– మాజీ మంత్రి కే.ఎస్ జవహర్
తాడేపల్లి ప్యాలెస్ నుంచి వస్తున్న పెడిగ్రీ ని తిని ద్వారంపూడి లాంటి వారు మొరుగుతున్నారు. లోకేష్ వేసే ప్రతి అడుగు, చెప్పే ప్రతి మాట వైకాపా పాలకుల గుండెల్లో తుపాకి తూటాల్లా దిగుతున్నాయి. యువత భవిష్యత్తుకై ప్రజల మధ్యకు యువనేత వచ్చారు. యువగళం యాత్రకు అడుగడుగునా ప్రజలు నీరాజనం పలుకుతున్నారు. అది చూసి ఓర్వలేని జగన్ రెడ్డి తన పెంపుడు ఎమ్మెల్యేలు, మంత్రులకు స్క్రిప్ట్ రాసి వాళ్ల చేత మొరిగిస్తున్నాడు.
రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం చేతకాక అప్పుల ఊబిలోకి నెట్టి చివరకు గంజాయి ఆంధ్రప్రదేశ్‌గా మార్చారు. కోడి కత్తి డ్రామాలు, గొడ్డలి వేట్లు, దొంగ దారుల్లో అధికారం దక్కించుకునే సంస్కారం వైసీపీలోనే ఉంది. నమ్మిన ప్రజలను మోసం చేయటం వైసీపీ నైజం. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా, ధర్మ మార్గంలో చట్ట సభలకు వెళ్తారు తప్ప.. దొడ్డి దారిన కాదు. వైకాపా ఎంపీలు రాజ్యసభకు ఎలా వెళ్ళారు? అది కూడా దొడ్డి దారేనా? వైసీపీ నేతలకు రాజ్యాంగమన్నా, చట్టాలన్నా లెక్కలేకుండా పోయింది.
లోకేష్ ఓడిపోయినా కృంగి పోలేదు. ప్రజల మధ్యనే ఉండి ప్రజానాయకుడిగా ఎదిగారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూసి వైసీపీకి ఓటమి భయం పట్టుకుంది. అందుకే దిగజారుడు రాజకీయం మొదలు పెట్టారు. ఎన్ని అడ్డదారులు తొక్కినా, ఎన్ని డ్రామాలు ఆడినా, ఏం చేసినా ఈ సారి అధికారంలోకి రాబోయేది తెలుగుదేశం పార్టీనే. వైసీపీ పతనానికి కౌంట్ డౌన్ మొదలైంది. వైసీపీ దుకాణం సర్దుకునే సమయం దగ్గర పడింది. ద్వారంపూడి లాంటి వారు దొడ్డి దారిన దారుణంగా సంపాదించి ఏ దొడ్డిలో ఎంత దాచిపెట్టారు అధికారంలోకి రాగానే బయటపెడతాం. తప్పకుండా వారిని శిక్షిస్తాం.