిటీ ద్వారానే కెసిఆర్ పార్టీ కార్యక్రమాల అమలు పర్యవేక్షణ తీరు, వాటికి సంబంధించిన ఫీడ్బ్యాక్ ను తీసుకుంటారు. ఈ విషయాన్ని గుర్తించి ఈ కమిటీకి అన్ని రకాల సహాయ సహకారాలు అందించాలి. ఈ ఎన్నికల సంవత్సరంలో ప్రతి ఎమ్మెల్యే అత్యంత చురుకైన పార్టీ కార్యకర్తలతో కలిపి ఒక టీంని ఏర్పాటు చేసుకోవాలి. ఈ టీం ద్వారా అటు పార్టీకి ప్రజలకు నిరంతరం సమాచారం అందించేందుకు, పార్టీ కార్యక్రమాలను మరింత సమర్థవంతంగా నిర్వహించుకునేందుకు ఉపయోగించుకోవాలి. ప్రతి నియోజకవర్గంలో సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా పార్టీ మరియు ప్రభుత్వ కార్యక్రమాలను తీసుకుపోయేందుకు సోషల్ మీడియా కమిటీలను మరింత బలోపేతం చేసుకోవాలి.

ఈ ఆత్మీయ సమ్మేళనాలు మే నెల వరకు కూడా చేసుకోవచ్చని పార్టీ అధ్యక్షులు కేసీఆర్ అనుమతి ఇచ్చిన నేపథ్యంలో మరింత విస్తృతంగా, కూలంకషంగా, అత్యంత పకడ్బందీగా నిర్వహించుకునేలా ప్రణాళికలు రూపొందించుకోవాలని పార్టీ ఎమ్మెల్యేలకు సూచించిన కేటీఆర్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమంలో ప్రతి ఒక్క భారత రాష్ట్ర సమితి కార్యకర్తను భాగస్వామిని చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకు పోవాలి. ప్రతి ఆత్మీయ సమ్మేళనం కచ్చితంగా ముఖ్యమంత్రి పార్టీ కార్యకర్తలకు రాసిన ఆత్మీయ సందేశంతోనే ప్రారంభించుకోవాలి. ముఖ్యమంత్రి కెసిఆర్ ఆత్మీయ సందేశం, ప్రతి కార్యకర్తకు అందేలా అవసరమైన కరపత్రాల లాంటి మెటీరియల్స్ ని సిద్ధం చేసి విస్తృతంగా పంపిణీ చేసుకోవాలి.

పార్టీ తరఫున ఎన్నికైన ప్రజాప్రతినిధులు, పదవుల్లో కొనసాగుతున్న ప్రతి ఒక్కరూ ఈ ఆత్మీయ సమ్మేళనాల్లో హాజరయ్యేలా ఎమ్మెల్యేలు, జిల్లా పార్టీ అధ్యక్షులు ప్రత్యేకంగా చొరవ తీసుకోవాలి ఈ ఆత్మీయ సమ్మేళనాల ద్వారా పార్టీగా, ప్రభుత్వంగా ప్రజలకు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూడా తీసుకుపోయేందుకు అవకాశం లభిస్తుంది. తెలంగాణ సాధించిన అభివృద్ధిపై విస్తృతంగా మాట్లాడే ప్రజాప్రతినిధులను, వక్తలను ప్రత్యేకంగా ఇందుకు ఉపయోగించుకోవాలని సూచన. తెలంగాణ రాకముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత జరిగిన అభివృద్ధి, అందివచ్చిన సంక్షేమ కార్యక్రమాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి. ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకుపోయేందుకు పార్టీ కార్యకర్తలను సమాచార సైనికులుగా తయారు చేసేందుకు ఈ ఆత్మీయ సమ్మేళనాలు అద్భుతంగా ఉపయోగపడతాయి.

Leave a Reply